For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

French Open 2025: సబలెంకా శుభారంభం

ప్రతిష్టాత్మక ఫ్రెంచ్ ఓపెన్ 2025 టెన్నిస్ టోర్నీలో టాప్ సీడ్, బెలారస్ ప్లేయర్ అరీనా సబలెంకా శుభారంభం చేసింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో సబలెంకా 6-1, 6-0 తేడాతో రష్యా ప్లేయర్ కమీలా రఖిమోవాపై విజయం సాధించింది. పూర్తిగా ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో సబలెంక 5 ఏస్‌లు, 30 విన్నర్లు కొట్టింది. మరో ఐదుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసింది. గంటలోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో సబలెంకా పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ఆమె తదుపరి రౌండ్‌లో జిల్ టెచ్‌మాన్‌తో తలపడనుంది.

ఇతర మహిళల సింగిల్స్ మ్యాచ్‌లో ఎలినా స్విటోలినా 6-1, 6-1తో జైనెప్ సోన్‌మెజ్‌పై, విక్టోరియా ఎంబోకో 6-1, 7-6 (7-4) లూలు సన్‌పై, జెండా పావోలిని 6-1, 4-6, 6-3తో యువాన్ యుపై, జెంగ్ కిన్వెన్ (నెం. 8 సీడ్) 6-4, 6-3తో అనస్తాసియా పావ్ల్యుచెంకోవాపై, ఓల్గా డానిలోవిచ్ 6-3, 6-1తో లీలా ఫెర్నాండెజ్‌పై, అనా సిమ్నోవా 6-3, 4-1తో నినా స్టోజనోవిచ్‌పై విజయం సాధించారు. గాయం కారణంగా స్టోజనోవిచ్‌ మధ్యలోనే తప్పుకుంది.

French Open 2025 May 25 Results and May 26 Schedule Top Seed Aryna Sabalenka Powers Into Second Round

పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ఇటలీ ప్లేయర్, ఎనిమిదో సీడ్ లొరెంజో ముసెట్టి 7-5, 6-2, 6-0తో యానిక్ హన్ఫ్‌మన్‌(జర్మనీ)పై విజయం సాధించాడు. మరో మ్యాచ్‌లో 12వ సీడ్ టామీ పాల్(అమెరికా)6-7(5/7), 6-2, 6-3, 6-1తో మోలెర్(డెన్మార్క్‌)పై గెలుపొందాడు. ఇతర మ్యాచ్‌ల్లో ఫ్రాన్సెస్ టియాఫో (నెం. 15 సీడ్) 6-4, 7-5, 6-4తో- రోమన్ సఫియులిన్‌పై, మార్టన్ ఫుక్సోవిక్స్6-4, 6-2, 6-2 ట్రిస్టాన్ స్కూల్‌కేట్‌పై విజయం సాధించారు.

ఫ్రెంచ్ ఓపెన‌లోని నేటి ప్రధాన మ్యాచ్‌ల షెడ్యూల్..

మహిళల సింగిల్స్:

1. ఇగా స్వియాటెక్ (Iga Swiatek) [నెం. 5 సీడ్] vs రెబెక్కా స్రామ్‌కోవా (Rebecca Sramkova): మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం.

2. పౌలా బడోసా (Paula Badosa) [నెం. 10 సీడ్] vs నవోమి ఒసాకా (Naomi Osaka): (మహిళల సింగిల్స్, స్వియాటెక్ మ్యాచ్ తర్వాత)

3. మ్యాడిసన్ కీస్ (Madison Keys) [నెం. 7 సీడ్] vs డారియా సావిల్ (Daria Saville) [క్వాలిఫైయర్]: (మహిళల సింగిల్స్, ఫ్రిట్జ్ మ్యాచ్ తర్వాత)

పురుషుల సింగిల్స్:

1. జానిక్ సిన్నర్ (Jannik Sinner) [నెం. 1 సీడ్] vs ఆర్థర్ రిండర్‌నెచ్ (Arthur Rinderknech): రాత్రి 11:45 గంటల తర్వాత

2. కార్లోస్ అల్కరాజ్ (Carlos Alcaraz) [నెం. 2 సీడ్] vs గియులియో జెప్పెరి (Giulio Zeppieri) [క్వాలిఫైయర్]: ( మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌ల తర్వాత)

3. కరోలిన్ గార్సియా (Caroline Garcia) vs బెర్నార్డా పెరా (Bernarda Pera): (మహిళల సింగిల్స్, అల్కరాజ్ మ్యాచ్ తర్వాత)

4. కాస్పర్ రూడ్ (Casper Ruud) [నెం. 7 సీడ్] vs ఆల్బర్ట్ రామోస్-వినోలస్ (Albert Ramos-Vinolas) [క్వాలిఫైయర్]: మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభం.

5. టేలర్ ఫ్రిట్జ్ (Taylor Fritz) [నెం. 4 సీడ్] vs డేనియల్ ఆల్ట్‌మైర్ (Daniel Altmaier): (పురుషుల సింగిల్స్, రూడ్ మ్యాచ్ తర్వాత)

Story first published: Monday, May 26, 2025, 12:06 [IST]
Other articles published on May 26, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+