For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Australian Open: చరిత్ర సృష్టించిన వీనస్ విలియమ్స్.. అల్కరాజ్ శుభారంభం!

అమెరికా టెన్నిస్ స్టార్ వీనస్ విలియమ్స్ చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియా ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్ టోర్నీ చరిత్రలోనే సింగిల్స్ ఆడిన అత్యంత పెద్ద వయసున్న మహిళా క్రీడాకారిణిగా నిలిచింది. 45 ఏళ్ల వయసులో ఆమె ఈ టోర్నీ ఆడి ఈ అరుదైన ఘనతను అందుకుంది. ఈ క్రమంలో ఆమె జపాన్‌కు చెందిన కిమికో డేట్ (44 ఏళ్లు) రికార్డ్‌ను బద్దలు కొట్టింది.

వీనస్ విలియమ్స్ ర్యాంక్ 576 కాగా.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఆమె ఈ టోర్నీ‌లో ఆడింది. మహిళల సింగిల్ తొలి రౌండ్ మ్యాచ్‌లో వీనస్ విలియమ్స్ 7 6, 3 6, 4 6 తేడాతో సెర్బియాకు చెందిన ఓల్గా డానిలో‌విచ్ చేతిలో ఓటమిపాలైంది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌‌ను వీనస్ విలియమ్స్ తృటిలో చేజార్చుకుంది. తొలి సెట్ గెలిచిన ఆమె రెండో సెట్‌లో ఓటమిపాలైంది. మూడో సెట్‌లో 4 0తో ఆధిక్యంలో నిలిచి ఆధిపత్యం చెలాయించింది. కానీ ప్రత్యర్థి ఓల్గా పుంజుకొని వీనస్ విలియమ్స్‌ను మట్టికరిపించింది.

Carlos Alcaraz Triumphs at Australian Open 2026 as Venus Williams Makes History at 45

1998లో 17 ఏళ్ల వయసులో ఆస్ట్రేలియా ఓపెన్‌లోకి అరంగేట్రం చేసిన వీనస్ విలియమ్స్.. తొలి టోర్నీలోనే క్వార్టర్స్‌కు చేరుకుంది. గత 28 ఏళ్లుగా ఆస్ట్రేలియా ఓపెన్ ఆడుతున్నా.. టైటిల్ మాత్రం అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. 2003, 2017లో ఫైనల్ చేరినప్పటికీ.. తన సోదరి సెరెనా విలియమ్స్ చేతిలో ఖంగుతిన్నది. తాజా ఆస్ట్రేలియా ఓపెన్ టోర్నీలో వీనస్ సింగిల్స్‌లో ఓడిపోయినప్పటికీ.. ఎకటెరినా అలెక్సాండ్రోవాతో కలిసి డబుల్స్ విభాగంలో పోటీపడుతుంది.

అల్కరాజ్ శుభారంభం..

పురుషుల సింగిల్స్‌లో స్పెయిన్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ శుభారంభం చేశాడు. తొలి రౌండ్ మ్యాచ్‌లో అల్కరాజ్ 6 3,7 6(7 6), 6 2 తేడాతో ఆస్ట్రేలియా ప్లేయర్ ఆడమ్ వాల్ట్‌ను ఓడించాడు. జర్మనీకి చెందిన యానిక్ హాన్ఫ్‌మాన్‌తో అతను రెండో రౌండ్‌లో ఆడనున్నాడు.

గత నాలుగు ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీల్లో అల్కరాజ్‌కు నిరాశే ఎదురైంది. అతను క్వార్టర్ ఫైనల్స్ కూడా ధాటలేదు. గతేడాది నొవాక్ జకోవిచ్ చేతిలో ఓడిన అల్కరాజ్.. అంతకుముందు అలెగ్జాండర్ జ్వెరెవ్ చేతిలో ఖంగుతిన్నాడు. ఈ సారి ఆస్ట్రేలియా ఓపెన్‌లో విజేతగా నిలిస్తే.. ఏడు గ్రాండ్ స్లామ్ టైటిళ్లు గెలిచిన అతి పిన్న వయస్కుడిగా నిలుస్తాడు. 24 ఏళ్ల వయసులో రాఫెల్ నాదల్, 23 ఏళ్ల వయసులో బోర్గ్ ఈ ఫీట్ సాధించారు.

Story first published: Monday, January 19, 2026, 17:27 [IST]
Other articles published on Jan 19, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+