న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

French Open 2021: నాయనమ్మ ఈ టైటిల్ నీదే.. సిట్సిపాస్ భావోద్వేగం!

French Open 2021: Stefanos Tsitsipas lost his grandmother 5 minutes before final

పారిస్‌: ఫైనల్‌ ఆరంభానికి మరో ఐదే నిమిషాలు.. అంతలోనే తాను ఎంతగానో ప్రేమించే నాయనమ్మ మరణ వార్త.. ఇంతటి తీవ్ర విషాదంలో ఉన్నా.. ఆ బాధను దిగమింగుకుని నంబర్ వన్ ప్లేయర్, సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్‌తో జరిగిన ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్లో గ్రీస్‌ ఆటగాడు స్టెఫనోస్‌ సిట్సిపాస్‌ గొప్ప పోరాట పటిమను ప్రదర్శించాడు. వరుసగా తొలి రెండు సెట్లు గెలిచి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. చివరకు ఓడినా సిట్సిపాస్ తన పోరాటంతో ఆకట్టుకున్నాడు. తొలి సారి ఓ బిగ్ టోర్నీ ఫైనల్ బరిలో నిలిచినా.. ఎదురుగా వరల్డ్ నంబర్ వన్ జొకోవిచ్ ఉన్నా.. నిర్భయంగా ఆడి ఔరా అనిపించాడు.

ఇక తన రన్నరప్‌ టైటిల్‌ను నాయనమ్మకు అంకితమిస్తున్నట్టు 22 ఏళ్ల సిట్సిపాస్‌ చెప్పాడు. 'నాకు ఓ మంచి తండ్రిని ఇచ్చినందుకు ఆమెకు కృతజ్ఞతలు. నాన్న సహకారం, ప్రోత్సాహం లేకపోతే నేను ఇంత వరకు వచ్చేవాడినే కాదు' అని ఇన్‌స్టాగ్రామ్‌లో సిట్సిపాస్‌ భావోద్వేగ సందేశాన్ని పోస్టు చేశాడు. ఆదివారం జరిగిన ఫ్రెంచ్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో టాప్‌ సీడ్, ప్రపంచ నంబర్‌వన్‌ జొకోవిచ్‌ 4 గంటల 11 నిమిషాల్లో 6-7 (6/8), 2-6, 6-3, 6-2, 6-4తో ఐదో సీడ్‌ సిట్సిపాస్‌ (గ్రీస్‌)పై విజయం సాధించాడు. విజేత జొకోవిచ్‌కు 14 లక్షల యూరోలు (రూ. 12 కోట్ల 41 లక్షలు)... రన్నరప్‌ సిట్సిపాస్‌కు 7 లక్షల 50 వేల యూరోలు (రూ. 6 కోట్ల 65 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.

ఆట మొదలైనప్పటి నుంచే దిగ్గజ ప్రత్యర్థికి ధీటుగా సిట్సిపాస్‌ పోరాడాడు. దీంతో సెర్బియన్‌కు ఫైనల్‌ అంత సులువు కాదని తెలిసిపోయింది. టైబ్రేక్‌కు దారితీసిన తొలి సెట్‌లో సిట్సిపాస్‌ పైచేయి సాధించి 72 నిమిషాల్లో తొలి సెట్‌ను సొంతం చేసుకున్నాడు. తొలి సెట్‌ నెగ్గిన ఆనందంలో సిట్సిపాస్‌ రెట్టించిన ఉత్సాహంతో రెండో సెట్‌ తొలి గేమ్‌లో సెర్బియన్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేశాడు. తర్వాత టాప్‌ సీడ్‌ ఆటగాడు వరుసగా అనవసర తప్పిదాలు చేయడంతో సిట్సిపాస్‌ తన సర్వీస్‌ను నిలబెట్టుకునేందుకు పెద్దగా శ్రమించాల్సిన పనిలేకపోయింది. రెండో సెట్‌ కూడా సిట్సిపాస్‌ సొంతమైంది.

టైటిల్‌ సాధించాలంటే వరుసగా మూడు సెట్‌లు గెలవాల్సిన తప్పనిసరి పరిస్థితుల్లో జొకోవిచ్‌ తన గేరు మార్చి జోరు పెంచాడు. ఒత్తిడిని చిత్తు చేస్తూ.. అలసత్వాన్ని, అనవసర తప్పిదాలకు అక్కడితో చెక్‌ పెట్టాడు. మూడు, నాలుగు సెట్లలో తన సిసలైన పోటీ ఏంటో గ్రీస్‌ ప్రత్యర్థికి ప్రతీ గేమ్‌లోనూ రుచిచూపించాడు. ఇక ఆఖరి సెట్‌ మూడో గేమ్‌లో బ్రేక్‌ పాయింట్‌ సాధించిన జొకోవిచ్‌ తన సర్వీస్‌లను కాపాడుకొని టైటిల్‌ దిశగా సాగిపోయాడు. సిట్సిపాస్‌ పోరాడినప్పటికీ జొకోను ఓడించేందుకు అది సరిపోలేదు.

Story first published: Tuesday, June 15, 2021, 8:10 [IST]
Other articles published on Jun 15, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X