న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆస్ట్రేలియా ఓపెన్‌లో సంచలనం.. మాజీ వరల్డ్ నెం.1ను ఓడించిన 15 ఏళ్ల అమ్మాయి

Gauff bests Venus again in blockbuster Australian Open rematch

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్‌ ప్రారంభమైన తొలి రోజే సంచలన విజయం నమోదైంది. అమెరికా టీనేజ్‌ గర్ల్ కోరి గౌఫ్‌ అద్భుత విజయాన్నందుకుంది. అమెరికాకే చెందిన మాజీ వరల్డ్ నంబర్ వన్ వీనస్ విలియమ్స్‌ను తొలి రౌండ్‌లోనే మట్టికరిపించింది. సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో 15 ఏళ్ల గాఫ్ 7-6(5), 6-3తో వీనస్ విలియమ్స్‌ను ఓడించింది. ఆద్యాంతం అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్న గాఫ్.. వరుస సెట్లలో ప్రత్యర్థిని ఓడించి సెకండ్ రౌండ్‌లోకి ప్రవేశించింది.. మంగళవారం జరిగే రెండో రౌండ్‌లో సొరానా సిర్‌స్టి(రొమెనియా)తో తలపడుతుంది.

విలియమ్సన్‌ను ఓడించడం గాఫ్‌కు ఇది రెండో సారి. గతేడాది జరిగిన ప్రతిష్టాత్మక వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ తొలి రౌండ్‌లోనే వినస్ విలియమ్స్‌ను గాఫ్ మట్టికరిపించింది.

ఆమెకు ఆకాశమే హద్దు..
తనను ఓడించిన గాఫ్‌కు ఆకాశమేహద్దని వినస్ వీలియమ్స్ కొనియాడింది.' విజయం కోసం గాఫ్ చాలా కష్టపడుతోంది. ఈ వయస్సులోనే ఆమె చాలా పరిణతి చెందింది. ఇక ఆమెకు ఆకాశమే హద్దు'అని ఏడు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు నెగ్గిన వీనస్ తెలిపింది.

గొప్ప అనుభూతి..
ఈ కోర్టు .. క్రౌడ్ కోసమే ఇన్నాళ్లు ఎదురుచూశానని గాఫ్ తెలిపింది. 'వీనస్ బాగా ఆడింది. డ్రా చూసి నేను కొంత ఆశ్చర్యానికి లోనయ్యా. నిరూత్సాహపడ్డా. కానీ అదృష్టం కొద్ది విజయం సాధించా. చాలా గొప్పగా ఫీలవుతున్నా. వాస్తవానికి నాకు కావాల్సింది ఇదే. ఈ కోర్టు.. ఈ క్రౌడ్ కోసమే ఇన్నాళ్లు ఎదురుచూశా'అని ఈ అమెరికా టీనేజర్ తెలిపింది.

వింబుల్డన్ టోర్నీ ద్వారా ఓపెన్‌ శకంలో (1968 నుంచి) మెయిన్‌ 'డ్రా'కు అర్హత పొందిన అతి పిన్న వయస్కురాలిగా (15 ఏళ్ల 122 రోజులు) గాఫ్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. 2009 వింబుల్డన్‌లో బ్రిటన్‌కు చెందిన లారా రాబ్సన్‌ 15 ఏళ్ల వయసులో మెయిన్‌ 'డ్రా'లో ఆడింది. అయితే లారా రాబ్సన్‌కు టోర్నీ నిర్వాహకులు నేరుగా మెయిన్‌ 'డ్రా'లో ఆడేందుకు వైల్డ్‌ కార్డు ఇచ్చారు.

Story first published: Monday, January 20, 2020, 16:05 [IST]
Other articles published on Jan 20, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X