డేవిస్ కప్‌లో భారత్ శుభారంభం చేసింది. సుదీర్ఘ విరామం తర్వాత పాకిస్థాన్ గడ్డపై అడుగుపెట్టిన భారత్.. అసాధారణ ప్రదర్శనతో తొలి విజయాన్ని అందుకుంది. శనివారం ఉత్కంఠగా సాగి గ్రూప్-1 ప్లే ఆఫ్స్‌లో రామ్‌కుమార్ రామనాథన్, శ్రీరామ్ బాలాజీ సత్తా చాటడంతో తొలి రెండు సింగిల్స్ గెలిచి 2-0తో లీడ్ సాధించింది.
తొలి సింగిల్స్‌లో రామ్‌కుమార్ 6-7(3-7), 7-6(7-4), 6-0తో అసిమ్ ఖురేషిపై విజయం సాధించాడు. గ్రాస్‌కోర్టుపై జరుగుతున్న ఈ సమరంలో తొలి సింగిల్స్ 43 ఏళ్ల ఖురేషి.. రామ్‌కుమార్‌కు టఫ్ ఫైట్ ఇచ్చాడు.

తొలి సెట్ ప్రారంభంలోని రామ్‌కుమార్ సర్వీస్ బ్రేక్ చేసిన ఖురేషి 3-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. కానీ మెరుపు సర్వీసులు, బలమైన ఫోర్‌హ్యాండ్ షాట్లతో విజృంభించిన రామ్‌కుమార్ ప్రత్యర్థి సర్వీస్ బ్రేక్ చేసి ఆపై స్కోర్ సమం చేశాడు.
ఇద్దరు హోరాహోరీగా తలపడటంతో సెట్ టైబ్రేకర్‌కు మళ్లింది. టైబ్రేకర్‌లో రామ్‌కుమార్ తడబడటంతో ఖురేషి తొలి సెట్‌ను సొంతం చేసుకున్నాడు.
రెండో సెట్‌లోనూ హోరాహోరీగా తలపడ్డారు. రామ్‌కుమార్ మెరుపు విన్నర్లు కొడితే.. ఖురేషి పదునైన బ్యాక్‌హ్యాండ్ షాట్లతో బదులిచ్చాడు.
ఈ సెట్ కూడా ట్రైబ్రేకర్‌కు దారి తీయగా..రామ్‌కుమార్ పైచేయి సాధించాడు. మూడో సెట్‌లో రామ్‌కుమార్ పూర్తి ఆధిపత్యం చెలాయించగా.. ఖురేషి తేలిపోయాడు.

రెండో సింగిల్స్ మ్యాచ్‌లో శ్రీరామ్ 7-5, 6-3తో అకీల్ ఖాన్‌ను చిత్తు చేశాడు. వర్షం అంతరాయం కలిగించిన ఈ పోరులో రెండు సెట్లలో ఒక్కోసారి ప్రత్యర్థి సర్వీస్ బ్రేక్ చేసిన శ్రీరామ్... తేలిగ్గా మ్యాచ్‌ను గెలిచాడు.
ఈ మ్యాచ్‌లో శ్రీరామ్ సూపర్ షాట్లతో ఆకట్టుకున్నాడు. వర్షం అంతరాయం కలిగిన ఈ మ్యాచ్‌లో శ్రీరామ్ తిరుగలేని ప్రదర్శన కనబర్చాడు. ఆదివారం జరిగే డబుల్స్ మ్యాచ్‌లో సాకేత్ మైనేని-యుకి బాంబ్రి జోడీ.. ముజామిల్-బర్కతుల్లా జోడీ ఢీకొంటుంది.
ఈ మ్యాచ్‌లో గెలిస్తే వరల్డ్ గ్రూప్-1 దశకు భారత్ అర్హత సాధిస్తోంది. ఓడితే రివర్స్ సింగిల్స్ ఆడాల్సి ఉంటుంది.