Australia Open 2026 క్వీన్ ఎలెనా రైబకినా.. కన్నీటిపర్యంతమైన సబలెంకా!
ప్రతిష్టాత్మక టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్ 2026 మహిళల సింగిల్స్ విజేతగా కజకిస్థాన్ స్టార్ ఎలైనా రైబకినా నిలిచింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ అరీనా సబలెంకా 4-6, 6-4, 4-6 తేడాతో ఐదో సీడ్ ఎలైనా రైబకినా చేతిలో ఓటమిపాలైంది. అద్వితీయమైన ప్రదర్శనతో వరల్డ్ నెంబర్ వన్ సబలెంకాకు షాకిచ్చిన ఎలైనా రైబకినా కెరీర్‌లో తొలి ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్‌ను ముద్దాడింది.
ఓవరాల్‌గా ఎలైనా రైబకినాకు ఇది రెండో గ్రాండ్‌స్లామ్. అంతకుముందు వింబుల్డన్ 2022 టైటిల్ గెలిచింది. తాజా విజయంతో ఆస్ట్రేలియా ఓపెన్ 2023 ఫైనల్లో సబలెంకా చేతిలో ఎదరైనా పరాజయానికి రైబకినా ప్రతీకారం తీర్చుకుంది.
రూ.22 కోట్ల ప్రైజ్‌మనీ..
ఆస్ట్రేలియా ఓపెనర్ 2026 విజేతగా నిలిచిన ఎలైనా రైబకినాకు రూ.25 కోట్ల 25 లక్షల రూపాయల ప్రైజ్‌మనీ లభించింది. ఈ గెలుపుతో రైబకినా తన కెరీర్ బెస్ట్ ర్యాంకింగ్ నెంబర్ 3కి చేరుకోనుంది. సుమారు 2 గంటల 18 నిమిషాల పాటు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ఎలెనా రైబకినా పై చేయి సాధించింది. నిర్ణయాత్మక మూడో సెట్‌లో ఒక దశలో రైబకినా 0-3తో వెనుకంజలో నిలిచింది. దాంతో సబలెంకా విజయం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ రైబకినా నేలకు కొట్టిన బంతిలా పుంజుకొని వరుస గేమ్‌లు గెలిచి సెట్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.

కన్నీటి పర్యంతమైన సబలెంకా..
తొలి సెట్‌లో ఆధిపత్యం చెలాయించిన రైబకినా 37 నిమిషాల్లోనే 6-4తో గెలిచింది. రెండో సెట్‌లో సబలెంకా పుంజుకోవడంతో పోరు హోరాహోరీగా మారింది. 55 నిమిషాల పోరాటం తర్వాత 6-4తో సబలెంకా రెండో సెట్ కైవసం చేసుకుంది. దాంతో నిర్ణయాత్మక మూడో సెట్ ఆడాల్సి వచ్చింది. అత్యంత ఉత్కంఠగా సాగిన ఈ సెట్‌లో రైబకినా వెనుకంజలో నిలిచినా.. పట్టు విడవకుండా పోరాడి 46 నిమిషాల్లో సెట్‌ను కైవసం చేసుకోవడంతో పాటు తొలి టైటిల్‌ను ముద్దాడింది.
ఈ ఓటమిని తట్టుకోలేకపోయిన సబలెంకా తన సీట్లో కూర్చొని వెక్కి వెక్కి ఏడ్చింది. మూడో సెట్‌లో 3-0తో ఆధిక్యంలో ఉన్నప్పటికీ మ్యాచ్ చేజారడాన్ని ఆమె తట్టుకోలేకపోయింది. ఇప్పటి వరకు నాలుగు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలిచిన సబలెంకా.. మరో నాలుగు ఫైనల్లో ఓటమిపాలైంది. ఈ సీజన్‌లో ఒక సెట్ కూడా కోల్పోకుండా విజయాల పరంపర కొనసాగించిన సబలెంకాకు రైబికినా బ్రేక్ వెసింది. 2001, 2002 ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఛాంపియన్ అయిన జెన్నిఫర్ కాప్రియాటి చేతుల మీదుగా రైబకినా టైటిల్ అందుకుంది.
team support above everything else 💕 #AO26@wwos • @espn • @tntsports • @wowowtennis • #AO26 pic.twitter.com/8O82TIIsYC
— #AusOpen (@AustralianOpen) January 31, 2026
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications