For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Australia Open: నొవాక్ జకోవిచ్ సెంచరీ.. ఆల్‌టైమ్ రికార్డ్!

సెర్బియా టెన్నిస్ దిగ్గజం నొవాక్ జకోవిచ్ చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియా ఓపెన్‌లో 100వ విజయాన్ని నమోదు చేశాడు. ఈ ఘనతను అందుకున్న రెండో పురుషుల సింగిల్స్ ఆటగాడిగా చరిత్రకెక్కాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో నొవాక్ జకోవిచ్ 6-3, 6-2, 6-2 తేడాతో స్పానిష్ ప్లేయర్ పెడ్రో మార్టినెజ్‌‌ను ఓడించడం ద్వారా ఈ ఫీట్ సాధించాడు.

ఈ మ్యాచ్‌లో జకోవిచ్ పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. ఒక్క బ్రేక్ పాయింట్ కూడా ఎదుర్కోని జకోవిచ్.. తన తొలి సర్వీస్‌లోనే 93 శాతం పాయింట్స్ గెలుచుకున్నాడు. అంతేకాకుండా ఈ మ్యాచ్‌లో అతను 14 ఏస్‌లు కొట్టాడు. వాటిలో ఒకటి మ్యాచ్ పాయింట్ కావడం విశేషం.

Australian Open 2026 Novak Djokovic Creates History With 100th Win at the Tournament

తొలి ప్లేయర్‌గా..

ఆస్ట్రేలియా ఓపెన్‌లో 110 మ్యాచ్‌లు ఆడిన జకోవిచ్ 100 విజయాలు సాధించి కేవలం 10 మ్యాచ్‌ల్లోనే ఓటమిపాలయ్యాడు. ఈ టోర్నీలో మొత్తం 10 సార్లు విజేతగా నిలిచాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ మూడు వేర్వేరు గ్రాండ్ స్లామ్ టోర్నీల్లో 100 లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లు గెలిచిన తొలి పురుష టెన్నిస్ ప్లేయర్‌గా జకోవిచ్ చరిత్ర సృష్టించాడు.

వింబుల్డన్‌లో 102, ఫ్రెంచ్ ఓపెన్‌లో 101 విజయాలు సాధించిన జకోవిచ్.. 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలవడమే లక్ష్యంగా ఆస్ట్రేలియా ఓపెన్ బరిలో నిలిచాడు. తదుపరి రెండు వారాల్లో మరో ఆరు విజయాలు సాధిస్తే జకోవిచ్ 25వ గ్రాండ్ స్లామ్ టైటిల్ కల నెరవేరుతోంది. తద్వారా పురుషుల సింగిల్స్ టెన్నిస్ చరిత్రలోనే అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిళ్లు గెలిచిన ఆటగాడిగా జకోవిచ్ చరిత్రకెక్కుతాడు. మార్గరెట్ కోర్ట్ రికార్డును అధిగమిస్తాడు.

ఫెదరర్ రికార్డ్ సమం..

తాజా ఆస్ట్రేలియా ఓపెన్ టోర్నీ.. జకోవిచ్‌కు 81వ గ్రాండ్ స్లామ్ మెయిన్ డ్రా. తద్వారా అత్యధిక గ్రాండ్ స్లామ్ మెయిన్ డ్రాలు ఆడిన మూడో ఆటగాడిగా జకోవిచ్ నిలిచాడు. ఈ క్రమంలో అతను రోజర్ ఫెదరర్, ఫెలిసియానో లోపేజ్ పేరిట ఉన్న రికార్డ్‌ను సమం చేశాడు.

జకోవిచ్ 2025లో నాలుగు గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో సెమీఫైనల్ చేరుకున్నప్పటికీ..లక్ష్యాన్ని అందుకోలేకపోయాడు. ముఖ్యంగా గత రెండేళ్లుగా అతనికి కార్లోస్ అల్కరాజ్, జానిక్ సిన్నర్ అడ్డుగా నిలుస్తున్నారు. ఈ ఇద్దరు యువ ఆటగాళ్లను జకోవిచ్ అధిగమించలేకపోతున్నాడు. బుధవారం జరిగే రెండో రౌండ్‌లో జకోవిచ్.. ఇటలీకి చెందిన ఫ్రాన్సెస్కో మెస్ట్రెల్లితో తలపడనున్నాడు.

Story first published: Monday, January 19, 2026, 21:52 [IST]
Other articles published on Jan 19, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+