For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

WWE దిగ్గజం హల్క్ హోగన్ మృతి

డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లింగ్ దిగ్గజం హల్క్ హోగన్ మరణించారు. 71 ఏళ్ల వయసులో గుండెపోటుతో ఫ్లోరిడాలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. రెజ్లింగ్‌లో తిరుగులేని రాజుగా పేరుగాంచిన హల్క్ హోగన్ మరణ వార్త.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డబ్ల్యూడబ్ల్యూఈ అభిమానుల శోకసంధ్రంలో ముంచెత్తింది. హల్క్ హోగన్ మరణ వార్తను డబ్ల్యూడబ్ల్యూఈ ధృవీకరించింది. సోషల్ మీడియా వేదికగా ఈ అమెరికా దిగ్గజానికి నివాళులర్పించింది.

హల్క్ హోగన్ అసలు పేరు టెర్రీ జిన్ బోలియా.. అమెరికాలోని ఒక నిర్దిష్ట ప్రాంతంలోనే ప్రాచుర్యం పొందిన రెజ్లింగ్ వినోదాన్ని డబ్ల్యూడబ్ల్యూఈ ద్వారా ప్రపంచవ్యాప్తంగా విసర్తించడంలో హల్క్ హోగన్ కీలక పాత్ర పోషించారు.

WWE Legend Hulk Hogan Dies At Age Of 71 After Cardiac Arrest

80వ దశకంలో రెజ్లింగ్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన హల్క్ హోగన్, తన బలమైన కండలు, హల్కామనియా నినాదంతో దశాబ్దాల పాటు ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. డబ్ల్యూడబ్ల్యూఈకి ముఖ చిత్రంగా మారాడు. అతని లెగ్ డ్రాప్ మూవ్ ప్రత్యర్థులకు సింహస్వప్నంగా మారింది. డబ్ల్యూడబ్ల్యూఈ రింగ్‌లో తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయించిన హోగన్.. 12 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లను గెలుచుకున్నారు.

కేవలం డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్‌గానే కాకుండా... పలు హాలీవుడ్ చిత్రాల్లో హల్క్ హోగన్ నటించారు. రాకీ త్రీ, తండర్ ఇన్ ప్యారడైజ్ వంటి చిత్రాలతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. హోగన్ మృతి పట్ల రెజ్లింగ్ కమ్యూనిటీతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సహచర రెజ్లర్లు, సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు. రెజ్లింగ్ చరిత్రలో హల్క్ హోగన్ స్థానం ఎప్పటికీ పదిలమని స్మరించుకుంటున్నారు.

Story first published: Thursday, July 24, 2025, 22:29 [IST]
Other articles published on Jul 24, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+