French Open 2024: ఒసాక ఇంటికి.. అల్కరాస్ జోరు!
ఫ్రెంచ్ ఓపెన్ 2024 టెన్నిస్ టోర్నీలో సంచన ఫలితాలు నమోదయ్యాయి. మహిళల మాజీ నెంబర్‌వన్, జపాన్ స్టార్ నవోమి ఒసాక కథ రెండోరౌండ్‌లోనే ముగిసింది. తల్లయ్యాక తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ బరిలో నిలిచిన ఈ జపాన్ స్టార్‌కు డిఫెండింగ్ చాంపియన్ ఇగా స్వియటెక్ షాకిచ్చింది. పురుషుల విభాగంలో నోవాక్ జకోవిచ్ శుభారంభం చేయగా.. అల్కారజ్, సిట్సిపాస్ మూడో రౌండ్‌కు చేరారు.
హోరా హోరీ పోరు..
బుధవారం హోరాహోరీగా సాగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్‌లో టాప్‌సీడ్ ఇగా స్వియటెక్(పోలాండ్) 7-6(7-1), 1-6, 7-5తో నాలుగుసార్లు గ్రాండ్‌స్లామ్ చాంపియన్ అయిన ఒసాకపై పోరాడి గెలిచింది. గంటా 9 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన తొలి సెట్‌లో ఈ ఇద్దరూ టెన్నిస్ స్టార్స్ గొప్పగా పోరాడారు.

విన్నర్లతో ఆధిపత్య చెలాయించిన స్వియటెక్ మూడో గేమ్ బ్రేక్ సాధించి ఆధిక్యంలోకి వెళ్లింది. కానీ ఒసాక అద్భుతంగా పుంజుకొని గట్టి పోటీనిచ్చింది. ఈ ఇద్దరూ సర్వీస్‌లు నెలబెట్టుకోవడంతో పోరు టైబ్రేకర్‌కు మళ్లింది. ఇందులో స్వియటెక్కు తిరుగులేకుండా పోయింది.
స్వియటెక్ అసాధారణ పోరాటం..
రెండో సెట్‌లో 26 ఏళ్ల ఒసాక అసాధారణ ప్రదర్శన కనబర్చింది. క్రాస్ కోర్ట్ షాట్లతో స్వియటెక్ను చిత్తు చేసింది. ఈ సెట్‌లో ఒక్క గేమ్ మాత్రమే కోల్పోయిన ఒసాక 32 నిమిషాల్లోనే సెట్ ముగించింది. డిసైడర్‌గా మారిన మూడో సెట్‌లో ఇద్దరూ హోరాహోరీగా తలపడ్డారు. ఓ దశలో ఒసాక 5-2తో గెలుపు దిశగా సాగింది. కానీ స్వియటెక్ గొప్పగా పుంజుకుంది. వరుసగా 5 సెట్లు గెలిచి విజయాన్ని అందుకుంది.
ఇతర మహిళల సింగిల్స్‌లో 3వ సీడ్, అమెరికా టీనేజ్ సెన్సేషన్ కొకొ గాఫ్ 6-3, 6-4తో జిదాన్సెక్‌పై, 8వ సీడ్ జెబ్యూర్ 6-3, 1-6, 6-3తో కమిలియాపై విజయం సాధించి మూడోరౌండ్ చేరారు. ఇక, మహిళల 21వ సీడ్ గార్సియా, 26వ సీడ్ బౌల్టెర్ రెండో రౌండ్‌లో పరాజయం చవిచూసి ఇంటిదారి పట్టారు.
జకోవిచ్ బోణీ..
ఇక పురుషుల డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జకోవిచ్ శుభారంభం చేశాడు. మంగళవారం అర్ధరాత్రి తర్వాత జరిగిన మ్యాచ్‌లో జకోవిచ్ 6-4, 7-6 (3), 6-4తో లోకల్ ప్లేయర్ పియరీ హెర్బర్ట్‌పై గెలిచి రెండోరౌండ్ చేరాడు. మిగతా స్టార్ ఆటగాళ్లలో అల్కారజ్ 6-3, 6-4, 2-6, 6-2తో జాస్పెర్ జోంగ్‌పై, 6వ సీడ్ రుబ్లెవ్ 6-3, 6-4, 5-3తో మార్టినెజ్‌పై, 9వ సీడ్ సిట్సిపాస్ 6-3, 6-2, 6-7 (7), 6-4 డానియల్‌పై గెలిచి మూడోరౌండ్లో ప్రవేశించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications