Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

French Open 2022: గాయంతో జ్వెరెవ్ ఔట్.. ఫైనల్‌కు బర్త్‌డే బాయ్ నాదల్!

French Open 2022: Rafael Nadal into the final after Alexander Zverev withdraws with injury

పారిస్: ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీలో స్పెయిన్‌ స్టార్‌ రాఫెల్‌ నాదల్‌ టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచాడు. ఫిలిప్‌ చార్టియర్‌ కోర్టులో గురువారం సాయంత్రం జరిగిన పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లో జర్మనీ స్టార్ అలెగ్జెండర్ జ్వెరేవ్ మ్యాచ్ మధ్య‌లో గాయంతో అర్థాంతరంగా తప్పుకోవడంతో నాదల్ ఫైనల్‌కు చేరాడు. రెండు సెట్లపాటు హోరాహోరీగా సాగిన ఈ పోరులో 7-6(10/8), 6-6తో నాదల్ ఆధిపత్యం చెలాయించాడు.

అయితే రెండో సెట్ 12వ గేమ్‌లో జ్వేరెవ్ మడమ మర్లబడింది. దాంతో నొప్పితో విలవిలలాడిన జ్వెరేవ్‌ను వీల్ చైర్‌పై కోర్టు బయటకు తీసుకెళ్లి చికిత్స చేశారు. కొద్దినిమిషాల తర్వాత మళ్లీ అడుగుపెట్టిన జ్వెరెవ్ నొప్పితో ఆడలేకపోయాడు. దాంతో నాదల్ ఫైనల్ చేరుకున్నాడు.

జ్వెరేవ్ వాకోవర్ ఇచ్చినా.. ఆడినంత సేపు నాదల్‌కు గట్టి పోటీనిచ్చాడు. ఇక కాస్పెల్ రూడ్, మారిన్ క్లిక్ మధ్య జరిగే రెండో సెమీస్‌లో గెలిచేవారితో నాదల్ ఫైనల్లో తలపడనున్నాడు. ఇక క్వార్టర్‌ ఫైనల్లో జొకోవిచ్‌కు చుక్కలు చూపించిన నాదల్‌.. 6-2, 4-6, 6-2, 7-6 (7/4) తేడాతో అతడిపై విజయం సాధించిన విషయం తెలిసిందే.

సుదీర్ఘ కాలం పాదం గాయంతో ఇబ్బంది పడ్డ రఫెల్ నాదల్ మళ్లీ మునపటి ఫామ్‌లోకి వచ్చేశాడు. సీజన్ తొలి గ్రాండ్ స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను గెలిచి అత్యధిక గ్రాండ్‌స్లామ్(21) రికార్డు సృష్టించిన నాదల్.. ఇప్పుడు 14వ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌పై కన్నేసాడు. శుక్రవారం రఫెల్ నాదల్ జన్మదినం కాగా.. ఈ విజయంతో తన 36వ బర్త్‌డేను ప్రత్యేకంగా మలుచుకున్నాడు. గ్రాండ్ స్లామ్స్ టైటిళ్ల రికార్డుల్లో ఫెడరర్(20), జొకోవిచ్(20)లను అధిగమించిన నాదల్.. 22వ టైటిల్‌తో మరింత ఎత్తులో నిలవాలని ప్లాన్ వేస్తున్నాడు.

Story first published: Friday, June 3, 2022, 22:37 [IST]
Other articles published on Jun 3, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+