Australia Open 2022: క్వార్టర్స్‌లో సానియా జోడీ! జ్వెరవ్‌కు షాక్.. నాదల్ దూకుడు!

మెల్‌బోర్న్: సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఇండియా లెజెండ్ సానియా మీర్జా సత్తా చాటుతోంది. అమెరికన్ రాజీవ్ రామ్‌తో కలిసి మిక్స్‌డ్ డబుల్స్‌లో బరిలోకి దిగిన హైదరాబాద్ స్టార్.. క్వార్టర్ ఫైనల్ చేరుకుంది. ఆదివారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో అన్‌సీడెడ్ సానియా-రాజీవ్ ద్వయం 7-6 (8/6), 6-4తో ఎలెన్ పెరెజ్-మిడిల్‌కూప్ (నెదర్లాండ్స్) జోడీపై గెలిచింది. 87 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా-రాజీవ్ రామ్ ద్వయం ఐదు ఏస్‌లు సంధించి తమ ప్రత్యర్థి జోడీ సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది.
మరోవైపు పురుషుల సింగిల్స్‌లో టాప్ ప్లేయర్ రఫెల్ నాదల్ 14వసారి క్వార్టర్స్ చేరగా.. టైటిల్ ఫేవరేట్లలో ఒకడైన అలెగ్జాండర్ జ్వెరెవ్ ఇంటిదారిపట్టాడు. ఇక మహిళల సింగిల్స్ విభాగంలో రెండు సంచలన ఫలితాలు నమోదయ్యాయి. ఐదో సీడ్ మరియా సాకరి (గ్రీస్), ఎనిమిదో సీడ్ పౌలా బదోసా (స్పెయిన్) ప్రిక్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించారు.

నాదల్ దూకుడు..
ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ నాదల్ 7-6 (16/14), 6-2, 6-2తో అడ్రియన్ మనారినో (ఫ్రాన్స్)పై గెలుపొందాడు. 2007 నుంచి ఈ టోర్నీలో బరిలోకి దిగిన ప్రతిసారీ నాదల్ కనీసం క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. 2013లో ఈ టోర్నీకి దూరంగా ఉన్న నాదల్ 2016లో మాత్రం తొలి రౌండ్‌లో ఓడిపోయాడు. మనారినోతో 2 గంటల 40 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో నాదల్‌కు తొలి సెట్‌లో తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. 81 నిమిషాలపాటు సాగిన తొలి సెట్‌లో నాదల్ నాలుగుసార్లు సెట్ పాయింట్లను కాపాడుకున్నాడు.

జ్వెరవ్‌కు షాక్..
కెనడాకు చెందిన 14వ సీడ్ డెనిస్ షపోవలోవ్ 2 గంటల 21 నిమిషాల్లో 6-3, 7-6 (7/5), 6-3తో జ్వెరెవ్‌ను బోల్తా కొట్టించి క్వార్టర్ ఫైనల్లో నాదల్‌తో పోరుకు సిద్ధమయ్యాడు. ఐదోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడుతున్న షపోవలోవ్ తొలిసారి క్వార్టర్ ఫైనల్ బెర్త్ సంపాదించాడు. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ఏడో సీడ్ బెరెటిని (ఇటలీ) 7-5, 7-6 (7/4), 6-4తో 19వ సీడ్ కరెనో బుస్టా (స్పెయిన్)పై, 17వ సీడ్ గేల్ మోన్‌ఫిల్స్ (ఫ్రాన్స్) 7-5, 7-6 (7/4), 6-3తో కెచ్‌మనోవిచ్ (సెర్బియా)పై గెలిచారు.

సాకారి, బదోసా ఔట్
మాడిసన్ కీస్ (అమెరికా) 6-3, 6-1తో బదోసాను ఓడించగా... 21వ సీడ్ జెస్సికా పెగూలా (అమెరికా) 7-6 (7/0), 6-3తో సాకరిపై గెలిచింది. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా) 6-4, 6-3తో అమండా అనిసిమోవా (అమెరికా)పై, నాలుగో సీడ్ క్రిచికోవా (చెక్ రిపబ్లిక్) 6-2, 6-2తో మాజీ నంబర్‌వన్ అజరెంకా (బెలారస్)పై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications