Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సంక్రాంతి వేళ నక్కతోక తొక్కిన ఏపీ ఎమ్మెల్యే!

సంక్రాంతి పండుగ అంటే ముందుగా అందరికీ గుర్తొచ్చేది ఏపీ.. ఏపీలో జరిగే కోడిపందేలు. ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతికి కోడి పందేలు స్పెషల్ ఎట్రాక్షన్. ప్రభుత్వం, పోలీసులు కోడి పందాలను కట్టడి చెయ్యాలని ఎంత ప్రయత్నం చేసినా సరే ఇదొక సాంప్రదాయ క్రీడలా సంక్రాంతికి కొనసాగుతుంది.

ఏపీలో ప్రజా ప్రతినిధుల సమక్షంలోనే కోడిపందాలు
సంక్రాంతి పండుగకు జరిగే కోడిపందాలలో వేల కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతుంటాయి. పురుషులతో పాటు మహిళలు కూడా ఈ కోడి పందాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. ఇక కోడి పందాలను చూడటం కోసం, తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున ప్రజలు వస్తుంటారు.ఇక ఈ ఏడాది కూడా హైటెక్ బరులు ఏర్పాటు చేసి కోడి పందాలను నిర్వహిస్తున్నారు . స్థానిక ప్రజా ప్రతినిధుల సమక్షంలో కోడి పందాలు జరుగుతున్నాయి.


Bapatla MLA seems to have had incredible luck won a huge prize in the cockfighting competition

కోడి పందాలలో ఖరీదైన బహుమతులు
ఈసారి కొన్ని ప్రాంతాల్లో కోడి పందాలను చాలా వినూత్నంగా నిర్వహిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపూడి మండలంలో టోర్నమెంట్ మాదిరిగా వీటిని ఏర్పాటు చేశారు. నిర్వాహకులు బెట్టింగ్‌లు లేకుండా, ఎవరైతే గెలుస్తారో ,ఆ విజేతలకు ఖరీదైన బహుమతులు అందిస్తున్నారు. మూడు రోజుల పందాల్లో, చివరి రోజు విజేతకు 'మహీంద్రా థార్', రెండో రోజు 'రాయల్ ఎన్‌ఫీల్డ్' బైక్ బహుమతిగా ఇస్తున్నారు.

బాపట్ల జిల్లాలో జోరుగా కోడి పందాలు
కోడి పందాలను బెట్టింగ్ లతో కాకుండా ఒక టోర్నమెంట్ లా నిర్వహించి, ఎవరూ ఆర్థికంగా నష్టపోకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్వాహకులు చెప్పారు. ఇదిలా ఉండగా, బాపట్ల జిల్లాలో కోడి పందాలు జోరుగా కొనసాగుతున్నాయి. భోగి రోజు ఒక్క రోజే బాపట్ల లో 70 కోట్ల రూపాయలు చేతులు మారినట్లు తెలుస్తోంది. చెరుకుపల్లి మండలంలో 30 ఎకరాల బరిలో రూ.30 కోట్ల కోడి పందాలు నమోదయ్యాయి.

బుల్లెట్ బైక్ గెలుచుకున్న బాపట్ల ఎమ్మెల్యే
పిట్టలవానిపాలెం మండలంలో రూ25 కోట్ల వరకు కోడి పందాలు జరిగాయి. చెరుకుపల్లి పందాలకు ఏపీ రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలంలో స్థానిక ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ కోడిపందాలలో విజేత అయ్యారు. ఆయన బుల్లెట్ బైక్‌ను బహుమతిగా గెలుచుకున్నారు. పదిసార్లు పందాలలో ఆయన వరుసగా 6 సార్లు విజయం సాధించి బుల్లెట్ బైక్ సొంతం చేసుకున్నారు.

సంక్రాంతికి ఏపీ నుండి తిరుగు ప్రయాణాలకు ఆర్టీసీ శుభవార్త!

నక్కతోక తొక్కిన ఎమ్మెల్యే
ఈ పందేలలో నరేంద్ర వర్మతో పాటు ఆయన కుమారుడు కూడా పాల్గొన్నారు. ఇదే బరిలో కర్లపాలెం వ్యక్తి మరో బుల్లెట్ గెలుచుకున్నారు. సంక్రాంతి నాడు బుల్లెట్ బండి గెలుచుకున్న ఎమ్మెల్యేను చూసి ఆయన నక్కతోక తొక్కి వచ్చారని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఇక రాష్ట్రంలో ముఖ్యంగాఉభయ గోదావరి జిల్లాలలో వంద కోట్లకు పైగా తొలినాడు కోడి పందాలు సాగాయని చెప్తున్నారు.

Credit: Oneindia

Story first published: Thursday, January 15, 2026, 11:48 [IST]
Other articles published on Jan 15, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+