Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐశ్వర్య రాయ్ ఫొటో షేర్ చేసిన డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ జాన్‌ సెనా

WWE superstar John Cena shares post featuring Aishwarya Rai Bachchan after actress is admitted to hospital

ముంబై: అందానికే అసూయ పుట్టించే అందం ఐశ్వర్య రాయ్‌ సొంతం. పెళ్లై, ఓ బిడ్డకు తల్లైన తర్వాత కూడా ఐష్‌ అందం ఇసుమంత కూడా తగ్గలేదనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అందానికి అర్థం చెప్పాలంటే ప‌దాలు వెతుక్కోకుండా ఐశ్వ‌ర్యారాయ్ అని చెబితే స‌రిపోతుంది. అందం.. ఐశ్వర్య రాయ్ ఒక్కటే.. ఇంకేం చెప్పగలం అంతకన్నా.. అనేంత‌గా ఇప్ప‌టికీ త‌న అందంతో అల‌రిస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. తన అభినయంతో కుర్రాళ్ల మదిని దోచుకున్న ఈ నీలికళ్ల విశ్వసుందరి కుటుంబం ఇప్పుడు కరోనా కోరల్లో చిక్కుకుంది.

బిగ్‌బీ ఫ్యామిలీకి కరోనా..

తన మామ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, భర్త అభిషేక్ బచ్చన్, కూతురు ఆరాధ్య(8)తో పాటు తాను మహమ్మారి బారిన పడి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆమె అభిమానులు చిన్న కలవరపాటుకు గురయ్యారు. తమ అందాల భామ ఐశ్వర్య, ఆమె కుటుంబం కరోనాను జయించాలని సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో డబ్ల్యూడబ్ల్యూఈ దిగ్గజం జాన్ సెనా ఐశ్వర్య ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేశాడు.

క్యాప్షన్ లేని ఫొటో..

క్యాప్షన్ లేని ఫొటో..

ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. జాన్ సెనా ఈ ఫొటోకు ఎలాంటి క్యాప్షన్ ఇవ్వలేదు. అయితే గత శనివారం(జూలై 11) అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ కరోనా బారిన పడ్డారని తెలుసుకున్న జాన్ సెనా వాళ్లు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాడు. ఈ క్రమంలోనే ఐశ్యర్య కోలుకోవాలని ఆమె ఫొటోను షేర్ చేసి ఉంటాడని అతని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

ఆసుపత్రికి ఐశ్వర్య..

ఆసుపత్రికి ఐశ్వర్య..

ఇక కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యి హోం ఐసోలేషన్‌లో ఉంటున్న ఐశ్వర్యరాయ్‌(46), ఆమె కుమార్తె ఆరాధ్య(8) శుక్రవారం ఆస్పత్రిలో చేరారు. వైరస్‌ లక్షణాలు స్పల్పంగా కనిపించడంతో ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతానికి బచ్చన్ ఫ్యామిలీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి.

మరోవైపు బిగ్‌బీ కూడా సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తమ ఆరోగ్య సమాచారాన్ని అభిమానులతో పంచుకుంటున్నారు. తాము త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్న అభిమానులు, సన్నిహితులందరికి ఆయన ట్విటర్‌ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు.

అప్పుడే రింగ్‌లోకి..

అప్పుడే రింగ్‌లోకి..

ప్రస్తుతం రింగ్‌కు దూరంగా ఉంటున్న జాన్‌ సెనా.. తన పూర్తి సమయాన్ని నటనకే కేటాయించాడు. అతను చివరి సారిగా ఫైర్ ఫ్లే ఫన్ హౌస్ మ్యాచ్‌లో కినిపించాడు. అయితే కరోనా పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాతే సెనా డబ్ల్యూడబ్ల్యూఈ రింగ్‌లో అడుగుపెట్టనున్నాడు. ఇక కరోనా కారణంగా బాక్సింగ్, రెజ్లింగ్, డబ్ల్యూడబ్ల్యూఈలు గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నాయి.

Story first published: Sunday, July 19, 2020, 13:07 [IST]
Other articles published on Jul 19, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+