Italian Open: కింగ్ ఆఫ్ క్లే ‘దశ ధీర’ నాదల్.. ఫైనల్లో జొకోవిచ్‌పై విజయం!

రోమ్: టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ తనకచ్చొచ్చిన ఎర్రమట్టిలో దుమ్మురేపాడు. ఆదివారం ముగిసిన రోమ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్-1000(ఇటాలియన్ ఓపెన్) టోర్నీలో నాదల్ చాంపియన్‌గా నిలిచాడు. 2 గంటల 49 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్ నాదల్ 7-5, 1-6, 6-3తో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్, డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)ను ఓడించాడు. ఇది నాదల్ కెరీర్‌లో 88వ సింగిల్స్ టైటిల్. గత ఫ్రెంచ్‌ఓపెన్ ఫైనల్లో జొకోను చిత్తుచేసిన నదాల్.. తాజా గెలుపుతో ఈసారీ క్లే కోర్టు గ్రాండ్‌స్లామ్ ఫేవరెట్‌నని చాటిచెప్పాడు.

దస్ కా దమ్..
రికార్డుస్థాయిలో పన్నెండోసారి ఫైనల్ చేరిన నాదల్‌కిది పదో ఇటాలియన్ ఓపెన్ ట్రోఫీ కావడం విశేషం. 34 ఏళ్ల నాదల్ రోమ్ ఓపెన్ టైటిల్‌ను నెగ్గడం ఇది పదోసారి కావడం విశేషం. ఈ స్పెయిన్ స్టార్ 2005, 2006, 2007, 2009, 2010, 2012, 2013, 2018, 2019లలో కూడా ఇక్కడ టైటిల్ సాధించాడు. తద్వారా ఒకే టోర్నమెంట్‌ను నాలుగుసార్లు కనీసం 10 లేదా అంతకంటే ఎక్కువసార్లు గెలిచిన ప్లేయర్‌గా తన రికార్డును మెరుగుపర్చుకున్నాడు. నాదల్ 13 సార్లు ఫ్రెంచ్ ఓపెన్‌ను... బార్సిలోనా ఓపెన్‌ను 12 సార్లు... మోంటెకార్లో మాస్టర్స్ సిరీస్ టోర్నీని 11 సార్లు గెలిచాడు.

రూ. 2 కోట్ల 18 లక్షలు..
ఈ విజయంతో అత్యధిక మాస్టర్స్ సిరీస్ టైటిల్స్ నెగ్గిన ప్లేయర్‌గా జొకోవిచ్ (36 టైటిల్స్) పేరిట ఉన్న రికార్డును నాదల్ (36 టైటిల్స్) సమం చేశాడు. అంతేకాకుండా జొకోవిచ్‌తో ముఖాముఖి రికార్డులో ఆధిక్యాన్ని 28-29కి తగ్గించాడు. రోమ్ ఓపెన్ విజేత హోదాలో నాదల్‌కు 2,45,085 యూరోల (రూ. 2 కోట్ల 18 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. రన్నరప్ జొకోవిచ్ ఖాతాలో 1,45,000 యూరోల ప్రైజ్‌మనీ (రూ. కోటీ 29 లక్షలు)తోపాటు 600 ర్యాంకింగ్ పాయింట్లు దక్కాయి. రోమ్ ఓపెన్‌లో జొకోవిచ్ ఐదుసార్లు విజేతగా నిలిచి, ఆరుసార్లు రన్నరప్‌తో సంతృప్తి పడ్డాడు.

హోరాహోరీ..
జొకోవిచ్‌తో జరిగిన ఫైనల్లో తొలి సెట్ హోరాహోరీగా జరిగింది. 75 నిమిషాలపాటు జరిగిన తొలి సెట్ తొలి గేమ్‌లోనే నడాల్ సర్వీ్‌సను బ్రేక్ చేసిన ఆధిక్యంలోకి దూసుకెళ్లిన జొకో.. అదే జోరులో రెండో గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. అయితే, రఫా నెమ్మదిగా పుంజుకొన్నాడు. 2-3తో వెనుకబడిన సమయంలో.. ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసిన రఫా 3-3తో సమం చేశాడు. ఆ తర్వాత ఇద్దరూ హోరాహోరీగా పోరాడడంతో ఆధిక్యం చేతులు మారుతూ 5-5తో సమమైంది. అయితే, వరుసగా రెండు గేమ్‌లు నెగ్గిన రఫా 7-5తో తొలి సెట్‌ను సొంతం చేసుకొన్నాడు. రెండో సెట్‌లో మాత్రం పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శించిన నొవాక్ 6-1తో నెగ్గాడు. ఇక నిర్ణాయక మూడో సెట్‌లో 4-2తో పైచేయి సాధించిన రఫా.. అదే జోరులో 6-3తో సెట్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకొన్నాడు.

లక్ కలిసొచ్చింది..
ఈ టోర్నీలో తనకు అదృష్టం కలిసొచ్చిందని, మొత్తానికి ఈ విజయం పట్ల సంతోషంగా ఉన్నానని రాఫెల్ నాదల్ తెలిపాడు. 'ఈ టోర్నీలో నాకు అదృష్టం కూడా కలిసొచ్చింది. ముఖ్యంగా షపవలోవ్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండుసార్లు మ్యాచ్ పాయింట్లను కాచుకొని గట్టెక్కాను. ఓవరాల్‌గా ఈ టోర్నీలో బాగా ఆడాను.'అని చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications