Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Year Ender 2024: ఈ ఏడాది నింగికెగిసిన క్రీడా దిగ్గజాలు!

ఫుట్‌బాల్ ప్రపంచకప్ విజేతలు ఫ్రాంజ్ బెకెన్‌బౌర్, మారియో జగాల్లో‌.. భారత క్రికెట్ గ్రేట్ వాల్ అన్షుమాన్ గైక్వాడ్‌‌తో పాటు ఇతర క్రీడా దిగ్గజాలు‌ ఈ ఏడాదే మరణించారు.‌ అసాధారణ ప్రదర్శనతో పాటు సంచలన విజయాలతో అభిమానుల మనసులను గెలుచుకున్న క్రీడా తారాలు ఈ ఏడాదే నేల రాలారు. తమదైన ఆటతో క్రీడా ప్రపంచంపై ముద్ర వేసిన దిగ్గజాలు శాశ్వత విశ్రాంతి తీసుకున్నారు. ఈ ఏడాది ముగుస్తున్న నేపథ్యంలో వారిని ఒకసారి స్మరించుకుందాం.!

1. ఫ్రాంజ్ బెకెన్‌బౌర్(ఫుట్‌బాల్)
ఫ్రాంజ్ బెకెన్ బౌర్ అకాల మరణం ఫుట్‌బాల్ ప్రపంచాన్ని విషాదంలో ముంచెత్తింది. మైదానంలో అసాధారణ ప్రదర్శనతో పాటు అతని నాయకత్వం ఫ్రాంజ్ బెకెన్ బౌర్‌‌ను ఓ ఐకాన్ ఆటగాడిగా నిలబెట్టాయి. ఆటగాడిగా.. కోచ్‌గా ఫిఫా ప్రపంచకప్‌ గెలిచిన ముగ్గురు వ్యక్తుల్లో ఫ్రాంజ్ బెకెన్‌బౌర్ ఒకరు. మైదానంలో అతను సాధించిన ఘనతలు అసాధారణమైనవి. 78 ఏళ్ల వయసులో ఫ్రాంజ్ బెకెన్‌బౌర్ తుది శ్వాస విడిచాడు. ఫ్రాంజ్ బెకెన్‌బౌర్ మరణానికి నివాళిగా ఆయన మాజీ ఫుట్‌బాల్ క్లబ్ బయెర్న్ ముంచి జెర్సీ నెంబర్ 5కి రిటైర్మెంట్ ప్రకటించింది.

Year Ender 2024 Iconic Sports Stars We Lost in this Year 2024

2. అన్షుమన్ గైక్వాడ్..
దిగ్గజ క్రికెటర్ అన్షుమాన్ గైక్వాడ్ మరణం ఈ ఏడాది భారత క్రికెట్‌లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. క్యాన్సర్‌తో సుదీర్ఘ పోరాటం చేసిన ఆయన 71 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. గైక్వాడ్ 40 టెస్ట్ మ్యాచ్‌లు మరియు 15 వన్డేలు ఆడారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2000లో రన్నరప్‌గా నిలిచిన భారత జట్టుకు కోచ్‌గా కూడా అన్షుమన్ గైక్వాడ్ పనిచేశారు. అటు ఆటగాడిగా.. ఇటు కోచ్‌గా గైక్వాడ్.. భారత క్రికెట్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించారు.

3.డెరెక్ అండర్‌వుడ్-మోస్ట్ డేంజరస్ ప్లేయర్
గ్రేట్ ఇంగ్లీష్ బౌలర్ డెరెక్ అండర్‌వుడ్ ఈ ఏడాదే తుది శ్వాస విడిచారు. డెడ్లీ స్పిన్ బౌలర్‌గా పేరొందిన అండర్‌వుడ్.. మూడు దశాబ్దాల కెరీర్‌లో మొత్తం 1087 మ్యాచ్‌లు ఆడి 3037 వికెట్లు పడగొట్టాడు. అతను 1966-1982 మధ్య ఇంగ్లండ్ తరపున 86 టెస్టులు, 26 వన్డేలు ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అండర్‌వుడ్.. 297 టెస్ట్ వికెట్లు, 32 వన్డే వికెట్లు ఉన్నాయి.

4. మారియో జాగల్లో(ఫుట్‌బాల్)
బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం మారియో జాగల్లో 92 ఏళ్ల వయసులో ఈ ఏడాదే తుది శ్వాస విడిచారు. జాగల్లో ఏకంగా నాలుగు సార్లు ఫిఫా ప్రపంచకప్ గెలిచారు. ఇందులో రెండు సార్లు ఆటగాడిగా.. మరో రెండు సార్లు కోచ్‌గా విశ్వ టైటిల్‌ను అందుకున్నాడు. ఆటగాడిగా.. కోచ్‌గా మారియో ఫుట్‌బాల్‌కు ఎంతో సేవ చేశారు.

Story first published: Monday, December 9, 2024, 21:02 [IST]
Other articles published on Dec 9, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+