చేజారిన అరుదైన రికార్డు: యుఎస్ ఓటమిపై రోజర్ ఫెదరర్ ఇలా

హైదరాబాద్: యుఎస్ ఓపెన్ ఓటమి తనను నిరాశ పరిచిందని... అయితే మళ్లీ పుంజుకుంటానని స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ వెల్లడించాడు. మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో స్విస్ దిగ్గజం, మూడో సీడ్ రోజర్ ఫెదరర్ అన్‌సీడెడ్ గ్రిగోర్ దిమిత్రోవ్ (బల్గేరియా) చేతిలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.
రఫెల్ నాదల్ ఎంత పనిచేశాడు: సోషల్ మీడియాలో వీడియో వైరల్
మ్యాచ్ అనంతరం నిర్వహించిన మీడియో సమావేశంలో ఈ వయసులో గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలవగలరా? అన్న ప్రశ్నకు గాను రోజర్ ఫెదరర్ మాట్లాడుతూ "నా వద్ద క్రిస్టల్ బంతి లేదు. మరి నీ వద్ద? అంటూ చమత్కరించాడు. "ఎప్పటికీ తెలియదు. నేను అలా అనుకుంటున్నాను. నేను ఇప్పటికీ సానుకూల సీజనే అని అనుకుంటున్నా. ఇప్పుడు నిరాశపరిచింది, కానీ పుంజుకుంటాను. నేను బాగానే ఉన్నా" అని అన్నాడు.
యుఎస్ ఓపెన్‌లో కీలకపాత్ర
ఈ ఏడాది వింబుల్డన్ ప్రదర్శన యుఎస్ ఓపెన్‌లో కీలకపాత్ర పోషించిందా? అన్న ప్రశ్నకు గాను "నేను దాని గురించి ఆలోచించలేదు. మనం ముందుకు వెళితే, అది గతానికి సంబంధించిన విషయం. అక్కడ నేను మంచి సెమీస్ ఆడటం గుర్తుంచుకున్నాను. నేను దాని గురించి ఆలోచిస్తే, నేను నిజంగానే సంతోషంగా ఉన్నాను" అని ఫెదరర్ చెప్పుకొచ్చాడు.

యుఎస్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్న వ్యక్తిగా
అత్యధిక వయసులో యుఎస్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్న వ్యక్తిగా బిల్ లార్నెడ్ నిలిచాడు. బిల్ లార్నెడ్ 38 ఏళ్ల 8 నెలల 3 రోజుల వయసులో కూడా టెన్నిస్ అభిమానులను ఆశ్చర్యపరుస్తూ యుఎస్ ఓపెన్ టైటిల్ గెలిచాడు. అది కూడా 1911లో కావడం విశేషం. కాగా, ప్రస్తుతం ఫెదరర్ వయసు 39 ఏళ్లు.
చివరగా 2018లో గ్రాండ్ స్లామ్ టైటిల్
రోజర్ ఫెదరర్ చివరగా 2018లో గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను గెలిచాడు. కాగా, ఈ మ్యాచ్‌లో ఫెదరర్ ఆటమధ్యలో వీపు నొప్పికి ట్రీట్‌మెంట్ కోసం విరామం తీసుకున్నాడు. ఇదిలా ఉంటే, మంగళవారం ఆర్థర్ ఆషే స్టేడియంలో ఐదు సెట్లపాటు కొనసాగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో రోజర్ ఫెదరర్‌పై దిమిత్రోవ్ 3-6, 6-4, 3-6, 6-4, 6-2 తేడాతో విజయం సాధించాడు.
28 ఏళ్ల అనంతరం యుఎస్ ఓపెన్ సెమీఫైనల్లోకి
ఫలితంగా 28 ఏళ్ల అనంతరం యుఎస్ ఓపెన్ సెమీఫైనల్లోకి ప్రవేశించిన బల్గేరియా ఆటగాడిగా అరుదైన ఘనత సాధించాడు. సుమారు మూడు గంటల 12 నిముషాల పాటు సాగిన క్వార్టర్ ఫైనల్లో రోజర్ ఫెదరర్ 61 తప్పిదాలకు పాల్పడ్డాడు. 'మ్యాచ్ గెలవడం సంతోషంగా ఉంది. మ్యాచ్‌లో ఉన్నానని ఎప్పటికప్పుడు నాకు నేను అనుకున్నా. శారీరకంగా నేను చాలా బాగున్నా. ఫెదరర్‌పై కొన్ని షాట్లు ఆడటం కష్టం అయింది' అని డిమిట్రోవ్ తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications