Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోడిని నమ్ముకుని కోటీశ్వరుడైన రాజమండ్రి వాసి.. లక్కంటే ఇతనిదే!

సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోడిపందాల గురించి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, పక్క రాష్ట్రాలలో కూడా పెద్ద చర్చ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేలకోట్ల రూపాయలు సంక్రాంతి కోడిపందాలలో చేతులు మారుతుంది. ఈ కోడిపందాలను చూడడం కోసం వివిధ రాష్ట్రాల నుంచి ప్రజలు భారీసంఖ్యలో ఆంధ్రప్రదేశ్ కు చేరుకుంటారు. హైటెక్ మోడల్ లో భారీబరులు ఏర్పాటుచేసి మరీ అన్ని హంగులు, ఆర్భాటాలతో, సకల లగ్జరీ వసతులతో కోడిపందాలను నిర్వహిస్తారు.

జాక్ పాట్ కొట్టిన రాజమండ్రి వాసి
ఈసారి కూడా కోడిపందాలను నిర్వహించేవారు లక్షలలో కోట్లలో పెట్టుబడులు పెట్టి పందెం రాయుళ్లను ప్రోత్సహిస్తున్నారు. అయితే సంక్రాంతి సందర్భంగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, ఏలూరు, పోలవరం కృష్ణ కోనసీమ జిల్లాలలో భారీ బరుల ను ఏర్పాటు చేసి కోడిపందాలను నిర్వహిస్తున్నారు. ఇక సంక్రాంతి పండుగ రోజున ఓ బరిలో జరిగిన కోడిపందెంలో ఒక వ్యక్తి కోడిని నమ్ముకుని జాక్పాట్ కొట్టేసాడు.


A Rajahmundry man became a millionaire after winning big in cockfight betting during Sankranthi
Take a Poll

కోడిని నమ్ముకుని భారీ పందెం
పందెం గెలిచి కోటిన్నరకు పైగా తన సొంతం చేసుకున్నాడు. సంక్రాంతి సందర్భంగా తాడేపల్లిగూడెంలో జరిగిన కోడిపందాలలో పై పోయిన వెంకటరామయ్య బరిలో గుడివాడ ప్రభాకర్, రాజమండ్రి రమేష్ కోళ్ల మధ్య భారీ పందెం నడిచింది. తన కోడిని నమ్ముకున్న రాజమండ్రి రమేష్ ఏకంగా కోటి 53 లక్షల రూపాయల పందెం పెట్టాడు. ఈ జిల్లాలో పెట్టిన అతి పెద్ద పందెం ఇదే కాగా, రాజమండ్రి రమేష్ పందాన్ని గెలుచుకున్నాడు.

1.53 కోట్ల భారీ బహుమతి
తన డబ్బులతో పాటు మళ్ళీ 1.53 కోట్ల భారీ బహుమతిని పొందాడు. ఇక కోడిని నమ్ముకొని పందెం గెలిచిన రమేష్ గురించి స్థానికులు చర్చించుకుంటున్నారు. కోడిని నమ్ముకుని కోటీశ్వరుడు అయ్యాడని అందరూ అనుకుంటున్నారు. అదృష్టం కలిసి వస్తే ఇలాగే ఉంటుందని, ఒక్క అయిదు నిమిషాల్లోనే కోటీశ్వరులు కావచ్చని ఈ విషయం తెలిసిన వాళ్ళు చర్చిస్తున్నారు.

ఆయనది అదృష్టం కావచ్చు కానీ మీరు జాగ్రత్త
అయితే రాజమండ్రి రమేష్ పందెం గెలిచి కోటి 53 లక్షల రూపాయలు సొంతం చేసుకోగా, ఇందులో డబ్బులు పోగొట్టుకున్న గుడివాడ ప్రభాకర్ కు మాత్రం సంక్రాంతి పండుగ తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇక ఈ విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి అంటూ కోడిపందాలు వంటి జూదాన్ని నమ్ముకుని కష్టార్జితాన్ని పోగొట్టుకోవద్దు అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలి.

మహిళలకు త్వరలో రూ.2500, నిరుద్యోగులకు, పించన్ లబ్దిదారులకు పండుగ చేసుకునే వార్త!

సరదాగా ఆడే ఆట ఇబ్బందిగా ఉండకూడదు
అదృష్టం బాగుండి డబ్బు వస్తే పర్వాలేదు కానీ, పోతే దానిని తట్టుకుని నిలబడగలిగే దమ్ము, ధైర్యం కూడా ఉండాలి. ఇలాంటివి చూసి ఇటువంటి సాహసాలు ఎవరు చేయకుండా ఉంటేనే మంచిది. సరదాగా ఆడుకునే కోడిపందాలు, జీవితానికి సరదాను, సంతోషాలను ఇవ్వాలి కానీ దుఃఖాన్ని ఇవ్వకూడదు అనే విషయం అందరూ గుర్తించాలి.

Credit: Oneindia

Story first published: Friday, January 16, 2026, 11:00 [IST]
Other articles published on Jan 16, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+