For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

French Open 2025 రారాజు.. అల్కరాజు! మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అదే (వీడియో)

ప్రతిష్టాత్మక ఫ్రెంచ్ ఓపెన్ 2025 టెన్నిస్ టోర్నీ‌లో స్పెయిన్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ విజేతగా నిలిచాడు. అద్భుతమైన ఆటతో టైటిల్ నిలబెట్టుకున్నాడు. ఆదివారం హోరాహోరీగా సాగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఈ స్పెయిన్ దిగ్గజం 4-6, 6-7 (7/4), 6-4, 7-6 (7/3), 7-6 (10/2) తేడాతో టాప్ సిడ్ జానిక్ సిన్నర్ (ఇటలీ)‌పై చిరస్మరణీయ విజయాన్నందుకుంది. ఫ్రెంచ్ ఓపెన్ చరిత్రలోనే ఇదో అపురూపమైన మ్యాచ్‌గా నిలిచింది. 5 గంటల 29 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్ రోలాండ్ గారోస్ చరిత్రలో అత్యంత సుదీర్ఘమైన ఫైనల్‌గా రికార్డ్‌కెక్కింది.

తొలి రెండు సెట్లు కోల్పోయినప్పటికీ, అల్కరాజ్ అద్భుతమైన పోరాట పటిమను ప్రదర్శించి విజయం సాధించాడు. దాదాపు ఓటమి అంచున చేరిన అల్కరాజ్ అద్వితీయమైన ప్రదర్శనతో పుంజుకొని రెండో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను అందుకున్నాడు. ఇది అల్కరాజ్‌ కెరీర్‌లో ఐదో గ్రాండ్ స్లామ్ టైటిల్.

French Open 2025 Carlos Alcaraz Mounts Epic Comeback Against Sinner for Second Consecutive Title

మ్యాచ్ టర్నింగ్ పాయింట్..

ఈ మ్యాచ్ ఆరంభంలో వరల్డ్ నెంబర్ సిన్నర్ పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. వరుసగా రెండు సెట్లను గెలుచుకొని అల్కరాజ్‌పై ఒత్తిడి పెంచాడు. రెండు సెట్లు కోల్పోయినప్పటికీ అల్కరాజ్ అసాధారణమైన పోరాట పటిమతో పాటు మానసిక స్థైర్యాని ప్రదర్శించాడు. మూడో సెట్‌‌ను కైవసం చేసుకొని మ్యాచ్‌ రేసులో నిలిచాడు. నాలుగో సెట్‌లో సిన్నర్ ఆధిపత్యం చెలాయించడంతో అల్కరాజ్ 3-5(0-40)తో వెనుకంజలో నిలిచాడు. అల్కరాజు ఓటమి ఖాయమని అంతా అనుకున్నారు. కానీ ఇక్కడ అల్కరాజ్ తెలివిగా ఆడి మ్యాచ్‌ను తనవైపు మలుపు తిప్పుకున్నాడు. ముందుగా మ్యాచ్‌ను టైబ్రేక్‌కు తీసుకెళ్లి గెలిచిన అల్కరాజ్.. మ్యాచ్‌ను 2-2తో సమం చేశాడు.

విన్నర్లతో గట్టెక్కిన అల్కరాజ్..

నిర్ణయాత్మక ఐదో సెట్‌లో ఇద్దరు ఆటగాళ్లు హోరాహోరీగా తలపడ్డారు. దాంతో ఈ సెట్ కూడా టైబ్రేక్‌కు దారితీసింది. సూపర్ టైబ్రేక్‌లో అల్కరాజ్ 10-2 తేడాతో విజయం సాధించి సెట్‌తో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో అల్కరాజ్ 7 ఏస్‌‌లతో పాటు 70 విన్నర్లు కొట్టాడు. 7 డబుల్ ఫాల్ట్స్‌తో పాటు 73 అనవసర తప్పిదాలు చేసిన అల్కరాజ్ మొత్తం 192 పాయింట్స్ సాధించాడు. ప్రత్యర్థి సర్వీస్‌ను ఏడు సార్లు బ్రేక్ చేశాడు.

మరోవైపు జానిక్ సిన్నర్ 8 ఏస్‌లతో పాటు 53 విన్నర్స్ కొట్టాడు. 64 అనవసర తప్పిదాలు చేసిన సిన్నర్.. మొత్తం 193 పాయింట్స్ సాధించాడు. ఏడు సార్లు సర్వీస్ బ్రేక్ చేశాడు. జానిక్ సిన్నర్ ఈ మ్యాచ్‌లో ఒక్క డబుల్ ఫాల్ట్ కూడా చేయకపోవడం అతని సర్వీస్ స్థిరత్వానికి నిదర్శనం. అత్యధిక విన్నర్లు కొట్టడం ద్వారా ఈ మ్యాచ్‌ను అల్కరాజ్ సొంతం చేసుకున్నాడు.

Story first published: Monday, June 9, 2025, 10:35 [IST]
Other articles published on Jun 9, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+