
ఆ రాత్రి ఏం జరిగిందని..
'ఘటన జరిగిన రోజు అతను ఎక్కడ ఉన్నాడు. ఏం చేశాడని ప్రశ్నించాం. అనంతరం సుశీల్ దాక్కునేందుకు సహకరించిన సన్నిహితులు, మిత్రుల వివరాలు కూడా అడిగాం. మేం అన్ని కోణాల్లో విచారించి నిజాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం'అని ఢిల్లీకి చెందిన పోలీస్ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఛత్రశాల్ స్టేడియంతో పాటు వివాదానికి కారణమైన మోడల్ హౌస్‌లోని ఫ్లాట్‌కు, షాలిమార్ బాగ్‌లో సుశీల్ నివాసం ఉంటున్న చోటుకు కూడా అతడిని పోలీసులు తీసుకెళ్లి పలు వివరాలు సేకరించారు. 'ఆ రోజు రాత్రి సుశీల్‌తో ఎవరెవరు ఉన్నారో తెలుసుకుంటున్నాం. అతను సాగర్‌ను కొడుతున్నట్లుగా వచ్చిన వీడియోపై మరింత స్పష్టత కోసం ప్రయత్నిస్తున్నాం' అని అధికారులు చెప్పారు.

పొంతన లేని సమాధానాలు..
మంగళవారం కూడా నాలుగు గంటలపాటు సుశీల్‌ను పోలీసులు ప్రశ్నించారు. ఈ క్రమంలో అతను పొంతనలేని సమాధానాలు ఇచ్చినట్లు తెలిసింది. పోలీసులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. 'విచారణ సందర్భంగా ఒకసారి సాగర్, సోనూలను తాను అక్కడకు లాక్కు రాలేదని, తగవు తీర్చేందుకు మాత్రమే వెళ్లానని అతను మాతో చెప్పాడు. మరోసారి దీని గురించే చెబుతూ తాను సాగర్‌ను కాస్త బెదిరించి భయపెట్టాలని మాత్రమే భావించానని కూడా చెప్పాడు. దీన్ని బట్టి చూస్తే అతని జవాబుల్లో తేడా స్పష్టంగా కనిపిస్తోంది.
సహజంగానే ఆందోళన గా ఉన్న సుశీల్ పదే పదే మాట మార్చాడు. గొడవ జరిగాక కూడా తాను ఛత్రశాల్ స్టేడియం లోనే ఉన్నానని, మరుసటి రోజు సాగర్ చనిపోయాడని తెలిశాకే పారిపోయానని మాతో చెప్పాడు' అని క్రైమ్ బ్రాంచ్ అధికారి ఒకరు వెల్లడించారు. అంతటి పహిల్వాన్ కూడా జైలు గోడల మధ్య కన్నీళ్లు కార్చినట్లు ఆయన చెప్పారు. 'లాకప్‌లో పెట్టగానే సుశీల్ ఏడ్చేశాడు. రాత్రంతా మెలకువతోనే ఉండి పలుమార్లు కన్నీళ్లు పెట్టుకున్న అతను ఏమీ తినేందుకు ఇష్టపడలేదు' అని కూడా ఆయన వివరించారు.

ఉద్యోగం ఊడింది..
ఊహించినట్లుగానే నార్తర్న్ రైల్వే సుశీల్‌ను సస్పెండ్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సీనియర్ కమర్షియల్ మేనేజర్‌గా అతను పని చేస్తున్నాడు. 'సుశీల్‌పై క్రిమినల్ కేసు నమోదు కావడంతోపాటు 48 గంటలకు మించి అతను పోలీస్ కస్టడీలో ఉన్నాడు. నిబంధనల ప్రకారం తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు సుశీల్‌ను సస్పెండ్ చేస్తున్నాం' అని నార్తర్న్ రైల్వేస్ అధికారికంగా ప్రకటించింది.

‘పద్మశ్రీ' వెనక్కి తీసుకుంటారా...
హత్య కేసులో నిందితుడిగా ఉన్న సుశీల్‌కు 2011 లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పౌర పురస్కారం 'పద్మశ్రీ'ని వెనక్కి తీసుకునే విషయంలో చర్చ సాగుతోంది. గతంలో ఇలాంటి ఆరోపణలు ఏ అవార్డీపై రాలేదు కాబట్టి దీని విషయంలో ప్రభు త్వం ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని భావి స్తోంది. అవార్డు నిబంధనల్లో ఇలా వెనక్కి తీసుకునే విషయంలో ఎలాంటి స్పష్టమైన సూచనలు లేకపోయినా... అవార్డు గ్రహీతలు నైతికపరంగా ఉన్నతంగా ఉండాలనే కోణంలో భారత రాష్ట్రపతి కి మాత్రం అవార్డును రద్దు చేసే అధికారం ఉంది.


Click it and Unblock the Notifications












