
ఐర్లాండ్ ఆరంభం నుంచే వికెట్లు కోల్పోయి
140 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా బరిలోకి దిగిన ఐర్లాండ్ ఆరంభం నుంచే వరుసగా వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్ షిల్లింగ్టన్(27), వన్‌డౌన్ బ్యాట్స్‌వుమెన్ జోసీ(30) మినహా మిగిలిన వాళ్లంతా సింగిల్ డిజిట్‌ను దాటలేకపోయారు. దీంతో 20ఓవర్లలో ఐర్లాండ్ మహిళల జట్టు 9 వికెట్ల నష్టానికి 101పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇలా ఐర్లాండ్‌కు టోర్నీలో రెండో ఓటమి ఎదురుకావడంతో కుంగిపోయింది.
సైనాకు చుక్కెదురు, సింధు, శ్రీకాంత్‌ల శుభారంభం

పాక్‌పై ఓటమి తమనెంతగానో నిరాశపరిచిందంటూ
మ్యాచ్ అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో ఐర్లాండ్ కెప్టెన్ లారా డెలానీ పాక్‌పై ఓటమి తమనెంతగానో నిరాశపరిచిందంటూ ఒక్కసారిగా కన్నీరు పర్వంతమయ్యారు. ప్రొఫెషనల్‌గా ఆడకపోవడం వల్లనే తమ జట్టుకు ఓటమి తప్పలేదంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఐసీసీ ట్విటర్ ఖాతా ద్వారా పంచుకుంది.
స్కోరు అక్కడితో ఆగేది కాదు
మేమే ప్రొఫెషనల్ ప్లేయర్లు అయితే స్కోరు అక్కడితో ఆగేది కాదు. ఇంకా బాగా రాణించేవాళ్లమంటూ ఐర్లాండ్ కెప్టెన్ లారా డెలానీ మీడియా సమావేశంలో భావోద్వేగానికి గురైంది. పాకిస్తాన్ జట్టుపై గెలుస్తామనే ఆశలు నిలబెట్టుకోకపోవడంతో ఆమె అలా స్పందించిందంటూ ఐసీసీ వరల్డ్ ట్వంటీ 20 ఆ వీడియోను పోస్టు చేస్తూ.. ట్వీట్ చేసింది.

సూపర్ ఫామ్‌లో ఉన్న భారత్.. మూడో టీ20లో
గ్రూపు-బిలో ఐర్లాండ్ గురువారం భారత్‌తో తలపడనుంది. ఇప్పటికే రెండు మ్యాచ్‌లను సునాయాసంగా గెలిచేసి సూపర్ ఫామ్‌లో ఉన్న భారత్.. మూడో టీ20ని గెలిచేందుకు సమాయత్తమవుతోంది. ఈ క్రమంలో గెలిస్తే మాత్రం దాదాపు సెమీస్ స్థానం ఖరారైనట్లే. ఇక గ్రూప్-బిలో మిగిలిన మ్యాచ్‌లు నామమాత్రమే ఆడాల్సిందే. ఫలితాలను బట్టి పాకిస్థాన్, న్యూజిలాండ్, ఐర్లాండ్ టోర్నీ నుంచి నిష్క్రమించనున్నాయి. ఆస్ట్రేలియా ఇప్పటికే సెమీస్ చేరింది.


Click it and Unblock the Notifications












