Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కుట్ర చేసే నన్ను డోపింగ్‌లో ఇరికించారు.. ఇన్నేళ్లయినా సీబీఐ ఏమీ తేల్చలేదు: రెజ్లర్‌ నర్సింగ్‌ యాదవ్‌

 Wrestler Narsingh Yadav Still Feels 2016 Doping was sabotage

న్యూఢిల్లీ: కుట్ర చేసే తనను డోపింగ్‌లో ఇరికించారని భారత స్టార్ రెజ్లర్ నర్సింగ్ యాదవ్ అన్నాడు. తనకు తెలిసి ఏ తప్పూ చేయలేదని, ఏ ఉత్ప్రేరకాన్ని తీసుకోలేదని, తిన్న ఆహారం, తాగునీరు ద్వారానే తనను కావాలని ఇరికించి ఒలింపిక్స్‌ ఆశల్ని చిదిమేశారని విచారం వ్యక్తం చేశాడు. ఇన్నేళ్లయినా కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) దోషులెవరనేది తేల్చలేదని అసహనం వ్యక్తం చేశాడు.

2016 రియో ఒలింపిక్స్‌కు ముందు ఈ మహారాష్ట్ర కుస్తీ వీరుడు నిషిద్ధ ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు తేలడంతో అతన్ని తప్పించడంతోపాటు నాలుగేళ్ల నిషేధం కూడా విధించారు. ఈ శిక్షాకాలం పూర్తవడంతో మళ్లీ కసరత్తు ప్రారంభించిన నర్సింగ్‌ తనకు జరిగింది ముమ్మాటికీ అన్యాయమేనని ఆవేదన వ్యక్తం చేశాడు.

ఎటూ తేల్చని సీబీఐ..

ఎటూ తేల్చని సీబీఐ..

గతేడాది సీబీఐ ఈ కేసు విషయమై కోర్టుకు నివేదిక సమర్పించింది. ఉద్దేశ పూర్వకంగా రెజ్లర్‌ను ఇరికించినట్లు, కుట్ర జరిగినట్లుగా ఆధారాలేవీ లేవని అందులో పేర్కొంది. దీనిపై నర్సింగ్‌ తరపు న్యాయవాదులు పిటిషన్‌ దాఖలు చేసినప్పటికీ కోర్టు నుంచి ఇంకా ఎలాంటి ఆదేశాలు రాలేదని సీబీఐ వర్గాలు తెలిపాయి. సీబీఐ అధికారుల్ని నర్సింగ్‌ సంప్రదిస్తే విచారణ ఇంకా కొనసాగుతోందని సమాధానం వచ్చింది.

నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటా..

నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటా..

ఎన్నో క్లిష్టమైన కేసుల్ని దర్యాప్తు చేసే సీబీఐ ఈ చిన్న కేసులో ఎందుకు జాప్యం చేస్తుందో తెలియడం లేదన్నాడు. తనపై తనకు నమ్మకముందని... నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానని పేర్కొన్నాడు. 31 ఏళ్ల రెజ్లర్‌ సోనెపట్‌లోని భారత స్పోర్ట్స్‌ అథారిటీ (సాయ్‌) కేంద్రంలో శిక్షణ శిబిరానికి వచ్చాడు. ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉండగా... ఈ నెల 15 నుంచి శిబిరం మొదలవుతుంది.

సత్తా చాటుతా..

సత్తా చాటుతా..

పురుషుల ఫ్రీస్టయిల్‌ 74 కేజీల విభాగంలో తనకు పోటీదారుడైన స్టార్‌ రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌పై అనుమానాలున్నాయా అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ ‘గతం గతః. దాన్ని ఇప్పుడు తవ్వాలని అనుకోవడం లేదు. అయితే నాకు జరిగిన అన్యాయం ఇంకొకరికి జరగొద్దనేదే నా కోరిక' అని అన్నాడు. వాయిదా పడిన టోక్యో ఒలింపిక్స్‌ తన సత్తా నిరూపించుకునేందుకు ఓ అవకాశంగా సద్వినియోగం చేసుకుంటానని చెప్పాడు. 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో నర్సింగ్‌ 74 కేజీల విభాగంలో బరిలోకి దిగి తొలి రౌండ్‌లోనే ఓడిపోయాడు.

Story first published: Wednesday, September 9, 2020, 12:02 [IST]
Other articles published on Sep 9, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+