న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్టార్ స్ప్రింటర్ కోల్‌మన్‌పై సస్పెన్షన్ వేటు

World 100m champion Christian Coleman provisionally suspended after third missed drugs test

న్యూయార్క్‌: స్ప్రింట్ లెజెండ్, జమైకా పరుగుల చిరుత ఉసేన్ బోల్డ్‌కు వారుసుడిగా పేరు తేచుకున్నఅమెరికన్‌ స్టార్‌ క్రిస్టియాన్‌ కోల్‌మన్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. 100 మీటర్ల వరల్డ్ చాంపియన్ అయిన కోల్‌మన్.. డోపింగ్‌ టెస్టుకు పిలిచినపుడు అందుబాటులోకి రాకపోవడంతో అథ్లెటిక్స్‌ ఇంటిగ్రిటీ యూనిట్‌ (ఏఐయూ) అతనిపై తాత్కాలిక నిషేధం విధించింది. ఈ విషయంపై తుది విచారణ పూర్తయ్యే వరకు అతను ఎలాంటి పోటీల్లో పాల్గొనరాదని ఆదేశించింది. గత ఏడాదే అతను 'ఎప్పుడు ఎక్కడ' నిబంధనను పాటించకపోవడంతో చర్య తీసుకోవాలనుకున్నప్పటికీ ప్రపంచ చాంపియన్‌షిప్‌ కావడంతో ఏఐయూ కాస్త వెనుకంజ వేసింది.

అయితే గడిచిన 12 నెలల కాలంలో మూడుసార్లు టెస్టులకు ప్రయత్నించినా...తాను ఎక్కడున్నాడనే సమాచారాన్ని కోల్‌మన్‌ ఇవ్వకపోవడంతో తాజాగా చర్యలు తీసుకున్నారు. దీనిపై కోల్‌మన్‌ స్పందిస్తూ గత డిసెంబర్‌ 9న ఏఐయూ నుంచి ఫోన్‌ కాల్‌ వచ్చినప్పటికీ తను క్రిస్‌మస్‌ షాపింగ్‌లో బిజీగా ఉండటం వల్లే కాల్‌కు స్పందించలేకపోయానని ట్వీట్‌ చేశాడు. ఈ ఒక్క ఫోన్‌ కాల్‌కే తనను సస్పెండ్‌ చేయడం విడ్డూరమని అన్నాడు. దీనిపై ఏఐయూ మాట్లాడుతూ పలుమార్లు ప్రయత్నించినా టెస్టులు చేసుకునేందుకు అతను అందుబాటులో లేకపోవడంతోనే ప్రపంచ డోపింగ్‌ నిరోధక సంస్థ (వాడా) నిబంధనల మేరకే చర్యలు తీసుకున్నామని తెలిపింది.

చహల్‌తో ఇన్‌స్టా పరిచయమే.. అంతకు మించి ఏం లేదు: మహిళా క్రికెటర్చహల్‌తో ఇన్‌స్టా పరిచయమే.. అంతకు మించి ఏం లేదు: మహిళా క్రికెటర్

Story first published: Thursday, June 18, 2020, 9:51 [IST]
Other articles published on Jun 18, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X