Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Australia Open: పాపం జకోవిచ్.. వెంటాడిన దురదృష్టం!

25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ లక్ష్యంగా ఆస్ట్రేలియా ఓపెన్ 2025 బరిలోకి దిగిన సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్‌ను దురదృష్టం వెంటాడింది. అసాధారణ ప్రదర్శనతో సెమీఫైనల్ చేరిన ఈ సెర్బియా స్టార్.. అనూహ్య రీతిలో టోర్నీ నుంచి తప్పుకున్నాడు.

జర్మనీ స్టార్ అలెగ్జాండ్ జ్వెరెవ్‌తో గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి సెమీఫైనల్లో దురదృష్టవశాత్తు జకోవిచ్ గాయపడ్డాడు. దాంతో ఆట మధ్యలోనే వైదొలగడంతో జ్వెరెవ్ విజేతగా నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించాడు. తనకు అలవాటైన రీతిలోనే జకోవిచ్ 6-7(5/7)తో తొలి సెట్‌ను కోల్పోయాడు. గాయం కారణంగా ఆట మధ్యలోనే వైదొలిగాడు.

Australian Open 2025 Novak Djokovic retires injured as Alexander Zverev reaches final

తొలి సెట్ కోల్పోయిన జకోవిచ్‌ను ప్రేక్షకులు ఎగతాళి చేశారు. హోరాహోరీగా సాగిన తొలి సెట్ టై బ్రేక్‌కు దారి తీయగా.. అలెగ్జండర్ జ్వెరెవ్‌ పైచేయి సాధించాడు. కార్లోస్ అల్కరాజ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లోనే జకోవిచ్ గాయపడ్డాడు. అయినా సెమీఫైనల్లో బరిలోకి దిగి పోరాడాడు. కానీ గాయం తీవ్రత ఎక్కువ కావడంతో ఆట మధ్యలోనే తప్పుకున్నాడు.

సెకండ్ సెట్‌ ఆరంభంలో బంతిని నెట్స్‌లోకి కొట్టిన జకోవిచ్.. వెంటనే మ్యాచ్ నుంచి తప్పుకుంటున్నట్లు చైర్ అంపైర్‌కు తెలియజేశాడు.దాంతో అంపైర్ జ్వెరెవ్‌ను విజేతగా ప్రకటించాడు.

ఈ విజయానంతరం జ్వెరెవ్ మాట్లాడుతూ.. గాయంతో తప్పుకున్న జకోవిచ్‌ను ఎగతాళి చేయడం సరికాదన్నాడు. 'ప్రతీ ఒక్కరు టికెట్లు కొని మ్యాచ్ చూసేందుకు వచ్చారని నాకు తెలుసు. ఐదు సెట్ల మ్యాచ్ చూడాలని ఆశపడ్డారు. జకోవిచ్ పొత్తి కడుపు, తొడ కండరాల గాయంతో బాధపడుతూ ఈ టోర్నీలో విజయాలు సాధించాడు. కాబట్టి అతనికి కనీస గౌరవం ఇవ్వండి.'అని జ్వెరేవ్ కోరాడు.

ఆస్ట్రేలియా ఓపెన్‌లో జ్వెరెవ్ ఫైనల్ చేరడం ఇదే తొలిసారి. సినర్, షెల్టన్ మధ్య జరిగే రెండో సెమీఫైనల్ విజేతతో జ్వెరేవ్ ఫైనల్ మ్యాచ్ ఆడనున్నాడు. ఈ మ్యాచ్ ఆదివారం జరగనుంది.
మహిళల సింగిల్స్ ఫైనల్లో సబలెంక(బెలారస్), మాడిసన్‌ కీస్‌(అమెరికా) ఫైనల్ చేరిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ శనివారం జరగనుంది.

Story first published: Friday, January 24, 2025, 12:06 [IST]
Other articles published on Jan 24, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+