For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Australian Open 2022: వీడిన సందిగ్దత.. బరిలో మాజీ చాంపియన్ నొవాక్ జకోవిచ్!

Australian Open 2022: Novak Djokovic to defend title after exemption from vaccination

సిడ్నీ: వరల్డ్ నెంబర్ వన్, సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్.. ఆస్ట్రేలియా ఓపెన్ బరిలో దిగడంపై నెలకొన్న సందిగ్దతకు తెరపడింది. కరోనా వ్యాక్సిన్ వేయించుకనే విషయంలో నిర్వహాకులు జకోవిచ్ ప్రత్యేక మినహాయింపు ఇవ్వడంతో ఈ సెర్బియా స్టార్ ఆడటం ఖాయమైంది. ఈ ఏడాది తొలి గ్రాండ్ స్లామ్ టోర్నీ అయిన ఆస్ట్రేలియా ఓపెన్ బరిలోకి దిగడంపై జకోవిచ్ కూడా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పష్టతనిచ్చాడు. 'ఈ విరమాన్ని నాకు నచ్చిన వారితో అద్భుతంగా గడిపాను. ఇక ఈ రోజు నాకు ప్రత్యేక అనుమతి లభించడంతో 2022లో సత్తా చాటేందుకు ఎదురుచూస్తున్నాను'అని జకోవిచ్ రాసుకొచ్చాడు.

ఆస్ట్రేలియా క్వారంటైన్ రూల్స్ ప్రకారం వ్యాక్సిన్ వేయించుకునే వారికే ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడే అవకాశం కల్పిస్తుండగా.. జకోవిచ్ ఇప్పటిదాకా ఒక్క డోస్ టీకా కూడా వేసుకోలేదు. ఇంకో రెండు వారాల్లోనే టోర్నీ ఆరంభం కాబోతుండటంతో.. జకోవిచ్ ఆడటంపై సందిగ్దత నెలకొంది. అయితే తాజాగా టోర్నీ నిర్వహాకులు జకోవిచ్‌కు ఈ నిబంధన నుంచి ప్రత్యేక మినహాయింపు ఇవ్వడంతో ఈ సెర్బియా స్టార్‌కు లైన్ క్లియర్ అయింది. అయితే జకోవిచ్ కరోనా టీకా తీసుకోకపోవడానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు.

ఈ నెల 17న మెల్‌బోర్న్ పార్క్‌లో ప్రారంభమయ్యే ఈ టోర్నీ కోసం మిగతా క్రీడాకారులంతా సన్నాహాలు మొదలుపెట్టారు. ఇప్పటికే పురుషుల ఏటీపీ కప్ టీమ్ ఈవెంట్ జరుగుతుండగా.. ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు సన్నాహకంగా రెండు డబ్ల్యూటీఏ, ఒక ఏటీపీ టోర్నీలు నిర్వహించనున్నారు. అయితే జకోవిచ్ ఎక్కడా కనిపించకపోవడం అందర్ని ఆశ్చర్యాని గురిచేసింది. ఆస్ట్రేలియా ఓపెన్‌లో 9 సార్లు విజేతగా నిలిచిన నొవాక్ ..10వ టైటిల్‌పై కన్నేసాడు. ప్రస్తుతం రోజర్ ఫెడరర్, రఫేల్ నాధల్, నొవాక్ జొకోవిచ్ 20 గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిళ్లతో సమానంగా ఉన్నారు.

Story first published: Tuesday, January 4, 2022, 20:44 [IST]
Other articles published on Jan 4, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+