Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నొవాక్ జకోవిచ్‌కు బిగ్ షాక్

ఫ్రెంచ్ ఓపెన్ సన్నాహకాల్లో ఉన్న సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్‌కు బిగ్ షాక్ తగిలింది. మాడ్రిడ్ ఓపెన్‌లో అతను తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టింది. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్‌లో నొవాక్ జకోవిచ్ 3-6, 4-6 తేడాతో వరుస సెట్లలో మాటొ ఆర్నాల్డి(ఇటలీ) చేతిలో ఓటమిపాలయ్యాడు. కెరీర్‌లో 100వ ఏటీపీ టైటిల్‌పై కన్నేసిన నొవాక్ జకోవిచ్.. 32 అవనసవర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు.

ఆర్నాల్టీతో ఆడటం జకోవిచ్‌కు ఇదే తొలిసారి. ఈ సీజన్‌లో నొవాక్ జకోవిచ్‌కు ఇది వరుసగా మూడో పరాజయం. మాడ్రిడ్ ఓపెన్ ముందుకు మియామి ఫైనల్, మాంటె కార్లో మాస్టర్స్‌లో ప్రిక్వార్టర్స్‌లోనూ జకోవిచ్ ఓటమిపాలయ్యాడు. మే 25న ఫ్రెంచ్ ఓపెన్‌కు తెరలేవనున్న విషయం తెలిసిందే.

25వ గ్రాడ్‌స్లామ్ టైటిలే లక్ష్యంగా జకోవిచ్.. ఫ్రెంచ్ ఓపెన్ బరిలోకి దిగుతున్నాడు. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్‌లో జకోవిచ్‌కు నిరాశే ఎదురైంది. అసాధారణ ప్రదర్శనతో సెమీఫైనల్ చేరిన ఈ సెర్బియా స్టార్.. గాయంతో టోర్నీ నుంచి తప్పుకున్నాడు.

Madrid Open 2025 Novak Djokovic s poor 2025 run continues after first round exit

జర్మనీ స్టార్ అలెగ్జాండ్ జ్వెరెవ్‌తో జరిగిన సెమీఫైనల్లో గాయం కారణంగా మధ్యలోనే వైదొలిగాడు. గాయం నుంచి కోలుకున్న జకోవిచ్.. ఏటీపీ టోర్నీల్లో బరిలోకి దిగాడు. కానీ వరుసగా మూడు టోర్నీల్లోనూ అతను ఓటమిపాలయ్యాడు. కీలక ఫ్రెంచ్ ఓపెన్‌కు ముందు జకోవిచ్ పేలవ ఫామ్ అతన్ని ఫ్యాన్స్‌ను కలవరపెడుతోంది.

Story first published: Sunday, April 27, 2025, 9:13 [IST]
Other articles published on Apr 27, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+