Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Emma Raducanu: యూఎస్ ఓపెన్‌లో సంచలనం.. 44 ఏళ్ల తర్వాత గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచిన బ్రిటన్ టీనేజర్!

Emma Raducanu makes tennis history

న్యూయార్క్‌: టెన్నిస్‌ చరిత్రలో పెనుసంచలనం నమోదైంది. యూఎస్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్ విజేతగా పద్దెనిమిదేళ్ల ఎమ్మా రదుకా విజేతగా నిలిచింది. శనివారం అర్థరాత్రి ధాటక జరిగిన మహిళల సింగిల్స్‌ టైటిల్‌ పోరులో కెనాడాకు చెందిన 19 ఏళ్ల లెలా ఫెర్నాండెజ్‌ను 6-4, 6-3 తేడాతో వరుస సెట్లలో ఓడించి తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను గెలుచుకుంది. దీంతో యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ను గెలుచుకున్న తొలి క్వాలిఫైయర్‌గా రదుకాను చరిత్ర సృష్టించింది.

150 ర్యాంక్‌లో కొనసాగుతున్న ఎమ్మా.. తనకన్నా మెరుగైన స్థానంలో కొనసాగుతున్న 73వ ర్యాంక్‌ క్రీడాకారిణి లెలా ఫెర్నాండెజ్‌ను ఓడించింది. దీంతో 44 ఏళ్ల తర్వాత గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ గెలుకున్న బ్రిటీష్ మహిళగా ఘనమైన రికార్డును అందుకుంది. బ్రిటన్‌ తరఫున 1977లో వర్జీనియా వేడ్‌ తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ గెలుపొందింది. గతంలో మరియా షరపోవా(17 ఏళ్ల వయసులో వింబుల్డన్‌ విజేత- 2004) తర్వాత ఏదైనా ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌లో ఈ రికార్డు సాధించిన టీనేజర్‌గా ఎమ్మా గుర్తింపు పొందింది.

ఇక అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఎమ్మా మొదటి నుంచి లెలాపై ఆధిపత్యం ప్రదర్శించింది. ఎక్కడా కూడా భారీ తప్పిదాలు చేయకుండా మొదటి సెట్‌ను 6-4 తేడాతో గెలిచింది. మొదటి సెట్‌ను గెలిచిన ఆత్మవిశ్వాసంతో ఆడిన ఎమ్మా ఇక రెండో సెట్‌లో ప్రత్యర్థికి చుక్కలు చూపించింది. 6-3 తేడాతో ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా వరుస సెట్లలో గెలిచి తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను ఎగురేసుకుపోయింది. ఇక ఎమ్మా టోర్నీ ఆసాంతం ఒక్క సెట్‌ కూడా కోల్పోకపోవడం విశేషం. ఈ టోర్నీలో తాను ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లో ఒక్క సెట్‌ను కూడా కోల్పోలేదు. మొత్తం 20 సెట్లలోనూ నెగ్గడం విశేషం. ఇక టైటిల్‌ గెలిచిన ఎమ్మా 2.5 మిలయన్‌ డాలర్ల ప్రైజ్‌ మనీని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో గెలుపుతో ఒక్కసారిగా ఆమె ర్యాంకు 150 నుంచి 23కు వచ్చింది. ఇక బ్రిటన్‌లో తనే నెంబర్‌ వన్‌ క్రీడాకారిణి.

పురుషుల సింగిల్స్‌లో వరల్డ్ నెంబర్ వన్ నొవాక్ ఒకోవిచ్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు గెలిచిన టెన్నిస్‌ ఆటగాడిగా చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో నిలిచాడు. 21వ టైటిల్‌పై కన్నేసిన ఈ సెర్బియా యోధుడు.. ఈ ఏడాది వరుసగా ఆ్రస్టేలియన్‌ ఓపెన్, ఫ్రెంచ్‌ ఓపెన్, వింబుల్డన్‌లను గెలిచాడు. తాజాగా యూఎస్‌ ఓపెన్‌ గెలిచే పనిలో పడ్డాడు.

సెమీ ఫైనల్లో జొకోవిచ్ 4-6 6-2 6-4 4-6 6-2 తేడాతో టోక్యో ఒలింపిక్స్‌ గోల్డ్ మెడలిస్ట్ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ ఓడించాడు. హోరాహోరీగా సాగిన ఈ పోరులో ఇద్దరూ ఐదు సెట్లు ఆడారు. చివరికి జొకోవిచ్‌ విజయం సాధించి ఫైనల్స్‌కు దూసుకెళ్లాడు. మరో సెమీస్‌లో రష్యా ఆటగాడు డానిల్‌ మెద్వెదేవ్‌.. కెనడా ఆటగాడు ఫెలిక్స్‌ ఆగర్‌తో తలపడి 6-4, 7-5, 6-2 మూడు వరుస సెట్లను కైవసం చేసుకొని ఫైనల్‌ చేరాడు. దీంతో జొకోవిచ్‌, మెద్వెదేవ్‌ టైటిల్‌ పోరులో తలపడనున్నారు. సోమవారం అర్థరాత్రి ధాటక ఈ మెగా పోరు జరగనుంది.

Story first published: Sunday, September 12, 2021, 8:45 [IST]
Other articles published on Sep 12, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+