క్లియ్‌స్టర్స్ వయసు 36: 7 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ కోర్టులోకి!

హైదరాబాద్: మాజీ వరల్డ్ నంబర్ వన్, నాలుగు మేజర్ ఛాంపియన్ టైటిళ్లు నెగ్గిన కిమ్ క్లియ్‌స్టర్స్ మళ్లీ 36 ఏళ్ల వయసులో కోర్టులో అడుగుపెట్టనుంది. 2007లో తొలిసారి టెన్నిస్‌కు రిటైర్మైంట్ ప్రకటించిన క్లియ్‌స్టర్... రెండేళ్ల పాటు తర్వాత మళ్లీ టెన్నిస్ ఆడింది. అయితే, 2012లో రెండోసారి టెన్నిస్‌కు వీడ్కోలు పలికింది.
దీంతో ఏడేళ్ల తర్వాత మళ్లీ రాకెట్ పట్టేందుకు క్లియ్‌స్టర్ సిద్ధమైంది. 2020లో ప్రో టూర్‌లో భాగంగా కోర్టులో అడుగుపెట్టనున్నట్లు పేర్కొంది. ఎప్పుడు, ఎక్కడ ఎలా బరిలోకి దిగుతాననే విషయాన్ని మాత్రం ఇప్పుడే చెప్పలేనని పేర్కొంది. అంతర్జాతీయ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో మెంబర్ అయిన క్లియ్‌స్టర్స్ ముగ్గురు పిల్లలకు తల్లి.

ట్విట్టర్‌లో వీడియోని పోస్టు చేసిన క్లియ్‌స్టర్స్
గురువారం తన ట్విట్టర్‌లో క్లియ్‌స్టర్స్ ఓ వీడియోని పోస్టు చేస్తూ "ఏడేళ్లుగా పూర్తి సమయం అమ్మగా బాధ్యతలు నిర్వర్తించా. దాంతో పాటు టెన్నిస్ క్రీడాకారిణిగా కూడా ఉండడం నాకెంతో ఇష్టం. 2020లో మిమ్మల్ని కోర్టులో కలవబోతున్నా" అనే కామెంట్‌ను పోస్టు చేసింది. 1997లో ప్రోపెషనల్ టెన్నిస్ ప్లేయర్‌గా మారిన క్లియ్‌స్టర్స్ తొలిసారి 2005లో యుఎస్ ఓపెన్ టైటిల్ విజేతగా నిలిచింది.

23 ఏళ్ల వయసులోనే తొలిసారి
అమెరికన్ బాస్కెట్ బాల్ ప్లేయర్ బ్రియాన్ లించ్‌ను పెళ్లాడిన తర్వాత 23 ఏళ్ల వయసులో 2007లో తొలిసారి టెన్నిస్‌కు వీడ్కోలు పలికింది. రెండేళ్లు విరామంలో ఓ బిడ్డకు జన్మనిచ్చిన క్లియ్‌స్టర్స్ తిరిగి రాకెట్ పట్టింది. 2009లో మళ్లీ రెండోసారి యుఎస్ ఓపెన్ టైటిల్‌ను నెగ్గింది. తల్లైన తర్వాత క్లియ్‌స్టర్స్ నెగ్గిన తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్.
పెను ప్రమాదం తప్పింది: బంతి తాకి మైదానంలోనే కుప్పకూలిన ఆండ్రీ రసెల్

ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత
ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత గ్రాండ్ స్లామ్ టైటిల్ నెగ్గిన రెండో మహిళా టెన్నిస్ ప్లేయర్‌గా క్లియ్‌స్టర్స్ అరుదైన ఘనత సాధించింది. అంతకముందు 1980లో ఎవోన్నే గూలాగోంగ్ తొలిసారి వింబుల్డన్ టైటిల్ నెగ్గింది. మొత్తంగా క్లియ్‌స్టర్స్ మూడు సార్లు యుఎస్ ఓపెన్ టైటిల్ విజేతగా నిలవగా... ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఒకసారి విజేతగా నిలిచింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications