Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నాపై నిషేధానికి కారణమేంటో ఇప్పటికీ తెలియదు: అజహరుద్దీన్‌

Mohammad Azharuddin says I Really Don’t Know The Reasons For Banning Me

కరాచీ: తనపై జీవితకాల నిషేధం విధించడానికి కారణమేంటో ఇప్పటికీ తెలియదని భారత మాజీ కెప్టెన్‌, హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్షుడు మహమ్మద్‌ అజారుద్దీన్‌ అన్నాడు. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణల కారణంగా 2000 డిసెంబరులో అజహర్‌పై రత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) జీవితకాల నిషేధం విధించింది. న్యాయస్థానంలో సుదీర్ఘంగా పోరాడిన అజహర్‌కు 2012లో ఉపశమనం లభించింది. అతడిపై నిషేధాన్ని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఎత్తేసింది.

 నిషేధానికి కారణమేంటో:

నిషేధానికి కారణమేంటో:

మహమ్మద్‌ అజారుద్దీన్‌ ఇటీవలే మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణల నుంచి బయటపడి హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఫిక్సింగ్‌ ఆరోపణల తర్వాత తిరిగి బీసీసీఐ ఏజీఎంలో అడుగుపెట్టడం, ఈడెన్‌ గార్డెన్స్‌లో గంట మోగించడం చాలా సంతృప్తినిచ్చాయని అజ్జూభాయ్‌ చెప్పాడు. బుధవారం క్రికెట్‌ పాకిస్థాన్‌ వెబ్‌సైట్‌తో అజారుద్దీన్‌ మాట్లాడుతూ... 'జరిగిన దానికి ఎవరినీ నిందించాలని అనుకోవట్లేదు. నాపై నిషేధం విధించడానికి కారణమేంటో ఇప్పటికీ తెలియదు. నిషేధానికి వ్యతిరేకంగా పోరాడాను. 12 ఏళ్ల తర్వాత నిర్దోషిగా తేలాను. హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఎన్నికై. బీసీసీఐ ఏజీఎంకు హాజరైనప్పుడు ఎంతో సంతృప్తిగా అనిపించింది' అని అజ్జూ తెలిపాడు.

ఇంతకన్నా ఎక్కువ ఏం కావాలి:

ఇంతకన్నా ఎక్కువ ఏం కావాలి:

'భారత్ తరపున నా కెరీర్‌లో 99 టెస్టులు ఆడాను. మరో మ్యాచ్‌ ఆడితే సెంచరీ పూర్తయ్యేది. ఆ ఒక్కటి ఆడనందుకు ఎలాంటి అసంతృప్తి లేదు. 16 ఏళ్ల పాటు దేశానికి ప్రాతినిధ్యం వహించా. అందులో దాదాపు పదేళ్లు కెప్టెన్‌గా వ్యవహరించా. మూడు ప్రపంచకప్‌లలో కెప్టెన్‌గా జట్టును నడిపించా. ఇంతకన్నా ఎక్కువ ఏం కావాలి' అని మహమ్మద్‌ అజారుద్దీన్‌ అన్నాడు. అంతర్జాతీయ కెరీర్‌లో అజారుద్దీన్‌ 99 టెస్టుల్లో, 334 వన్డే మ్యాచ్‌ల్లో భారత్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. టెస్టుల్లో 6215 పరుగులు, వన్డేల్లో 9378 రన్స్ బాదాడు.

 జహీర్‌ అబ్బాస్‌ సలహాలతో:

జహీర్‌ అబ్బాస్‌ సలహాలతో:

'1989 పాకిస్థాన్‌ పర్యటన సమయంలో ఫామ్‌ కోల్పోయి ఇబ్బందులు పడ్డా. ఆ సమయంలో మేము కరాచీలో ప్రాక్టీస్‌ చేస్తుంటే జహీర్‌ అబ్బాస్‌ భాయ్‌ అక్కడికి వచ్చాడు. నీకు ఏమైంది ఎందుకు త్వరగా ఔటవుతున్నావని ప్రశ్నించాడు. నేను నా సమస్యను ఆయనతో చెప్పా. దీంతో చిన్నపాటి సూచనలు చేశారు. గ్రిప్‌ మార్చమని ఆయన ఇచ్చిన సలహా నాకు ఎంతగానో ఉపయోగపడింది. అక్కడి నుంచి మళ్లీ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది' అని అజ్జూ చెప్పాడు.

 ఫీల్డింగ్‌ అంటే ప్రాణం:

ఫీల్డింగ్‌ అంటే ప్రాణం:

'2016 ఇంగ్లండ్‌ పర్యటన సందర్భంగా యూనిస్‌ ఖాన్‌ బ్యాటింగ్‌ చూస్తే చాలా ఇబ్బందిగా అనిపించింది. అందుకే అతడికి కొన్ని సలహాలు ఇచ్చా. వాటిని అతడు స్వీకరించడం ఆనందాన్నిచ్చింది. ఆ తర్వాత అతడు ఓవల్‌ టెస్టులో ద్విశతకంతో చెలరేగాడు. పాత రోజుల్లో చాలా మంది ఆటగాళ్లు ఫీల్డింగ్‌ను పెద్దగా పట్టించుకునే వారు కాదు. కానీ నాకు ఫీల్డింగ్‌ అంటే ప్రాణం. ఒక మంచి క్యాచ్‌ పట్టినప్పుడు బ్యాటింగ్‌, బౌలింగ్‌ కన్నా ఫీల్డింగ్‌నే ఎక్కువ ఆస్వాదిస్తా' అని భారత మాజీ కెప్టెన్ చెప్పుకొచ్చాడు‌.

కెప్టెన్‌గా, కీపర్‌గా ధోనీపై ఒత్తిడి ఎంత‌ఉంటుందో ఆ రోజు తెలిసింది: కోహ్లీ

Story first published: Thursday, July 30, 2020, 13:03 [IST]
Other articles published on Jul 30, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+