న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఏడు నెలల తర్వాత బరిలోకి.. తొలి మ్యాచ్‌లో ఓటమి

Andy Murray loses first singles game since hip surgery, confirms he wont play singles at US Open

సిన్సినాటి: ఏడు నెలల తర్వాత మైదానంలోకి దిగిన బ్రిటన్‌ టెన్నిస్‌ స్టార్ ఆండీ ముర్రే తొలి మ్యాచ్‌తో పునరాగమనం ఘనంగా చాటుదామని ఆశించి బంగపడ్డాడు. సిన్సినాటి ఓపెన్‌ మాస్టర్స్‌-1000 టోర్నీలో ముర్రే తొలి రౌండ్‌లోనే నిష్క్రమించాడు. ఫ్రాన్స్‌ ఆటగాడు రిచర్డ్‌ గాస్కేతో జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌ మ్యాచ్‌లో ముర్రే 4-6, 4-6 తేడాతో ఓటమిపాలయ్యాడు. జనవరిలో శస్త్ర చికిత్స చేయించుకున్న తర్వాత ముర్రే ఆడిన తొలి మ్యాచ్ కావడంతో తీవ్ర నిరాశ చెందాడు.

'బాహుబలి'కి ప్రత్యేక శిక్షకుడు.. పూర్తి ఫిట్‌నెస్‌పై దృష్ఠి

శస్త్ర చికిత్స అనంతరం ఏడు నెలల పాటు ముర్రే ఆటకు దూరంగా ఉన్నాడు. గాయం కారణంగా ఒకానొక సమయంలో కెరీర్‌కు వీడ్కోలు పలకాలని భావించాడు. అయితే గాయం నుంచి పూర్తిగా కోలుకోవడంతో జూన్‌లో మళ్లీ రాకెట్ పట్టాడు. అనంతరం ముర్రే డబుల్స్‌ విభాగంలో ఐదు టోర్నీల్లో కూడా ఆడాడు. అయితే అనూహ్యంగా సిన్సినాటి ఓపెన్‌లో తొలి రౌండ్‌లో ఓడిపోయాడు. ఇక వచ్చే నెలలో జరిగే గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌ యూఎస్‌ ఓపెన్‌ సింగిల్స్‌ విభాగంలో పోటీపడటం లేదని ముర్రే స్పష్టం చేశాడు.

తొలి సెంచరీని ఆగస్టు 14నే.. సచిన్‌కు ఈ రోజు ఎంతో ప్రత్యేకం

'ఈ రోజు వైల్డ్ కార్డ్ తీసుకోవటానికి ఇష్టపడలేదు, ఎందుకంటే ఒక మ్యాచ్ తర్వాత నేను ఎలా ఉండబోతున్నానో నాకు తెలియదు. నేను రెండు మ్యాచులను ప్రయత్నించాలని కోరుకున్నాను. రిచర్డ్ మంచి ఆటగాడు. అతను ఈ మ్యాచ్ చాలా బాగా ఆడాడు. ఓడిపోయినప్పటికీ బాధపడటం లేదు' అని ముర్రే తెలిపాడు. మహిళల సింగిల్స్‌ విభాగంలో మాజీ నంబర్‌వన్‌ క్రీడాకారిణులు షరపోవా (రష్యా), వీనస్‌ విలియమ్స్‌ (అమెరికా) శుభారంభం చేశారు. తొలి రౌండ్‌లో షరపోవా 6-3, 7-6 (7/4)తో అలీసన్‌ రిస్కీ (అమెరికా)పై, వీనస్‌ 7-5, 6-2తో లారెన్‌ డేవిస్‌ (అమెరికా)పై గెలుపొందారు.

Story first published: Wednesday, August 14, 2019, 16:47 [IST]
Other articles published on Aug 14, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X