న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అది నావల్ల కాదని ఎవరైనా అంటే.. చేసి చూపిస్తా: సానియా

I am a Bit of an Internal Rebel: Sania Mirza Shows How She Lost 26kgs in 4 Months

హైదరాబాద్: పాకిస్థాన్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌తో పెళ్లి, కుమారుడు ఇజాన్ పుట్టిన తర్వాత భారత స్టార్ టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా తన ఫిట్ నెస్ విషయంలో దృష్టి సారించారు. ఈ క్రమంలో కుర్ర హీరోయిన్లకు పోటీ ఇచ్చేంతగా నాజుకుగా తయారయ్యారు. గర్భం దాల్చడంతో 23 కిలోల బరువు పెరిగిన‌ సానియా.. ఆ తర్వాత కేవలం 4 నెలల్లోనే 26 కిలోలు తగ్గి ఆశ్చర్యపరిచారు. తిరిగి టెన్నిస్‌ బాట పట్టిన ఆమె వచ్చే ఏడాది ఒలింపిక్స్‌కు సన్నద్ధమవుతున్నారు.

నావల్ల కాదంటే ఒప్పుకోను

నావల్ల కాదంటే ఒప్పుకోను

బరువు తగ్గడానికి కారణం తనకున్న వెనకడుగు వేయని వ్యక్తిత్వమేనని అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక ఆన్‌లైన్‌ కార్యక్రమంలో సానియా మీర్జా వెల్లడించారు. బరువు తగ్గడానికి తాను చేసిన కసరత్తులను వీడియోలో వివరించిన సానియా అందులో మాట్లాడుతూ... 'ఏదైనా సరే అది నా వల్ల కాదు అని నన్ను ఎవరైనా అంటే నేను ఒప్పుకోను. అది చేసి చూపిస్తా. వెనకడుగు వేయని తత్వం నాది. టెన్నిస్‌పై నాకున్న ప్రేమ వ్యాయామం చేసే దిశగా నడిపించింది' అని అన్నారు.

ఇంకెవరూ చేయనిది చేయాలనుకున్నా

ఇంకెవరూ చేయనిది చేయాలనుకున్నా

'ఈ ప్రపంచంలో ఇంకెవరూ చేయనిది నేను చేయాలనుకున్నా. మానసిక బలాన్ని నమ్ముకున్నా. ఇష్టమైన వాటిని తినకుండా నిగ్రహించుకున్నా. రోజుకు కనీసం అర్ధగంట వ్యాయామం చేయడం ముఖ్యం. ప్రసవానంతర కుంగుబాటుకు లోనుకాకుండా కసరత్తులు మేలు చేశాయి. రియో (2016) ఒలింపిక్స్‌లో ఓటమి నా జీవితంలోని తీవ్ర బాధాకరమైన సంఘటనల్లో ఒకటి. మరో ఒలింపిక్స్‌ ఆడతానని ఆ తర్వాత అనుకోలేదు. కానీ తిరిగి ఆటలో అడుగుపెట్టినపుడు వచ్చే ఒలింపిక్స్‌లో ఆడి పతకం గెలవాలనుకున్నా' అని ఆమె పేర్కొన్నారు.

బరువు తగ్గాలని లక్ష్యంగా పెట్టుకున్నా

బరువు తగ్గాలని లక్ష్యంగా పెట్టుకున్నా

'ఇజాన్ పుట్టిన తర్వాత నా బరువు గురించి చాలా మంది ప్రశ్నించారు. కానీ.. ఇప్పుడు బరువు తగ్గడం ఎలా సాధ్యమైందని వారే అడుగుతున్నారు. డెలివరీ అనంతరం 23 కేజీల బరువు తగ్గాలని లక్ష్యంగా పెట్టుకున్నా. జిమ్‌లో కస్టపడి 26 కేజీల బరువు తగ్గా. శ్రమ, ఏకాగ్రత వల్లనే ఇది సాధ్యమైంది. మహిళలకు ఓ మాట చెప్పదలుచుకున్నా. నేనే సాధించాను అంటే.. అది మీకు కూడా సాధ్యమవుతుంది. రోజుకు ఒకటి రెండు గంటలకు జిమ్‌లో కష్టపడండి. మీరే ఫలితాలను చూస్తారు. మనం తలుచుకుంటే ఏదైనా సాధ్యమే' అని ఇన్‌స్టాగ్రామ్‌లో ఇదివరకు సానియా తెలిపారు.

నాపై నిషేధానికి కారణమేంటో ఇప్పటికీ తెలియదు: అజహరుద్దీన్‌

Story first published: Thursday, July 30, 2020, 13:33 [IST]
Other articles published on Jul 30, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X