For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

French Open 2023 : సీనర్ ఔట్.. స్వియటెక్‌, రిబకినా, జొకోవిచ్ ముందంజ

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌లో సంచలన ఫలితం నమోదైంది. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్, ఎనిమిదో సీడ్ యూనిక్ సినర్(ఇంటలీ) రెండో రౌండ్‌లోనే ఇంటిదారిపట్టాడు. 5 గంటల 26 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో 79వ ర్యాంకర్, జర్మనీ ప్లేయర్ డానియల్ అల్ట్‌మైర్ విజయం సాధించాడు.

గురువారం జరిగిన ఈ పోరులో అల్ట్‌మైర్ 6-7(0/7), 7-6(9/7), 1-6, 7-6(7/4), 7-5 తేడాతో సినర్ ఓడించాడు. ఇతర పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో మూడో సీడ్ జొకోవిడ్ 7-6(7/2), 6-0, 6-3 తేడాతో ఫచ్‌సోవిచ్(హంగేరి)పై గెలుపొంది ముందడుగు వేసాడు. మరో మ్యాచ్‌లో నాలుగో సీడ్ కాస్పర్ రూల్(నార్వే) 6-3, 6-2, 4-6, 7-5 తేడాతో జెపెరి(ఇటలీ)పై విజయం సాధించాడు.

French Open 2023: Novak Djokovic Stefanos Tsitsipas, Carlos Alcaraz headline 3rd round action

టియోఫో (అమెరికా), దిమిత్రోవ్‌ (బల్గేరియా) కూడా ముందంజ వేశారు. పన్నెండోసీడ్‌ టియాఫో 3-6, 6-3, 7-5, 6-2తో కరత్సెవ్‌ (రష్యా)పై నెగ్గగా.. దిమిత్రోవ్‌ 7-6 (7-4), 6-3, 6-3తో ఇమిల్‌ (ఫిన్లాండ్‌)ను ఓడించాడు. కొరిచ్‌ (క్రొయేషియా) 6-3, 4-6, 4-6, 6-3, 6-4తో కాహిన్‌ (అర్జెంటీనా)పై నెగ్గాడు.

18వ సీడ్‌ డిమినర్‌ (ఆస్ట్రేలియా) ఓడిపోయాడు. థామస్‌ మార్టిన్‌ (అర్జెంటీనా) 6-3, 7-6 (7-2), 6-3తో డిమినర్‌ను కంగుతినిపించాడు. మరోవైపు తొలి రౌండ్లో అయిదుసెట్లు పోరాడి సెబాస్టియిన్‌ బేజ్‌ (అర్జెంటీనా)పై గెలిచిన మోన్‌ఫిల్స్‌ (ఫ్రాన్స్‌).. గాయంతో రెండో రౌండ్‌ నుంచి తప్పుకున్నాడు. దీంతో ఆరో సీడ్‌ రూన్‌ (డెన్మార్క్‌) బరిలో దిగకుండానే ముందంజ వేశాడు.

మహిళల సింగిల్స్‌లో ఇగా స్వైటెక్‌ (పోలెండ్‌) దూసుకెళ్తోంది. టాప్‌సీడ్‌ స్వైటెక్‌ 6-4, 6-0తో క్లెయిర్‌ లూ (అమెరికా)ను ఓడించింది. ఇక నాలుగోసీడ్‌ రిబకీనా (ఉక్రెయిన్‌) కూడా ముందంజ వేసింది. రిబకీనా 6-3, 6-3తో నోస్కోవా (చెక్‌ రిపబ్లిక్‌)ను ఓడించింది. 20వ సీడ్‌ మాడిసన్‌ కీస్‌ (అమెరికా) మాత్రం టోర్నీ నుంచి నిష్క్రమించింది.

74 అనవసర తప్పిదాలు చేసిన మాడిసన్ కీస్ 2-6, 6-4, 4-6తో కైలా డే చేతిలో ఓడింది. పెరా (అమెరికా), హడాడ్‌ (బ్రెజిల్‌), ఆండ్రీవా (రష్యా), జాబెర్‌ (ట్యునీసియా) కూడా రెండో రౌండ్‌ అధిగమించారు.

Story first published: Friday, June 2, 2023, 10:25 [IST]
Other articles published on Jun 2, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+