For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Australia Open:నువ్వు దద్దమ్మవా? అంపైర్‌పై మెద్వెదెవ్ ఫైర్!

Daniil Medvedev slams chair umpire at Australian Open

మెల్‌బోర్న్: సీజన్ ఫస్ట్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్‌లో రష్యా టెన్నిస్ స్టార్, వరల్డ్ నెంబర్ 2 ప్లేయర్ డానిల్ మెద్వెదెవ్ సహనం కోల్పోయాడు. గ్రీక్‌కు చెందిన నాలుగో సీడ్ సిట్సిపాస్‌తో శుక్రవారం జరిగిన సెమీఫైనల్‌ మ్యాచ్‌లో చైర్ అంపైర్‌ కాంపిస్టోల్‌పై చిందులు తొక్కాడు. స్టాండ్స్‌లో ఉన్న సిట్సిపాస్‌ తండ్రి కొడుక్కి నిబంధనలకు విరుద్ధంగా సూచనలు ఇస్తుండటం, ఎంతకీ అంపైర్‌ స్పందించకపోవడంతో అతను తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.

నువ్వేమైనా దద్దమ్మవా..

విరామ సమయంలో కుర్చీలో కూర్చుని ఉన్న అంపైర్‌ వైపు కోపంగా చూస్తూ.. ''నువ్వేమైనా దద్దమ్మవా? అతడికి తండ్రి శిక్షణ ఇస్తుంటే నీకు కనిపించడం లేదా? నా ప్రశ్నకు జవాబు చెప్పు'' అంటూ అరిచాడు. అతడికేదో సర్ది చెప్పి.. అంపైర్‌ తల పక్కకు తిప్పగా.. ''నేను నీతో మాట్లాడుతున్నాను. నా ప్రశ్నకు జవాబు చెప్పు.

ఒక గ్రాండ్‌స్లామ్‌ సెమీఫైనల్లో ఇంత చెత్త అంపైర్‌ ఉంటారా.. ఓ మై గాడ్‌.. నీతోనే మాట్లాడుతున్నా నన్ను చూడు'' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మ్యాచ్‌ పూర్తయ్యాక కూడా అంపైర్‌ను కోపంగా ఏదో అనేసి వెళ్లాడతను. ఇదంతా అక్కడి కెమెరాల్లో రికార్డయింది. అయితే మ్యాచ్‌ ముగిసిన అనంతరం మెద్వెదెవ్‌ తన ప్రవర్తనపై అంపైర్‌ను క్షమాపణ కోరాడు.

మెద్వెదెవ్‌దే విజయం..

మెద్వెదెవ్‌దే విజయం..

సహనం కోల్పోయినా మెద్వెదెవ్ మ్యాచ్‌పై మాత్రం పట్టు విడవలేదు. 2 గంటల 30 నిమిషాలపాటు జరిగిన సెమీఫైనల్లో 25 ఏళ్ల మెద్వెదెవ్‌ 7-6 (7/5), 4-6, 6-4, 6-1తో నాలుగో సీడ్‌ సిట్సిపాస్‌ (గ్రీస్‌)ను ఓడించాడు. గత ఏడాది కూడా ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ సెమీఫైనల్లో సిట్సిపాస్‌నే ఓడించి మెద్వెదెవ్‌ ఫైనల్‌ చేరాడు. తొలి మూడు సెట్‌లలో మెద్వెదెవ్‌కు పోటీ ఎదురైనా నాలుగో సెట్‌లో మాత్రం ఈ రష్యా స్టార్‌ ఒకే గేమ్‌ కోల్పోయాడు. 13 ఏస్‌లు సంధించిన మెద్వెదెవ్‌ 39 విన్నర్స్‌ కొట్టాడు.

షాపోవాలో సైతం..

అంతకముందు ఇదే టోర్నీలో రఫేల్‌ నాదల్‌, కెనడా టెన్నిస్‌ ఆటగాడు డెనిస్‌ షాపోవాలో మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. చైర్‌ అంపైర్‌ నాదల్‌తో కుమ్మక్కయ్యాడని.. అవినీతి అంపైర్‌ అంటూ షాపోవాలో దూషించడం సంచలనంగా మారింది. ఇంతటితో ఊరుకొని షాపోవాలో... నాదల్‌కు ఒకసారి వైద్య పరీక్షలు చేయాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

ఫైనల్లో నాదల్..

ఫైనల్లో నాదల్..

క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో అతి కష్టమ్మీద గట్టెక్కిన స్పెయిన్‌ స్టార్‌ రాఫెల్‌ నాదల్‌ సెమీఫైనల్‌ అడ్డంకిని మాత్రం మరీ శ్రమించకుండానే దాటేశాడు. ఏడో సీడ్‌ మాటియో బెరెటిని (ఇటలీ)తో శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లో ఆరో సీడ్‌ నాదల్‌ 6-3, 6-2, 3-6, 6-3తో నెగ్గి ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో ఆరోసారి ఫైనల్లోకి దూసుకెళ్లాడు. 35 ఏళ్ల నాదల్‌ 2009లో ఏకైకసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌ను గెల్చుకున్నాడు. ఆ తర్వాత 2012, 2014, 2017, 2019లలో రన్నరప్‌గా నిలిచాడు.

Story first published: Saturday, January 29, 2022, 10:21 [IST]
Other articles published on Jan 29, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+