For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Australia Open 2024 మెయిన్ డ్రాకు భారత టెన్నిస్ స్టార్!

ప్రతిష్టాత్మక టెన్నిస్ గ్రాండ్ స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్ 2024 మెయిన్ డ్రాకు భారత సింగిల్స్ ఆటగాడు సుమిత్ నగాల్ అర్హత సాధించాడు. మూడేళ్ల తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో భారత సింగిల్స్ ఆటగాడు బరిలోకి దిగబోతున్నాడు.

ప్రపంచ ర్యాంకింగ్స్ 139వ స్థానంలో ఉన్న సుమిత్ నగాల్.. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలిఫికేషన్ ఫైనల్లో విజేతగా నిలిచాడు. ఈ తుది పోరులో సుమిత్ 6-4, 6-4 తేడాతో అలెక్స్ మోల్కాన్(స్లోవేకియా)పై విజయం సాధించాడు. మెయిన్ డ్రా తొలి రౌండ్‌లో 31వ ర్యాంకర్ అలెగ్జాండర్ బబ్లిక్(కజకిస్థాన్)తో సుమిత్ నగాల్ తలపడుతాడు.

Australian Open 2024: India Tennis Star Sumit Nagal qualify for a Grand Slam singles main draw

సుమిత్ చివరగా ఆస్ట్రేలియా ఓపెన్ 2021 టోర్నీ మెయిన్ డ్రా ఆడాడు. అప్పుడు తొలి రౌండ్‌లోనే ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించాడు. 2019, 2020లో యూఎస్ ఓపెన్ మెయిన్ డ్రాకు సుమిత్ అర్హత సాధించాడు. యూఎస్ ఓపెన్ 2020లో రెండో రౌండ్ చేరడమే గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో సుమిత్ నగాల్‌కు అత్యుత్తమ ప్రదర్శన.

చరిత్రకు అడుగు దూరంలో జకోవిచ్..
ఆదివారం నుంచి ప్రారంభం కానున్న ఆస్ట్రేలియా ఓపెన్ ప్రధాన టోర్నీలో సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్, 19 ఏళ్ల అమెరికా టీనేజ్ సంచలనం కోకో గాఫ్ హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్నారు. ఇప్పటికే ఆస్ట్రేలియా ఓపెన్ చరిత్రలో అత్యధిక సార్లు విజేతగా నిలిచిన జకోవిచ్ 11వ టైటిల్‌పై కన్నేసాడు.

అంతేకాకుండా 25 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లతో టెన్నిస్ చరిత్రలోనే అత్యధిక విజయాలు సాధించిన సింగిల్స్ ప్లేయర్‌గా తన పేరును లిఖించుకునేందుకు సిద్దమయ్యాడు. ఆస్ట్రేలియా ఓపెన్‌లో తాను ఆడిన గత 28 మ్యాచ్‌ల్లో జకోవిచ్‌కు ఓటమే లేదు. ఆడిన గత నాలుగు(2019, 2020, 2021, 2023) సీజన్లలో అతనే ఛాంపియన్.

Australian Open 2024: India Tennis Star Sumit Nagal qualify for a Grand Slam singles main draw

గోల్డెన్ స్లామ్‌పై గురి..
కరోనా వ్యాక్సిన్ వేసుకోని కారణంగా 2022లో అతన్ని టోర్నీలో ఆడనివ్వలేదు. 2023 టోర్నీలో అడుగుపెట్టి విజేతగా నిలిచి ఆస్ట్రేలియా ఓపెన్ తన అడ్డా అని చాటి చెప్పాడు. రోజర్ ఫెదరర్ రిటైర్ అవ్వడం, నాదల్ గాయంతో దూరమవ్వడంతో జకోవిచ్‌కు తిరుగులేకుండా పోయింది.

గతేడాది ఆస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, యూఎస్ ఓపెన్ గెలిచిన అతను వింబుల్డన్ ఫైనల్లో ఓడాడు. ఈ సారి ఈ నాలుగు టైటిళ్లు గెలవడంతో పాటు పారిస్ ఒలింపిక్స్‌లో పసిడి సాధించి గోల్డెన్ స్లామ్ సాధించాలనుకుంటున్నాడు.

Story first published: Saturday, January 13, 2024, 10:18 [IST]
Other articles published on Jan 13, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+