Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Australia Open 2023 క్వీన్ అరినా సబలెంక..!

Australia Open 2023: Aryna Sabalenka Wins Maiden Single Grand Slam after Beats Elena Rybakina

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ 2023 మహిళల సింగిల్స్ టైటిల్‌ను బెలారస్ టెన్నిస్ స్టార్, వరల్డ్ నెంబర్ రెండో ర్యాంకర్ అరినా సబలెంకా సొంతం చేసుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో సబలెంకా 4-6, 6-3,6-4 తేడాతో రిబాకినాను ఓడించింది. తొలిసారి ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్ చేసిన సబలెంకా.. కెరీర్‌లో ఇదే తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను అందుకుంది.

రెండు గంటల 28 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్ లో మూడు సెట్‌లు జరుగగా.. తొలి సెట్‌ను 4-6 తేడాతో కోల్పోయిన సబలెంక.. తర్వాత పుంజుకుని జయభేరి మోగించింది. రెండో సెట్‌లో సబలెంకా బలమైన సర్వీస్ షాట్లతో పాటు ఫోర్ హ్యాండ్, బ్యాక్ హ్యాండ్ షాట్లతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసింది. 6-3 తేడాతో రెండో సెట్‌ను గెలుచుకున్న సబలెంక.. కీలకమైన మూడో సెట్‌లోనూ రిబికానాను ఉక్కిరిబిక్కిరి చేసింది ఆరంభం నుంచి ఆధిపత్యం చెలాయిస్తూ 6-4తో సెట్‌ను సొంతం చేసుకొని విజేతగా నిలిచింది.

కెరీర్‌లో తొలి గ్రాండ్ స్లామ్ గెలిచిన తర్వాత సబలెంక సంతోషాన్ని తట్టుకోలేకపోయింది. టెన్నిస్ కోర్టులోనే పడుకొని వినూత్న రీతిలో సంబరాలు చేసుకోవడంతో పాటు భావోద్వేగానికి గురైంది. తన కోచింగ్ సిబ్బంది, కుటుంబ సభ్యులు కూడా సబలెంక సెలెబ్రేషన్స్‌లో పాలుపంచుకున్నారు.
సబలెంక తనివితీరా ఏడ్చి.. అనంతరం ప్రత్యర్థిని కౌగిలించుకుంది.

ఇక ఈ టోర్నీలో సంచలన విజయాలతో ఫైనల్ చేరిన కజకిస్తాన్ అమ్మాయి రిబాకినా.. ఈ క్రమంలో ప్రపంచ నెంబర్ వన్ టెన్నిస్ క్రీడాకారిణి ఇగా స్వియాటెక్ ను క్వార్టర్స్ లో ఓడించిన విషయం తెలిసిందే. అయితే ఆమె ఫైనల్ లో మాత్రం సబలెంకకు తలవంచక తప్పలేదు. మహిళల సింగిల్స్ కూడా ముగియడంతో ఇక రేపు (ఆదివారం) పురుషుల ఫైనల్స్ జరుగనుంది. సెర్బియా స్టార్ నొవాక్ జకొవిచ్.. గ్రీస్ కుర్రాడు సిట్సిపాస్ మధ్య రేపటి తుది పోరు జరుగనుంది.

Story first published: Saturday, January 28, 2023, 18:32 [IST]
Other articles published on Jan 28, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+