Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Australia Open 2025: చరిత్ర సృష్టించిన 19 ఏళ్ల కుర్రాడు.. మెద్వెదెవ్ ఔట్!

ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో రష్యా స్టార్ ప్లేయర్ డానిల్ మెద్వెదేవ్‌కు షాక్ తగిలింది. గత మూడు సార్లు ఆస్ట్రేలియా ఓపెన్‌లో భంగపడిన మెద్వెదెవ్ ఈ సారి ఎలాగైనా టైటిల్ సాధించాలనే పట్టుదలతో బరిలోకి దిగాడు. కానీ గురువారం జరిగిన రెండో రౌండ్‌లో ఐదో సీడ్ మెద్వెదెవ్‌‌కు అమెరికా టీనేజర్ 19 ఏళ్ల లెర్నర్‌ టీన్‌ ఊహించని షాకిచ్చాడు.

35 ఏళ్ల తర్వాత..
దాదాపు ఐదు గంటల పాటు సాగిన ఈ పోరులో లెర్నర్‌ 6-3, 7-6 (4), 6-7 (10), 1-6, 7-6 (7) తేడాతో 28 ఏళ్ల మెద్వెదెవ్‌‌ను ఓడించాడు. 1990లో సంప్రాస్‌ తర్వాత ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో పిన్న వయస్సులో మూడోరౌండ్‌ చేరిన అమెరికన్‌గా లెర్నర్‌ చరిత్రకెక్కాడు. ఐదు సెట్ల పాటు హోరాహోరీగా సాగిన ఈ పోరులో అమెరికన్ టీనేజర్ ముందు గతేడాది రన్నరప్ అయిన మెద్వెదెవ్ తేలిపోయాడు.

Australian Open 2025 Day 5 Results The 19-year-old American Tien stuns Medvedev Swiatek advance to round 3

ఇతర మ్యాచ్‌ల్లో టాప్‌సీడ్‌ సిన్నర్‌ 4-6, 6-4, 6-1, 6-3తో ట్రిస్టాన్‌పై విజయం సాధించాడు. ఫ్రిట్జ్‌ 6-2, 6-1, 6-0తో క్రిస్టియన్‌ను, డిమినార్‌ 6-2, 6-4, 6-3తో బోయర్‌ను, 13వ సీడ్‌ హోల్గర్‌ రూన్‌ 7-6, (3), 2-6, 6-3, 7-6 (6)తో బెరెటినిని ఓడించి మూడో రౌండ్‌లో అడుగుపెట్టారు.

భారత్ జోడీ శుభారంభం:
పురుషుల డబుల్స్‌లో భారత్‌కు చెందిన శ్రీరామ్‌ బాలాజీ -మిగ్వెల్‌ ఆంజెల్‌ (మెక్సికో) ద్వయం 6-4, 6-3తో డచ్‌, కజక్‌ జంట రాబిన్‌-అలెగ్జాండర్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో బాలాజీ ద్వయం 23 విన్నర్లు కొట్టింది.

మరోవైపు భారత్‌కే చెందిన రిత్విక్ బొల్లిపల్లి పోరు ముగిసింది. తొలి రౌండ్‌లో రిత్విక్, ర్యాన్ సెగర్మన్ జంట 6-7(5/7), 1-6తో ఆరో సీడ్ జోడీ హారీ హెలియోవార(ఫిన్లాండ్), హెన్రీ ప్యాటెన్(బ్రిటన్) చేతిలో ఓటమిపాలైంది. జీవన్-ప్రశాంత్ జోడీ 2-6, 2-6తో జాక్(ఫ్రాన్స్), లజ్(బ్రెజిల్) చేతిలో పరాజయంపాలైంది. అనిరుధ్ చంద్రశేఖర్, కరోల్(పొలెండ్)జోడీ 6-7(1-7), 6-2, 6-7(6-10)తో జుమర్(బోస్నియా), సిట్సిపాస్(గ్రీస్) జంట చేతిలో కంగుతింది.

ఇగా స్వైటెక్ జోరు..
మహిళల సింగిల్స్‌లో ఐదు గ్రాండ్‌స్లామ్‌ల విజేత, రెండో సీడ్ ఇగా స్వైటెక్ అలవోకగా మూడో రౌండ్‌లోకి ప్రవేశించింది. ఏకపక్షంగా సాగిన రెండో రౌండ్‌లో ఈ పోలెండ్ భామ 6-0, 6-2తో రెబెకా స్రంకోవా(స్లోవేకియా)పై విజయం సాధించింది. గంటలోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో స్వైటెక్ రెండు ఏస్‌లు, 16 విన్నర్లు కొట్టింది. ప్రత్యర్థి 4 డబుల్ ఫాల్ట్‌లతో పాటు 26 అనవసర తప్పిదాలు చేసింది.
మూడో రౌండ్‌లో ఎమ్మా రదుకానుతో స్వైటెక్‌ తలపడుతుంది.

ఇతర మ్యాచ్‌ల్లో 22 ఏళ్ల బ్రిటన్‌ ప్లేయర్‌ రదుకాను 6-3, 7-5తో అమందాపై విజయం సాధించింది. నాలుగో సీడ్‌ పోలిని 6-2, 6-3తో రెనటాపై, 6వ సీడ్‌ రిబకినా 6-0, 6-3తో జోవిక్‌పై, 8వ సీడ్‌ ఎమ్మా నవారో 6-3, 3-6, 6-4తో వాంగ్‌ షియుపై, 9వ సీడ్‌ కసట్కినా 6-2, 6-0తో యఫాన్‌పై, కొలిన్స్‌ 7-6 (4), 4-6, 6-2తో విజయం సాధించి టోర్నీలో ముందడుగు వేసారు.

Story first published: Friday, January 17, 2025, 10:34 [IST]
Other articles published on Jan 17, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+