Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Australia Open 2024: చరిత్ర సృష్టించిన రోహన్ బోపన్న

భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియా ఓపెన్ 2024 టోర్నీలో పురుషుల డబుల్స్ విభాగంలో విజేతగా నిలిచాడు. ఆస్ట్రేలియాకు చెందిన తన సహచరుడు ఎబ్డెన్‌తో కలిసి ఈ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను అందుకున్నాడు. కెరీర్‌లో తొలి సారి ఆస్ట్రేలియా ఓపెన్ డబుల్స్ విజేతగా నిలిచాడు. 43 ఏళ్ల లేటు వయసులో టైటిల్ గెలిచి అతిపెద్ద వయసులో ఈ ఫీట్ సాధించిన తొలి ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు.

శనివారం జరిగిన ఫైనల్లో బోపన్న-ఎబ్డెన్ జోడీ 7-6(7/0), 7-5 తేడాతో ఇటలీ జోడీ సిమోన్-వావోసోరిపై విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన ఈ ఫైనల్లో ఇటలీ జోడీ నుంచి బోపన్న జంట తీవ్ర పోటీని ఎదుర్కొంది.

Australia Open 2024: Rohan Bopanna-Matthew Ebden Win Mens Doubles Final In Straight Sets

తొలి పాయింట్ నుంచి ఇరు జోడీలు నువ్వా-నేనా అన్నట్లు తలపడ్డాయి. టై బ్రేక్‌‌కు దారి తీసిన తొలి సెట్‌ను సొంతం చేసుకున్న బోపన్న జోడీ.. రెండో సెట్‌లో కాస్త తడబడింది. ఓ దశలో రోహన్ జోడీ 3-4తో వెనకబడినా పుంజుకుంది. దాంతో నిర్ణయాత్మక మూడో సెట్‌కు దారితీస్తుందా? అనిపించింది. కానీ రోహిన్-ఎబ్డెన్ అద్భుతంగా పుంజుకొని రెండో సెట్‌ను 7-5తో సొంతం చేసుకొని విజేతగా నిలిచింది. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం రోహన్ బోపన్నకు పద్మ పురస్కారం ప్రకటించింది.

కెరీర్‌లో తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను గెలిచిన రోహన్ బోపన్న 2017లో మిక్స్‌డ్ డబుల్స్‌లో ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా నిలిచాడు. పురుషుల విభాగంలో లియాండర్ పేస్, మహేశ్ భూపతి తర్వాత గ్రాండ్‌స్లామ్ నెగ్గిన మూడో భారత ఆటగాడిగా రోహిన్ బోపన్న చరిత్రకెక్కాడు. డబుల్స్ విభాగంలో బోపన్న సుమారు 60 సార్లు గ్రాండ్‌స్లామ్స్ టోర్నీలో పోటీ పడగా.. తొలిసారి అతనికి విజయం దక్కింది.

Story first published: Saturday, January 27, 2024, 20:12 [IST]
Other articles published on Jan 27, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+