న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

French Open 2021: ఎనిమిదేళ్ల తర్వాత అదరగొట్టిన అజరెంకా!

French Open 2021: Victoria Azarenka advances into Round 4 after a gap of 8 years

పారిస్: దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత టెన్నిస్ మాజీ నంబర్ వన్ ప్లేయర్, బెలారస్ స్టార్ విక్టోరియా అజెరెంకా దుమ్మురేపింది. ఫ్రెంచ్ ఓపెన్‌లో శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ మూడో రౌండర్‌లో అజెరెంకా 6-2, 6-2తో అమెరికా ప్లేయర్ మాడిసన్ కీస్‌పై సునాయస విజయాన్నందుకుంది. సూపర్ పెర్ఫామెన్స్ వరుస సెట్లలో ప్రత్యర్థిని మట్టికరిపించింది. ఇక గత ఎనిమిదేళ్లుగా ఆడిన ప్రతి టోర్నీలోనూ ప్రారంభ రౌండ్లలోనే నిష్క్రమించిన అజెరెంకా... ఆ అపవాదును దాటుకుని ఫ్రెంచ్ ఓపెన్​లో టైటిలే లక్ష్యంగా దూసుకెళ్తుంది.

తదుపరి మ్యాచ్​లో రష్యా ప్లేయర్​ అనస్తాసియా పావ్యుచెంకోవా తో తలపడనుంది. చివరగా 2013లో సెమీస్​ చేరిన విక్టోరియా... వెన్నునొప్పితో గత నెల మాడ్రిడ్​ ఓపెన్​కూ దూరమైంది. కానీ ఇంతలోనే తేరుకుని ఫ్రెంచ్ ఓపెన్​లో సత్తా చాటుతోంది. ప్రస్తుతం ఈ టోర్నీలో టాప్​-3 సీడెడ్​ ఆటగాళ్లు దూరమైన నేపథ్యంలో అజరెంకాకు టైటిల్ దక్కించుకనే అవకాశాలూ ఉన్నాయి.

​ఇక మీడియా బైకట్, రిఫరీ జరిమానాతో పాటు మానసిక ఒత్తిడి ఉందంటూ జపాన్ ప్లేయర్, రెండో సీడ్​ నవోమి ఒసాకా టోర్నీ నుంచి వైదొలగగా, గాయంతో తొలి సీడ్ ప్లేయర్ యాష్లే బార్టీ టోర్నీ నుంచి అర్దంతరంగా తప్పుకుంది. సెరెనా విలియమ్స్ ఒక్కతే టోర్నీ నిలవగా.. శుక్రవారం జరిగిన మరో మ్యాచ్ మూడో సీడ్ అరైనా సెబలంక పరాజయంతో ఇంటిముఖం పట్టింది. రష్యా టెన్నిస్ ప్లేయర్ అనస్తాసియా పావ్యుచెంకోవాతో జరిగిన మూడో రౌండ్​లో 4-6 6-2 0-6తో ఓడిపోయింది. ​తొలి రౌండ్​ను ధాటిగా ఆరంభించిన ఈ మూడో సీడ్​ బెలారస్​ క్రీడాకారిణి.. 31వ సీడ్​ ప్లేయర్ ముందు​ ఆధిపత్యాన్ని ప్రదర్శించలేకపోయింది.

Story first published: Friday, June 4, 2021, 22:04 [IST]
Other articles published on Jun 4, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X