Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మేరీ కోమ్ కొడితే మాత్రం ఆరోది, కొసావోతో భారత్ భవిష్యత్‌కు ముప్పు

Womens World Boxing Championships: Mary Kom Leads Indian Contingent At Opening Ceremony. In Pictures

హైదరాబాద్: పది రోజుల పాటు జరగనున్న పదో అంచె మహిళల ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌‌కు భారత్ వేదికకానుంది. గురువారం ప్రారంభం కానున్న ఈ టోర్నీకి భారత్ రెండో సారి ఆతిథ్యమివ్వనుంది. గతంలో 2006లో ఇక్కడ జరిగిన టోర్నీలో భారత్‌ అత్యధికంగా 4 స్వర్ణాలు, ఓ రజతం, 3 కాంస్యాలతో మొత్తం ఎనిమిది మంది పతకాలు సా ధించి టేబుల్‌ టాపర్‌గా నిలిచింది. అదే స్థాయి ప్రదర్శనను చూపి ఈసారి సొంతగడ్డపై మరిన్ని పతకాలు సాధించాలనే పట్టుదలతో భారత బాక్సర్లు బరిలోకి దిగుతున్నారు.

ఫేవరెట్లుగా బౌట్‌లో మేరీకోమ్‌, సరితా దేవిలు

ఫేవరెట్లుగా బౌట్‌లో మేరీకోమ్‌, సరితా దేవిలు

కొన్నేళ్లుగా భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ.. అనుభవాన్ని గడించిన మేరీకోమ్‌, సరితా దేవిలు ఫేవరెట్లుగా బౌట్‌లో దిగనున్నారు. 48 కిలోల విభాగంలో తలపడనున్న మేరీ ఇప్పటికే ఐదుసార్లు ప్రపంచ విజేతగా నిలిచిన రికార్డు ఉంది. ఈ నేపథ్యంలో 35 ఏళ్ల మేరీ కోమ్ మహిళల దిగ్గజం కేటీ టేలర్‌ (ఐర్లాండ్‌)తో సమంగా ఉంది. ఇంకో పసిడిని సాధిస్తే మాత్రం చరిత్రే. ఈ ఏడాది కామన్వెల్త్‌ క్రీడలు, ఇండియా ఓపెన్‌, పోలెండ్‌ టోర్నీల్లో పసిడి పతకాలు నెగ్గి సూపర్‌ఫామ్‌లో ఉంది.

ఓడిపోయామని మీడియా ముందు కన్నీరు కార్చిన కెప్టెన్

మేరీకి స్వర్ణం గెలుచుకోవడం కష్టమే

మేరీకి స్వర్ణం గెలుచుకోవడం కష్టమే

టోర్నీలో స్వర్ణం నెగ్గడం మేరీకి అంత సులువు కాకపోవచ్చు. ఎందుకంటే, 2001 నుంచి ఆడుతున్న అంతర్జాతీయ స్టార్‌ బాక్సర్లు మేరీ విభాగంలో పోటీపడుతున్నా రు. వీరినుంచి మేరీకి పోటీ ఎదురయ్యే అవకాశముంది. ఈసారి విజేతగా నిలిస్తే మేరీకి ఇది ఆరో ప్రపంచ స్వర్ణం అవుతుంది. దీంతో, ప్రపంచ బాక్సింగ్‌లో అత్యధిక స్వర్ణాలు గెలుచుకున్న తొలి మహిళా బాక్సర్‌గా మేరీ చరిత్రకెక్కుతుంది.

ఆతిథ్య హక్కులను భారత్‌ కోల్పోయే ప్రమాదం

ఆతిథ్య హక్కులను భారత్‌ కోల్పోయే ప్రమాదం

కొసావో బాక్సర్‌ను టోర్నీలో ఆడేందుకు అనుమతించకపోతే, భవిష్యత్‌లో మేజర్‌ ఐవోఏ చెబుతోంది. ఇటీవల స్పెయిన్‌లో జరిగిన ప్రపంచ కరాటే ఛాంపియన్‌షిప్‌లో కొసావో దేశ అథ్లెట్లను అనుమతించకపోవడంతో.. మేజర్‌ ఈవెంట్లను నిర్వహించకుండా స్పెయిన్‌పై అనర్హత వేటు వేస్తున్నామని అన్ని దేశాల ఒలింపిక్‌ సంఘాలకు అంతర్జాతీయ ఒలింపిక్‌ సంఘం (ఐవోఏ) లేఖ రాసింది.

సమస్యను పరిష్కరించాలని కోరిన ఐవోఏ

సమస్యను పరిష్కరించాలని కోరిన ఐవోఏ

ఈ అంశంలో జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరించాలంటూ ఇప్పటికే క్రీడా శాఖను ఐవోఏ కోరింది. కానీ, ఐవోఏ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కొసావో బాక్సర్‌ డొంజెతాకు పోటీపడాల్సిన 60 కిలోల విభాగం డ్రాలో ఆమె పేరు లేదు. టోర్నీలో ఆయా విభాగాల బాక్సర్లు పోటీపడే డ్రాలను బుధవారం ప్రకటించారు. గురువారమే టోర్నీ ప్రారంభం కానుండడంతో సాదికు భారత్‌ రావడం దాదాపు అసాధ్యమని తేలడంతో ఆమె పేరును డ్రాలో చేర్చలేదని తెలిసింది.

Story first published: Thursday, November 15, 2018, 12:42 [IST]
Other articles published on Nov 15, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+