For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Australia Open 2024: స్టీవ్ స్మిత్‌కు సలాం కొట్టిన జకోవిచ్ (వీడియో)

ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్‌కు టెన్నిస్ దిగ్గజం, సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్ సలాం కొట్టాడు. ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ టెన్నిస్ స్కిల్స్ చూసి జకోవిచ్ షాక్ అయ్యాడు. అతనితో సరదాగా టెన్నిస్ ఆడిన జకోవిచ్.. స్మిత్ టెన్నిస్ నైపుణ్యానికి ఫిదా అయ్యాడు. సూపర్ ఫుట్‌వర్క్‌తో స్టీవ్ స్మిత్ పాయింట్ సాధించడంతో అవాక్కైన జకోవిచ్.. కోర్టులోనే అతనికి స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చాడు.

ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. జనవరి 14 నుంచి ఆస్ట్రేలియా ఓపెన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ ఇద్దరూ సూపర్ స్టార్లు గురువారం ఓ ఛారిటీ మ్యాచ్ ఆడారు. ఈ మ్యాచ్‌లో జకోవిచ్ పవర్‌ఫుల్ సర్వ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్న స్మిత్.. సూపర్ ఫుట్‌వర్క్‌తో బంతిని నెట్‌ను ధాటించాడు.

Australia Open 2024: Novak Djokovic in awe of Steve Smiths tennis skills

స్మిత్ కొట్టిన షాట్‌కు జకోవిచ్ వద్ద సమాధానం లేకుండా పోయింది. వెంటనే స్మిత్‌కు జకోవిచ్ స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చాడు. అనంతరం టెన్నిస్ కోర్టులోనే జకోవిచ్ బ్యాటింగ్ చేశాడు. కానీ స్మిత్‌లా ఆకట్టుకోలేకపోయాడు. కనీసం బంతిని బ్యాట్‌తో టచ్ కూడా చేయలేకపోయాడు. బ్యాట్‌తో తనకు ఆడటం రాలేదని టెన్నిస్ రాకెట్‌తో క్రికెట్ ఆడాడు.

ఈ రెండు ఘటనలకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. వీడియో ఆఫ్ ది డే అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. డిఫెండింగ్ ఛాంపియన్‌ హోదాలో ఆస్ట్రేలియా ఓపెన్ ఆడనున్న నొవాక్ జకోవిచ్.. ప్రీ క్వార్టర్‌లో తొలి మ్యాచ్ ఆడనున్నాడు. 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై కన్నేసిన జకోవిచ్.. క్వార్టర్ట్ ఫైనల్లో స్టెఫనోస్ సిట్సిపాస్‌తో తలపడే అవకాశం ఉంది.

గతేడాది నాలుగు గ్రాండ్ స్లామ్ టైటిళ్లలో మూడు గెలిచిన జకోవిచ్.. వింబుల్డన్ టోర్నీలో మాత్రమే విజేతగా నిలవలేకపోయాడు. ఈ ఏడాది అన్ని టోర్నీల్లో విజేతగా నిలవడంతో పాటు పారిస్ ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించి గోల్డెన్ స్లామ్ గెలిచి ఆటగాడిగా నిలవాలనుకుంటున్నాడు. మరోవైపు స్టీవ్ స్మిత్ వెస్టిండీస్‌తో జరగనున్న వన్డే సిరీస్‌లో ఆస్ట్రేలియా జట్టుకు సారథ్యం వహించనున్నాడు. ప్యాట్ కమిన్స్‌కు రెస్ట్ ఇవ్వడంతో అతనికి కెప్టెన్సీ అవకాశం దక్కింది.

Story first published: Thursday, January 11, 2024, 16:52 [IST]
Other articles published on Jan 11, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+