Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పవన్ బిడ్డల జోలికొస్తే తాట తీస్తా.... రేణు దేశాయ్‌‌పై ట్రోలింగ్‌పై టాప్ ప్రొడ్యూసర్‌ వార్నింగ్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, సినీనటుడు పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ జంతు సంరక్షకురాలిగా, సామాజిక కార్యకర్తగా సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లుగా మూగజీవాల సంరక్షణ కోసం రేణు పాటుపడుతున్నారు. ఇటీవల వీధి కుక్కల నిర్మూలనకు సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ నేపథ్యంలో హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేణు దేశాయ్ ఆవేశపూరితంగా మాట్లాడారు. అయితే ఆ తర్వాతి నుంచి ఆమెపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. దీనిపై రేణు దేశాయ్ సీరియస్ అయినప్పటికీ విమర్శలు ఆగలేదు. తాజాగా ఈ నెగిటివ్ క్యాంపెయినింగ్‌పై ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టాలీవుడ్ నిర్మాత నట్టి కుమార్ స్పందించారు. ఈ వివరాల్లోకి వెళితే..

MSVPG AP Nizam 10 Days Box Office: శంకర వరప్రసాద్‌ కలెక్షన్ల సంచలనం.. నైజాం, ఆంధ్రాలో లాభం ఎంతంటే?

ఆడపిల్లపై అసభ్యంగా మాట్లాడొద్దు
ఈ విషయంలో రేణు దేశాయ్ గారికి ఫుల్ సపోర్ట్ చేస్తున్నా. ఆమె మాటల్లో ఆవేశం ఉంది, ఆవేదన ఉంది.. అర్ధం చేసుకోవాలి. ఆమె నోరు లేని జీవాల కోసం మాట్లాడారు, తన స్వార్ధం కోసం మాట్లాడలేదు. ఆమె మాట్లాడిన ప్రతి మాట కూడా చాలా వాల్యూబుల్. దానిని అర్థం చేసుకోలేక చాలా వెటకారంగా మాట్లాడారు. మనసున్న మనిషి ఎవరైనా ఉంటే.. మూగ జంతువుల్ని ప్రేమించే ప్రతి ఒక్కరూ ఆమె మాటకి సపోర్ట్ చేస్తారు. మూగజీవాల్ని చంపొద్దు, మూగజీవాల్లో ఒకటి తప్పు చేయొచ్చు.. అన్నీ తప్పు చేసినవి కావు, అలాంటివి ఏవైనా ఉంటే మా ఎన్జీవోకి అప్పగించండి.. మేం వాటిని కాపాడతాం. దాని వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పింది. ఆమె ఏం చేశారు? ఎంత పెట్టారని కొంతమంది అడుగుతున్నారు. ఆమె ఎంతమందికి అన్నం పెట్టింది.. ఎంతమందికి ఏం చేసింది అనేది ఆమె చెప్పుకుంటూ వచ్చింది. కొంతమంది మూర్ఖులు ఉన్నారు.. ఒక ఆడపిల్ల దొరికిందని ఇష్టమొచ్చినట్లు అసభ్యంగా మాట్లాడతారా అంటూ నట్టికుమార్ సీరియస్ అయ్యారు.


Natti Kumar Slams Online Trolls on Renu Desai and Extends Strong Support Over Street Dogs Issue

నోరున్న మనుషులే దారుణాలు చేస్తున్నారు
కుక్కలు చాలామందిని కరిచాయి.. వాటి వల్ల ఇబ్బందిపడుతున్నారు. నోరున్న మనుషులమే చేస్తున్నాం.. నోరున్న మనుషులు చిన్నపిల్లల్ని తీసుకెళ్లి రేప్ చేసేస్తున్నారు, ఒక అబ్బాయిని తీసుకెళ్లి నడిరోడ్డు మీద చంపేస్తున్నారు. ఇలాంటి వాటిని నోరున్న మనుషులు పట్టించుకోవడం లేదు. ఏ హానీ చేయని నోరులేని జీవాన్ని చంపుతున్నారే అన్నదే రేణు దేశాయ్ ఆవేదన. వాటికి కూడా కొన్ని గైడ్‌లైన్స్ ఉన్నాయి. వాటి ప్రకారమే ముందుకు వెళ్లాలని రేణు కోరారు. ఆమె మీద మీరు ఏం మాట్లాడుతున్నారు? ఆమె పిల్లల మీద మాట్లాడటానికి మీకేం రైట్ ఉంది? పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడటానికి మీకేం రైట్ ఉంది? ఒక ఆడపిల్ల మాట్లాడేటప్పుడు ఆమె అడిగిన వాటికి ఆన్సర్ ఇవ్వండి. అంతేకానీ ఒక ఆడబిడ్డను బాధ పెట్టొద్దు. బాధపెట్టిన వాడు ఎవరైనా ధైర్యం చేసి నా ముందుకు వస్తే తాట తీసి పంపిస్తాను ఒక్కొక్కడికి. పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు? ఆ పిల్లలు ఏం చేశారు? ఆమె మాట్లాడినది ఏంటీ? మీరేం మాట్లాడుతున్నారు? పిచ్చి పిచ్చిగా ఉందా? అని నట్టికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఓటీటీలో అఖండ 2కు షాకింగ్ రిజల్ట్... నెట్‌ఫ్లిక్స్‌లో బాలయ్య మూవీ హిట్టేనా?

దమ్ముంటే నా ముందుకు రండి
ఔనన్నా కాదన్నా అక్కడున్నది పవన్ కళ్యాణ్ కొడుకు.. పవన్ కళ్యాణ్ కూతురు అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వాళ్లు కొణిదెల ఫ్యామిలీకి సంబంధించిన వాళ్లు, ఆమె అడిగిన దానికి సమాధానం ఇవ్వండి తప్పించి అసభ్యకరమైన మాటలు మాట్లాడితే.. దమ్ముంటే నా ముందుకు రండి.. నిన్ను తాట తీసి పంపించికపోతే అప్పుడు అడుగు. మాట్లాడేవాళ్లు వారి వ్యక్తిగత విషయాల్లో చాలా కరెక్ట్‌గా ఉన్నారా? ఆమె వెనుక ఎవరు లేరు.. ఏం మాట్లాడినా చెల్లుతుంది.. ఏమైనా అంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానుల ఖాతాల్లో తోసేయొచ్చు అనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, సినీ అభిమానులు ఇలా మాట్లాడరు అని నట్టికుమార్ పేర్కొన్నారు.

రమ్య పికిల్‌తో రొమాంటిక్‌గా.. బిగ్‌బాస్ బ్యూటీకి లైన్ వేస్తూ భార్యకు దొరికిన యంగ్ హీరో

గంట టైం చాలు
రోడ్డు మీద పోయ వెధవలు మాట్లాడతారు. కొణిదెల ఫ్యామిలీలోని ఆడపిల్లల జోలికి వస్తే వదిలే ప్రసక్తి లేదు.. ఇదే ఫైనల్ వార్నింగ్. ఆడపిల్ల చేత కన్నీరు పెట్టించొద్దు.. ఆ కన్నీరు మీ కుటుంబాన్ని నాశనం చేసేస్తుంది. నాకు కుక్కలంటే ప్రేమ.. ఇంకొకరికి ఇష్టం ఉండకపోవచ్చు. జంతువుల నుంచి పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి. నోరులేని జీవాలు తప్పుచేస్తే ఆ తప్పుని ఎలా సరిదిద్దాలో చూద్దాం. కొణిదెల ఫ్యాన్స్ ఎప్పుడూ తప్పు చేయరు. ఎవరు అవునన్నా.. కాదన్నా రేణు దేశాయ్ గారి పిల్లలు కొణిదెల ఫ్యామిలీ. వాళ్ల గురించి ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారో తీసి పట్టుకోవడానికి గంట పట్టదు, ఒళ్లు దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది. కానీ వెతకడం మొదలుపెడితే వాళ్ల పరిస్ధితి చాలా ఇబ్బందికరంగా ఉంటుందని నట్టికుమార్ వార్నింగ్ ఇచ్చారు.

Credit: Filmibeat

Story first published: Thursday, January 22, 2026, 20:47 [IST]
Other articles published on Jan 22, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+