French Open 2021: సెరెనా ముందంజ.. సిట్సిపాస్, జ్వెరెవ్ జోరు!

పారిస్: కెరీర్‌లో 24వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్‌పై గురి పెట్టిన అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్.. ఫ్రెంచ్ ఓపెన్ మూడో రౌండ్‌కు చేరడానికి చెమటోడ్చింది. 5వ సీడ్ స్టెఫనోస్ సిట్సిపాస్, అలెగ్జాండర్ జ్వెరెవ్, విక్టోరియా అజరెంకా కూడా ముందంజ వేశారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్‌లో 7వ సీడ్ సెరెనా 6-3, 5-7, 6-1తో మిహేలా బుబరెస్కూ (రొమేనియా)పై కష్టపడి నెగ్గింది. ఈ మ్యాచ్‌లో ఐదు ఏస్‌లు సంధించిన సెరెనా, తన ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయింది.

బెన్‌చిచ్‌కు షాక్..
మరోవైపు పదో సీడ్ బెన్‌చిచ్ (స్విట్జర్లాండ్) రెండో రౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది. బెన్‌చిచ్ 2-6, 2-6తో కసత్‌కినా (రష్యా) చేతిలో ఓడిపోయింది. 2019 రన్నరప్ మార్కెటా వాండర్సోవా (చెక్) 6-1, 6-3తో హార్మొని టాన్‌పై, 15వ సీడ్ అజరెంకా 7-5, 6-4తో క్లారా టాసన్‌పై, కేటరీనా సినికొవా 7-6(7), 5-7, 7-5తో 29వ సీడ్ వెరోనికా కుడర్‌మెటోవాపై, అమెరికా ప్లేయర్ మాడిసన్ కీస్ 6-1, 7-5తో లేలా అన్నె ఫెర్నాండెజ్‌పై గెలిచారు.

సిట్సిపాస్ సునాయసంగా..
ఫైనల్ ఫేవరెట్లలో ఒకరైన గ్రీకువీరుడు సిట్సిపాస్ అలవోక విజయంతో ముందంజ వేశాడు. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో సిట్సిపాస్ 6-3, 6-4, 6-3తో మార్టినెజ్ (స్పెయిన్)పై, జ్వెరెవ్ 7-6 (7/4), 6-3, 7-6 (7/1)తో గెలిచారు. 11వ సీడ్ బాటిస్టా అగుట్ (స్పెయిన్) 3-6, 6-2, 3-6, 2-6తో లాక్సోనెన్ (స్విట్జర్లాండ్) చేతిలో ఓడిపోయాడు. కాగా, తొలి రౌండ్‌లో నంబర్ వన్ నొవాక్ జొకోవిచ్ 6-2, 6-4, 6-2తో టెన్నిస్ శాండ్‌గ్రెన్ (అమెరికా)ను ఓడించి రెండో రౌండ్‌కు చేరుకొన్నాడు.

ఆకట్టుకున్న కార్లా సువారెజ్..
కేన్సర్ నుంచి కోలుకొని తొలిసారి గ్రాండ్‌స్లామ్ బరిలోకి దిగిన స్పెయిన్ క్రీడాకారిణి కార్లా సువారెజ్ నవారో తొలి రౌండ్‌లో స్ఫూర్తిదాయ ప్రదర్శనతో ఆకట్టుకొంది. కార్లా 6-3, 6-7(4), 4-6తో మాజీ చాంపియన్ స్లోన్ స్టీఫెన్స్‌తో పోరాడి ఓడింది. నెల క్రితం హాడ్జ్‌కిన్స్ లింఫోమా కేన్సర్ నుంచి కోలుకున్న సువారెజ్.. సుమారు రెండున్నర గంటలపాటు జరిగిన మ్యాచ్‌లో దాదాపు గెలుపు అంచులకు చేరుకొంది. కానీ, రెండో సెట్‌ను టై బ్రేక్‌లో చేజార్చుకోవడంతో ప్రత్యర్థి స్టీఫెన్స్ పుంజుకొంది.

శరణ్ జోడీ ఔట్..
పురుషుల డబుల్స్‌లో దివిజ్ శరణ్ జోడీ తొలి రౌండ్‌లోనే ఓడి ఇంటిముఖం పట్టింది. దివిజ్-ఫెడ్రికో డెల్బోనిస్ (అర్జెంటీనా) జంట 6-3, 6-7(13), 4-6తో మ్యాట్-అలెక్స్(ఆస్ట్రేలియా) చేతిలో ఓడింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో అంకిత రైనా (భారత్)-లౌరెన్ (అమెరికా) 4-6, 4-6తో హర్డెక (చెక్ రిపబ్లిక్)-సిగెముండ్ (జర్మనీ) చేతిలో ఓడిపోయారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications