Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Australia Open 2024: నయా ఛాంపియన్ జెనిక్ సిన్నర్!

ఆస్ట్రేలియా ఓపెన్ 2024 టోర్నీ‌లో నయా ఛాంపియన్ అవతరించాడు. అసాధారణ ప్రదర్శనతో ఫైనల్‌కు దూసుకొచ్చిన ఇటాలియన్ ప్లేయర్ జెనిక్ సిన్నర్ అద్వితీయమైన ఆటతో విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో సిన్నర్ 3-6, 3-6, 6-4, 6-4, 6-3 తేడాతో మూడో సీడ్ మెద్వదేవ్(రష్యా)‌ను ఓడించాడు.

ఈ గెలుపుతో కెరీర్‌లో తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను జెనిక్ సిన్నర్ సొంతం చేసుకున్నాడు. గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలిచిన మూడో ఇటాలియన్ ప్లేయర్‌గా.. ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ గెలిచిన తొలి ఇటాలియన్‌గా జెనిక్ సిన్నర్ చరిత్రకెక్కాడు. నొవాక్ జకోవిచ్ తర్వాత ఆస్ట్రేలియా ఓపెన్ గెలిచిన అతి పిన్నవయస్కుడిగా కూడా సిన్నర్ రికార్డ్ సృష్టించాడు.

 Australia Open 2024: Jannik Sinner beats Medvedev to clinch the title

సిన్నర్ 22 ఏళ్ల 165 రోజుల వయసులో ఆస్ట్రేలియా ఓపెన్ గెలవగా.. 2008లో జకోవిచ్ 20 ఏళ్ల 250 రోజుల వయసులో ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ అందుకున్నాడు. మూడున్నర గంటలపాటు హోరాహోరీగా సాగిన ఈ పోరులో సిన్నర్ తొలి రెండు సెట్లలో ఓడి అద్భుతంగా పుంజుకున్నాడు.

మెద్వెదేవ్ అసాధారణ ప్రదర్శనతో 6-3, 6-3 రెండు సెట్లు గెలిచి సిన్నర్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. కీలక మూడో సెట్‌లో మెద్వెదేవ్ 4-5తో గెలిచేలా కనిపించాడు. కానీ సిన్నర్ అసాధారణ ప్రదర్శనతో వరుసగా రెండు పాయింట్స్ సాధించి 6-4తో తొలి సెట్‌ను సొంతం చేసుకున్నాడు.

ఆ తర్వాత పూర్తి ఆధిపత్యం చెలాయించిన సిన్నర్.. మెద్వెదెవ్ తప్పిదాలను క్యాష్ చేసుకుంటూ వరుసగా మూడు సెట్లను సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో సిన్నర్ 14 ఏస్‌లు కొట్టగా.. మెద్వెదేవ్ 11 ఎస్‌లు మాత్రమే కొట్టాడు. సిన్నర్ 5, మెద్వదేవ్ 3 డబుల్ ఫాల్ట్స్ చేశారు.

సెమీఫైనల్లో సిన్నర్ టాప్ సీడ్ జకోవిచ్‌ను మట్టి కరిపించాడు. రెండున్నర గంటల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జకోవిచ్ 1-6, 2-6, 7-6(8/6), 3-6 తేడాతో సిన్నర్ చేతిలో చిత్తయ్యాడు.

Story first published: Sunday, January 28, 2024, 19:37 [IST]
Other articles published on Jan 28, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+