Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

World Athletics Championship: మెక్‌లాలిన్‌ ప్రపంచ రికార్డు.. ఫెలిక్స్‌ రిటైర్మెంట్ వాయిదా!

World Athletics Championship: Sydney McLaughlin breaks womens 400 hurdles world record

యుజీన్‌: మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో అమెరికా మహిళా అథ్లెట్‌ సిడ్నీ మెక్‌లాలిన్‌ ప్రపంచ రికార్డు సృష్టించింది. రేసు మొదలైన వెంటనే ట్రాక్‌పై వాయువేగంతో దూసుకెళ్తూ... ఒక్కో హర్డిల్‌ను అలవోకగా అధిగమిస్తూ... ఒక్కో ప్రత్యర్థిని వెనక్కి నెడుతూ... ఎవరూ ఊహించని సమయంలో లక్ష్యానికి చేరిన సిడ్నీ మెక్‌లాఫ్లిన్‌ తన పేరిట నాలుగోసారి ప్రపంచ రికార్డును లిఖించుకుంది. ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో భాగంగా శనివారం జరిగిన మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌ ఫైనల్‌ ఈవెంట్‌లో 22 ఏళ్ల సిడ్నీ మెక్‌లాఫ్లిన్‌ 50.68 సెకన్లలో గమ్యానికి చేరి తొలిసారి స్వర్ణ పతకం సొంతం చేసుకోవడంతోపాటు ప్రపంచ రికార్డు సృష్టించింది.

ప్రపంచ రికార్డు సాధించినందుకు సిడ్నీకి లక్ష డాలర్లు (రూ. 79 లక్షల 84 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఫెమ్కే బోల్‌ (నెదర్లాండ్స్‌; 52.27 సెకన్లు) రజతం, దాలియా మొహమ్మద్‌ (అమెరికా; 53.13 సెకన్లు) కాంస్యం సాధించారు. బంగారు పతకం గెలిచే క్రమంలో సిడ్నీ గత నెల 25న 51.41 సెకన్లతో తానే నెలకొల్పిన ప్రపంచ రికార్డును సవరించింది. గత 13 నెలల కాలంలో సిడ్నీ ప్రపంచ రికార్డును తిరగరాయడం ఇది మూడోసారి కావడం విశేషం. మహిళల జావెలిన్‌ త్రో ఫైనల్లో భారత క్రీడాకారిణి అన్ను రాణి జావెలిన్‌ను 61.12 మీటర్ల దూరం విసిరి ఏడో స్థానంలో నిలువగా... డిఫెండింగ్‌ చాంపియన్‌ కెల్సీ బార్బర్‌ (ఆస్ట్రేలియా; 66.91 మీటర్లు) స్వర్ణం సాధించింది.

అమెరికా దిగ్గజ స్ప్రింటర్‌ అలిసన్‌ ఫెలిక్స్‌ వీడ్కోలు తాత్కాలికంగా వాయిదా పడింది. 4×400 మీటర్ల మిక్స్‌డ్‌ రిలే పరుగులో కాంస్యం గెలిచిన తర్వాత ఫెలిక్స్‌.. రిటైర్మెంట్‌ ప్రకటించింది. కానీ మహిళల 4×400 మీటర్ల రిలేలోనూ ఆమె పాల్గొనబోతున్నట్లు అమెరికా జట్టు వెల్లడించింది. ''మహిళల 4×400 మీటర్ల రిలేకు అందుబాటులో ఉండగలవా అని కోచ్‌లు అడిగారు. ఆ ప్రతిపాదనను ఎలా కాదనగలను. నా కూతురు స్టేడియంలో కూర్చొని ప్రోత్సహించడం మరిచిపోలేని జ్ఞాపకం. మరోసారి ఆ ఆనందాన్ని పొందాలని అనుకుంటున్నా'' అని 36 ఏళ్ల ఫెలిక్స్‌ చెప్పింది.

4×400 మీటర్ల మిక్స్‌డ్‌ రిలే పరుగులో కాంస్యం గెలిచి ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పతకాల సంఖ్యను ఫెలిక్స్‌ 19కి పెంచుకుంది. మహిళల 4×400 మీటర్ల పరుగులో అమెరికా స్టార్లు మెక్‌లాలిన్‌, దాలియా మహ్మద్‌, అటింగ్‌లతో కలిసి అలిసన్‌ బరిలో దిగనుంది. ఈ పరుగులో అమెరికా ఫేవరెట్‌ కావడంతో ఆమె ఖాతాలో మరో పతకం చేరడం ఖాయంగా కనిపిస్తోంది.

Story first published: Sunday, July 24, 2022, 10:53 [IST]
Other articles published on Jul 24, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+