తాపి మేస్త్రీ కూతురికి బంగారు పతకం.. అభినందించిన వైఎస్ జగన్
ఏషియన్ యూత్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకాలు సాధించిన భారత యువ వెయిట్‌లిఫ్టర్ రెడ్డి భవానికి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. కజకిస్థాన్ వేదికగా జరిగిన ఏషియన్ యూత్ ఛాంపియన్‌షిప్‌లో వెయిట్ లిఫ్ట్ విభాగంలో రెడ్డి భవాని సత్తా చాటింది. స్నాచ్ 69 కిలోలు, క్లీన్-జర్క్ 90 కిలోల విభాగాల్లో బంగారు పతకాలు కైవసం చేసుకుంది.
విజయనగరం జిల్లా, మండలం కొండకరకం గ్రామానికి చెందిన రెడ్డి భవాని అత్యంత నిరుపేద కుటుంబం నుంచి వచ్చి అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటింది. భవాని తండ్రి రెడ్డి ఆదినారయణ తాపీ మేస్త్రీ. ఆయనకు ముగ్గురు ఆడపిల్లలు కాగా.. మొదటి అమ్మాయి పెళ్లి కోసం ఉన్న ఇళ్లు కూడా అమ్మేసాడు. అయినా వెనకడుగు వేయకుండా రెండో కుమార్తె భవానికి వెయిట్ లిఫ్టింగ్‌లో ట్రైనింగ్ ఇప్పించారు. అందరి ప్రోత్సాహంతో రెడ్డి భవాని అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటింది.

ఈ విజయంపై హర్షం వ్యక్తం చేసిన వైఎస్ జగన్.. ఎక్స్ వేదికగా ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. 'ఏషియన్ యూత్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించిన విజయనగరం జిల్లాకు చెందిన రెడ్డి భవానికి హృదయపూర్వక అభినందనలు. మరిన్ని మైలురాళ్లు, చిరస్మరణీయ విజయాలు ఆమెకు దక్కాలని కోరుకుంటున్నా. భవాని, ఇలాగే విజయాలతో మెరుస్తూ ఉండాలి.'అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications