జొకోవిచ్‌కు డొమినిక్‌ థీమ్‌ షాక్!

లండన్‌: అదిరిపోయే ఆటతో ప్రపంచ నవంబర్ వన్ నొవాక్ జొకోవిచ్(సెర్బియా)‌కు షాకిచ్చిన ఆస్ట్రియా స్టార్ డొమినిక్ థీమ్ ఏటీపీ టూర్ టోర్నమెంట్ ఫైనల్‌కు చేరాడు. ఆద్యంతం నువ్వా నేనా అన్నట్లు సాగిన సెమీఫైనల్‌ పోరులో ప్రపంచ మూడో ర్యాంకర్‌ అయిన డొమినిక్‌ థీమ్‌ పైచేయి సాధించాడు.

వరుసగా రెండో ఏడాది పురుషుల టెన్నిస్‌ సీజన్‌ ముగింపు టోర్నీ ఏటీపీ ఫైనల్స్‌లో టైటిల్‌ పోరుకు అర్హత సాధించాడు. టాప్‌ సీడ్ నొవాక్‌ జొకోవిచ్‌ (సెర్బియా)తో 2 గంటల 54 నిమిషాలపాటు జరిగిన తొలి సెమీఫైనల్లో గతేడాది రన్నరప్‌ థీమ్‌ 7-5, 6-7 (10/12), 7-6 (7/5)తో గెలుపొందాడు.

రెండో సెట్‌లో నాలుగు మ్యాచ్‌ పాయింట్లు వదులుకున్న థీమ్‌... నిర్ణాయక మూడో సెట్‌ టైబ్రేక్‌లో ఒక దశలో 0-4తో వెనుకబడ్డాడు. కానీ వరుసగా ఆరు పాయింట్లు గెలిచిన థీమ్‌ 6-4తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత జొకోవిచ్‌ మరో పాయింట్‌ గెలిచినా... ఆ వెంటనే థీమ్‌ మరో పాయింట్‌ సాధించి 7-5తో టైబ్రేక్‌తోపాటు సెట్‌ను, మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు.

థీమ్‌ కెరీర్‌లో ఇది 300వ విజయం కావడం విశేషం. రాఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌), మెద్వెదేవ్‌ (రష్యా) మధ్య జరిగే రెండో సెమీఫైనల్‌ విజేతతో నేడు జరిగే ఫైనల్లో థీమ్‌ ఆడతాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Sunday, November 22, 2020, 12:04 [IST]
Other articles published on Nov 22, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X