’600 మంది మగాళ్లు నన్ను రౌండప్ చేసి, దారుణంగా... ఆ మెగా హీరో లేకుంటే’

By Siva Kodati

నటీనటులను అభిమానులు ఎంతగానో ప్రేమిస్తారన్న సంగతి తెలిసిందే. అయితే వీరి అభిమానం కొన్నిసార్లు ఓవరాక్షన్‌గా మారుతూ స్టార్స్‌ను ఇబ్బంది పెడుతోంది. ఇటీవల ది రాజాసాబ్ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌లోని ఓ మాల్‌లో జరిగిన ఈవెంట్‌లో ఈ చిత్ర హీరోయిన్ నిధి అగర్వాల్ పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ముగించుకుని వెళ్తున్న ఆమెను అభిమానులు రౌండప్ చేశారు. అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు ఆమె ప్రైవేట్ భాగాలను తాకడంతో నిధి అగర్వాల్ ఇబ్బందిపడ్డారు. భద్రతా సిబ్బంది అతి కష్టం మీద నిధి అగర్వాల్‌ను బయటకు తీసుకెళ్లగలిగారు.

Funky Twitter Review: ఫంకీ మూవీ ట్విట్టర్ రివ్యూ

నిధి అగర్వాల్‌కు జరిగిన ఘటనలు ఇండస్ట్రీలో కొత్త కాదు. గతంలో ఎంతోమంది హీరోయిన్లు ఇలాగే ఇబ్బందిపడ్డారు. ఫ్యాన్స్ ఓవరాక్షన్ కారణంగా స్టార్స్ బహిరంగ వేదికల మీదకు రావడానికే భయపడిపోతున్నారు. హీరోయిన్లే కాదు.. హీరోల పరిస్ధితి కూడా ఇలాగే తయారైంది. ఇలాంటి ఈవెంట్స్‌కు హాజరై అభిమానుల చేతిలో దోపిడీకి గురైన హీరోలు కూడా ఉన్నారు. తాజాగా ఇలాంటి ఘటన కారణంగా తాను ఎంతో ఇబ్బందిపడ్డానని.. ఓ హీరో కారణంగా సురక్షితంగా భయపడినట్లు నటి, యాంకర్ స్రవంతి చొక్కారపు బయటపెట్టారు. ఈ వివరాల్లోకి వెళితే..


Sravanthi Chokarapu revealed how Sai Dharam Tej protected her during Fan Misbehavior

సాధారణ యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన స్రవంతి చొక్కారపు సెలబ్రిటీగా మారారు. సినిమా ఈవెంట్స్, ఇంటర్వ్యూలు, ప్రైవేట్ కార్యక్రమాలకు హోస్ట్‌గా చేస్తూ స్టార్ యాంకర్ అనిపించుకున్నారు. ఇప్పుడు నటిగానూ స్రవంతి కొత్త అవతారమెత్తారు. హే భగవాన్ మూవీలో ఆమె నటిస్తున్నారు. త్రిశూల్ విజనరీ స్టూడియోస్ బ్యానర్‌పై బీ నరేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా గోపీ అచ్చర దర్శకత్వం వహించారు.

Kalki 2 Overseas Business: ఓవర్సీస్‌లో ప్రభాస్ సంచలనం.. కల్కి 2కి రికార్డ్ బిజినెస్.. ఎన్ని కోట్లంటే?

సుహాస్, శివానీ నాగారం హీరో హీరోయిన్లుగా నటించారు. వీకే నరేష్, సుదర్శన్, స్రవంతి చొక్కారపు తదితరులు కీలకపాత్రలు పోషించారు. మహిరెడ్డి పాండుగుల సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించగా.. వివేక్ సాగర్ సంగీతం, విప్లవ్ నైషదం ఎడిటింగ్ అందించారు. ఫిబ్రవరి 20వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. హే భగవాన్ మూవీ ప్రమోషనల్ కార్యక్రమాల్లో యాంకర్ స్రవంతి చొక్కారపు, హీరోయిన్ శివానీ నాగారం ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

శ్రీముఖి కౌగిలిలో ఆ నటుడు... నీతో తనివి తీరదంటూ రాములమ్మ బోల్డ్ కామెంట్స్

ఈ సందర్భంగా క్రౌడ్‌లో తాను ఇబ్బందిపడినట్లు స్రవంతి తెలిపారు. విరూపక్ష ప్రమోషన్స్‌లో భాగంగా నేను, సాయిథరమ్ తేజ్ గారు ఆంధ్రా సైడ్ ప్రమోషన్స్‌కి వెళ్లాం. ఏలూరు, విజయవాడలో ఈ కార్యక్రమాలు చేయాల్సి ఉంది. మేము వందే భారత్ రైలు ఎక్కాం.. అందులో నేనొక్కదానినే ఆడపిల్లని మిగతా అంతా అబ్బాయిలే. ఒక 500 నుంచి 600 మంది ఉన్నారు.. నేను కంప్లీట్ చుడీదార్‌లో ఉన్నా. బట్టలతో సంబంధం లేదు.. అంతా వచ్చి నా మీద పడిపోయారు. నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటా.. ఆ రోజు ఇంటికొచ్చాక కూడా ట్వీట్ చేశా. ఆ రోజు కనుక సాయిథరమ్ తేజ్ లేకుంటే.. ఆయన ఎంత ప్రొటెక్ట్ చేశారో, రైల్వే స్టేషన్ నుంచి బయటకు తీసుకొచ్చి కారు ఎక్కించే దాక అని స్రవంతి పేర్కొన్నారు.

ఆ యాంకర్‌ను నరికేస్తా... జబర్తస్త్ కమెడియన్ స్ట్రాంగ్ వార్నింగ్

అంటే ఆయన లాంటి స్టార్‌కు చేయాల్సిన అవసరం కూడా లేదు. చాలా బాగా ప్రొటెక్ట్ చేసి నన్ను కారెక్కించారు. అక్కడి నుంచి బయటకు రావడానికి అర్ధగంట పట్టింది.. సాయిగారు తన చేతులు అడ్డుపెట్టి తీసుకొచ్చారు. అంటే అలాంటి మగాళ్లు కూడా ఉంటారు. చుట్టుపక్కల వాళ్లు నా మీద పడిపోతుంటే ఆయన మాత్రం నన్ను రక్షించారని స్రవంతి చెప్పింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా... సాయిథరమ్ తేజ్ పెద్ద మనసుకు నెటిజన్లు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.

Credit: Filmibeat

Story first published: Friday, February 13, 2026, 10:07 [IST]
Other articles published on Feb 13, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+