న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Australia Open 2022: చరిత్ర సృష్టించిన యాష్లే బార్టీ.. 44 ఏళ్ల రికార్డు బ్రేక్!

 Ash Barty beats Danielle Collins to win maiden Australian Open title

మెల్‌బోర్న్: సీజన్ ఫస్ట్ గ్రాండ్ స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను ఆస్ట్రేలియాకే చెందిన స్టార్ ప్లేయర్ యాష్లే బార్టీ సొంతం చేసుకుంది. శనివారం ఏకపక్షంగా జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ యాష్లే బార్టీ 6-3, 7-6 తేడాతో అమెరికా అమ్మాయి, 27వ సీడ్‌ డానియల్ కొలిన్స్‌‌ను చిత్తు చేసింది. తద్వారా 44 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ గెలిచిన ఆస్ట్రేలియా ప్లేయర్‌గా యాష్లె బార్టీ గుర్తింపు పొందింది. 1978లో క్రిస్టీన్ ఓనెల్ తొలి ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ గెలవగా.. ఇప్పుడు యాష్లే బార్టీ ఆ ఘనతను అందుకుంది.

సెమీఫైనల్లో 6-1, 6-3 తేడాతో అన్‌సీడెడ్‌ మ్యాడిసన్‌ కీస్‌ (అమెరికా)ను చిత్తు చేసిన యాష్లే బార్టీ.. 42 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్ చేరిన తొలి ఆసీస్ మహిళల సింగిల్స్ ప్లేయర్‌గా గుర్తింపుపొందిన బార్టీ.. టైటిల్ కూడా సొంతం చేసుకుంది. బార్టీ కన్నా ముందు 1980లో వెండీ టర్న్‌బుల్ ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్ చేరింది.

ఇక ఫైనల్లో తొలి సెట్‌ను 6-3తో సొంతం చేసుకున్న బార్టీ.. రెండో సెట్‌లో కొలిన్స్‌ నుంచి గట్టిపోటీ ఎదురైంది. 1-5తో వెనుకంజలో నిలిచిన బార్టీ అద్భుతంగా పుంజుకొని 6-6తో సమం చేయడంతో టై బ్రేక్‌కు దారి తీసింది. అయితే సెట్‌ చివరి గేమ్‌లో ఫుంజుకున్న బార్టీ మొత్తంగా 7-6(7-2)తో రెండోసెట్‌ను కైవసం చేసుకొని చరిత్ర సృష్టించింది. మ్యాచ్‌లో బార్టీ 10 ఏస్‌లు సందించి.. మూడు డబుల్‌ ఫాల్ట్‌లు నమోదు చేయగా.. కొలిన్స్‌ ఒక ఏస్‌ సందించి.. రెండు డబుల్‌ఫాల్ట్‌లు చేసింది

కెరీర్‌లో బార్టీకి ఇది మూడో గ్రాండ్ స్లామ్ టైటిల్ కాగా.. రెండేళ్ల క్రితం ఫ్రెంచ్ ఓపెన్, గతేడాది వింబుల్డన్ టైటిల్‌ గెలుచుకుంది. మూడు టైటిళ్లు గెలిచి.. సెరెనా విలియమ్స్ సరసన నిలిచింది.

Story first published: Saturday, January 29, 2022, 17:00 [IST]
Other articles published on Jan 29, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X