రఫెల్ నాదల్ ఎంత పనిచేశాడు: సోషల్ మీడియాలో వీడియో వైరల్

హైదరాబాద్: యుఎస్ ఓపెన్‌కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. టోర్నీలో భాగంగా స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ క్వార్టర్ ఫైనల్స్‌లో భాగంగా 2014 ఛాంపియన్ మారిన్ సిలిచ్‌పై 6-3, 3-6, 6-1, 6-2 తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్ అనంతరం రఫెల్ నాదల్ చేసిన ఓ పని అందరినీ ఆకట్టుకుంది. మ్యాచ్ ముగిసిన తర్వాత తన ఆటోగ్రాఫ్ కోసం ఎదురుచూస్తూ ఏడుస్తోన్న ఓ చిన్నారిని నాదల్ ముద్దు చేశాడు. గ్యాలరీ నుంచి అతడిని ఎత్తుకొని తనవద్దకు తీసుకున్న రఫా... ఆ చిన్నారి ఏడుపు ఆపేవరకు ఊరడించాడు.
అంతేకాదు చిన్నారి కన్నీరు తుడిచాడు. అనంతరం చిన్నారి వద్ద నుంచి టోపీ తీసుకొని ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. ఈ మొత్తం తతంగానికి సంబంధించిన వీడియోని యూఎస్ ఓపెన్ నిర్వాహకులు తమ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఇది టెన్నిస్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
Story first published: Wednesday, September 4, 2019, 12:13 [IST]
Other articles published on Sep 4, 2019
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications