'నీలా 150 మిలియన్ డాలర్ల సంపాదన ఉంటే.. టోర్నీని మేము వదిలేవాళ్లం'

అమెరికా: నంబర్ వన్ టెన్నిస్ ఆటగాడు, సెర్బియా స్టార్ నోవాక్ జకోవిచ్ యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీకి దూరంగా ఉండాలనుకుంటున్నట్లు తాజాగా ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంకేతాలిచ్చాడు. న్యూయార్క్‌లో కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో.. ఒకవేళ టోర్నీ ప్రేక్షకులు లేకుండా జరిగినా కూడా సెర్బియా స్టార్ పాల్గొనకూడదనుకుంటున్నాడు. ఫ్రెంచ్ ఓపెన్‌కు సిద్ధమవుతున్నానని, యూఎస్ ఓపెన్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు కూడా జాకో స్పష్టం చేసాడు.

150 మిలియన్ డాలర్ల సంపాదన ఉంటే:
యూఎస్ ఓపెన్‌కు అందుబాటులో ఉండకపోవచ్చని సంకేతాలిచ్చిన నోవాక్ జొకోవిచ్‌పై అమెరికా మహిళా టెన్నిస్ క్రీడాకారిణి డానియెల్ కొలిన్స్ ఆగ్రహం వ్యక్తం చేసారు. జొకోవిచ్‌లా 150 మిలియన్ డాలర్ల సంపాదన ఉంటే.. తాము కూడా యూఎస్ ఓపెన్‌ను వదిలేసే వాళ్లమని కొలిన్స్ ఎద్దేవా చేశారు. గత ఫ్రిబ్రవరి నుంచి ఎటువంటి టెన్నిస్ ఈవెంట్లు లేకపోవడంతో.. లోయర్ ర్యాంక్ ఆటగాళ్ల పరిస్థితి దయనీయంగా మారిందని గుర్తుచేశారు. లోయర్ ర్యాంకు ఆటగాళ్లను దృష్టిలో పెట్టుకుని స్టార్ ఆటగాళ్లు ఆడితే బాగుంటుందన్నారు.

స్టార్ ఆటగాళ్ల సహకారం అవసరం:
'జొకోవిచ్ తాజా వ్యాఖ్యలను బట్టి చూస్తే లోయర్ ర్యాంక్ ఆటగాళ్లకు సాయం చేసేవిగా లేవు. యూఎస్ ఓపెన్‌ను అత్యంత రక్షణాత్మక పద్ధతిలో నిర్వహించేటప్పుడు జొకోవిచ్ ఇలా వైదొలగుతాననే సంకేతాలు ఇవ్వడం సరైంది కాదు. ఏదైనా ఒక టోర్నీని సేఫ్ జోన్‌లో నిర్వహించడానికి సిద్ధమైనప్పుడు అందుకు స్టార్ ఆటగాళ్ల సహకారం ఎంతో అవసరం. ఏ టెన్నిస్ ఆటగాడైనా తన మొత్తం కెరీర్‌లో 150 మిలియన్ డాలర్లు సంపాదిస్తే.. దానితో ఏమి చేయాలో చెప్పాలి. అంతేకానీ అందుకు బదులుగా యూఎస్ ఓపెన్‌ను వదిలేయమనే సంకేతాలిస్తాడా?' అని డానియెల్ కొలిన్స్ ప్రశ్నించారు.

యూఎస్ ఓపెన్ ఒక వరం:
'ఆర్థికంగా స్థిరపడడానికి మాలాంటి టెన్నిస్ ఆటగాళ్లకు యూఎస్ ఓపెన్ ఒక వరం. అయితే ఇష్టం లేని ఆటగాళ్లను బలవంతంగా ఒప్పించి తీసుకురావడం కష్టం. ఇంకా చాలా మంది అగ్రశ్రేణి ఆటగాళ్లు యూఎస్ ఓపెన్‌లో ఆడటానికి సుముఖంగా ఉన్నారు. ఒక్క జొకోవిచ్ ఆడనంత మాత్రం పెద్దగా వచ్చిన నష్టం ఏమీ ఉండడు' అని కొలిన్స్ కౌంటర్ ఇచ్చారు. వైరస్ కారణంగా అమెరికాలో నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో జొకోవిచ్ యూఎస్ ఓపెన్ టోర్నీ నుంచి తప్పుకోవాలనే ఆలోచనలో ఉన్నాడు. దానికంటే ఫ్రెంచ్ ఓపెన్‌లో పాల్గొనడమే మంచిదని భావిస్తున్నాడు.

ఫ్రెంచ్ ఓపెన్ సెప్టెంబర్‌కు వాయిదా:
జూన్‌లో జరగాల్సిన ఫ్రెంచ్ ఓపెన్ కరోనా కారణంగా సెప్టెంబర్‌కు వాయిదా పడింది. ఇక షెడ్యూల్ ప్రకారం యూఎస్ ఓపెన్ ఆగస్టు 31 నుంచి న్యూయార్క్‌లో జరగాల్సి ఉంది. అయితే అమెరికాలో కరోనా కేసులు ఎక్కువగా ఉండటం, క్వారంటైన్ నిబంధనలను కచ్చితంగా పాటించాల్సి ఉండటంతో యూఎస్ ఓపెన్ కంటే ఫ్రెంచ్ ఓపెన్ నయమని జొకోవిచ్ పేర్కొనడం విమర్శలకు దారి తీసింది. లాక్‌డౌన్ కారణంగా రెండు నెలలు స్పెయిన్‌లో చిక్కుకుపోయిన జాకో.. ఇటీవలే స్వదేశం సెర్బీయాకు చేరుకున్నాడు.
'ఐపీఎల్ 2020పై రాజీపడొద్దు.. ఫార్మాట్‌లో ఎలాంటి మార్పులొద్దు'
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications