Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Australia Open 2024: పోరాడి గెలిచిన మెద్వెదెవ్..!

ఆస్ట్రేలియా ఓపెన్ 2024 ఫైనల్‌కు రష్యా టెన్నిస్ స్టార్ డానియల్ మెద్వెదెవ్ అర్హత సాధించాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో సెమీ ఫైనల్లో మూడో సీడ్ మెద్వెదెవ్ 5-7, 3-6, 7-6(7/4), 7-6(7-5), 6-3 తేడాతో ఆరోసీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్(జర్మనీ)పై విజయం సాధించాడు.

4 గంటల 18 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో మెద్వెదేవ్ తొలి రెండు సెట్లు కోల్పోయినా గొప్పగా పోరాడాడు. రెండు సెట్లను టై బ్రేకర్‌లో దక్కించుకున్నాడు. నిర్ణయాత్మక ఐదో సెట్లోనూ జ్వెరెవ్ సర్వీస్ బ్రేక్ చేసిన మెద్వెదెవ్.. అదే ఊపులో సెట్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో మెద్వెదెవ్ 14 ఎస్‌లతో పాటు 52 విన్నర్లు కొట్టాడు. ఆదివారం జరిగే ఫైనల్లో మూడో సీడ్ మెద్వెదెవ్, యానిక్ సినెర్ తలపడనున్నారు.

Australia Open 2024: Daniil Medvedev stuns Alexander Zverev in five-set

తొలి సెమీఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ నొవాక్ జకోవిచ్‌ను యానిక్ సినెల్ మట్టికరిపించిన విషయం తెలిసిందే. మూడు గంటల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో టాప్ సీడ్ జకోవిచ్ 1-6, 2-6, 7-6(8/6), 3-6 తేడాతో ఇటాలియన్ ప్లేయర్ జాన్నిక్ సిన్నర్ చేతిలో చిత్తయ్యాడు.

బోపన్న ఫైనల్ నేడే..
43 ఏళ్ల లేటు వయసులో అదరగొడుతున్న భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న డబుల్స్ టైటిల్ పోరుకు సిద్దమయ్యాడు. శనివారం మధ్యాహ్నం 3.15 తర్వాత మొదలయ్యే ఫైనల్లో బోపన్న-మాథ్యూ ఎబ్డెన్(ఆస్ట్రేలియా) ద్వయం.. సిమోన్-వావాసోరి(ఇటలీ) జోడీతో తలపడనుంది. గతేడాది ఆస్ట్రేలియా ఓపెన్‌లో సానియా మీర్జాతో కలిసి మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్ చేరిన బోపన్నకు తుది పోరులో నిరాశ ఎదురైంది.

అదే సీజన్‌లో ఎబ్డెన్ జతగా.. వింబుల్డన్, యూఎస్ ఓపెన్‌లో టైటిల్ పోరుకు చేరినా విజయం దక్కలేదు. ఈ క్రమంలోనే ఈ సారి టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించాలని బోపన్న భావించాడు. అతను చివరిగా 2017(మిక్స్‌డ్)లో గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గాడు.

మహిళల సింగిల్స్ ఫైనల్ నేడే..
ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్ నేడే జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ సబలెంక(బెలారస్)‌.. చైనా అమ్మాయి జెంగ్ కిన్వెన్ టైటిల్ ఫైట్‌లో పాల్గొననుంది. సెరెనా తర్వాత వరుసగా రెండోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్ చేరిన ప్లేయర్‌గా సబలెంక నిలిచింది.

Story first published: Saturday, January 27, 2024, 7:16 [IST]
Other articles published on Jan 27, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+